e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home సిద్దిపేట మీ ఆరోగ్యమే.. మాకు మహాభాగ్యం !

మీ ఆరోగ్యమే.. మాకు మహాభాగ్యం !

మీ ఆరోగ్యమే.. మాకు మహాభాగ్యం !
  • దుబ్బాక మెడికల్‌ అసోసియేషన్‌ సేవాభావం
  • కొవిడ్‌ బాధితులకు భోజనాలు, ఫలహారం
  • వెయ్యి మందికి శానిటైజర్లు, మాస్క్‌లు

దుబ్బాక, మే 18 : కరోనా మహమ్మారి పల్లె, పట్నం.. చిన్న, పెద్ద.. ఆడ, మగ అని తేడా లేకుండా ఎవరిని వదలడం లేదు. కరోనాను అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వారికి మానసిక ధైర్యంతో పాటు సరైన భోజనం అందిస్తే కరోనాను తరిమికొట్టొచ్చనే ఉద్దేశంతో కొవిడ్‌ బాధితులకు ఆత్మీయులుగా ఉంటూ దుబ్బాక మెడికల్‌ అసోసియేషన్‌ అండగా నిలుస్తున్నది. తమ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ దాతృత్వం చాటుకుంటున్నది.

కొవిడ్‌ బాధితులకు భోజన సౌకర్యంతో పాటు మందులు..
దుబ్బాక మున్సిపాలిటీ, మండలంలోని 40 మెడికల్‌ షాపుల నిర్వాహకులు అసోసియేషన్‌గా ఏర్పడ్డారు. ఈ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రెండేండ్లుగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. దుబ్బాక మండలం, పట్టణంలో సుమారు వెయ్యి మందికి ఉచితంగా శానిటైజర్లు, మాస్క్‌లు అందజేశారు. 15రోజులుగా దుబ్బాకలో కొవిడ్‌ బాధితులకు భోజనం, టిఫిన్‌ పంపిణీ చేస్తున్నారు. నిత్యం 20 మందికి భోజన వసతి కల్పించి వారికి అండగా నిలిచారు. ఇందులో కొందరికి మందులు కూడా అందజేశారు. అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కొవిడ్‌ బాధితులకు ఆరోగ్య సలహాలు, సూచనలు అందిస్తూ వారిలో మానసిక ధైర్యాన్ని నింపుతున్నారు. ‘మీ ఆరోగ్యమే.. మాకు మహా భాగ్యం’ అని దుబ్బాక మెడికల్‌ అసోసియేషన్‌ వారు అందించే సేవా కార్యక్రమాలను సద్వినియోగించుకోవాలని కోరుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. వీరి సేవలను అన్ని వర్గాలవారు అభినందిస్తున్నారు.

మానవ సేవే.. మాధవ సేవ

మానవ సేవే.. మాధవ సేవగా భావించి మా మెడికల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కొవిడ్‌ బాధితులకు అండగా నిలువాలన్న లక్ష్యంతో భోజనం, టిఫిన్లు, మందులను అందజేస్తున్నాం. కరోనా పై ప్రజలు అప్రమత్తంగా ఉండేందుకు పలు జాగ్రత్తలు వివరిస్తూ.. శానిటైజర్లు, మాస్క్‌లు అందజేశాం.

  • వడ్లకొండ శ్రీధర్‌, మెడికల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు

కొవిడ్‌ బాధితులకు అండగా..
కొవిడ్‌ పాజిటివ్‌ రాగానే చాలా మంది మాన సికంగా కుంగిపోతున్నారు. సొంతవారు సైతం దూరంగా ఉండటం కొంత బాధగా అనిపించిం ది. ఈ విషయంపై మా అసోసియేషన్‌లో చ ర్చించి, కొవిడ్‌ బాధితులకు అండగా నిలిచేం దుకు నిర్ణయించాం. మానసిక ధైర్యంతో పాటు సకాలంలో పౌష్టికాహారం అందిస్తున్నాం. సేవా చేసేందుకు మా అసోసియేషన్‌ వారంతా ముందుకు రావటం చాలా సంతోషంగా ఉంది.

  • బింగి ప్రభాకర్‌, మెడికల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మీ ఆరోగ్యమే.. మాకు మహాభాగ్యం !

ట్రెండింగ్‌

Advertisement