e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home సిద్దిపేట రైతుల సమస్యలు పరిష్కరిస్తాం

రైతుల సమస్యలు పరిష్కరిస్తాం

రైతుల సమస్యలు పరిష్కరిస్తాం

రాయపోల్‌ మే 17 : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని డీఆర్డీవో గోపాల్‌రావు స్పష్టం చేశారు. సోమవారం మండల పరిషత్‌ కార్యాలయంలో వివిధ శాఖాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం నిల్వలు ఉంచకుండా వెంటనే తూకం వేసి లారీల ద్వారా రైస్‌మిల్లర్లకు పంపించే విధంగా కృషి చేయాలని ఆయన మండల అధికారులను అదేశించారు. ఎక్కడా కూడా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఐకేపీ సిబ్బంది అక్కడే ఉండి రైతులు తెచ్చిన ధాన్యాన్ని పరిశీలించి ఎండిన తర్వాత వెంటనే తూకం వేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా వ్యాప్తంగా 224 ఐకేపీ ధాన్యం కోనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సరిపడే విధంగా గోనే సంచులను అందుబాటులో ఉంచామన్నారు. సమీక్షలో ఎంపీడీవో రాంరెడ్డి, ఐకేపీ ఏపీఎం దుర్గయ్య ఉన్నారు.

జోరుగా ధాన్యం కొనుగోళ్లు..
రాయపోల్‌, మే 17 : రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోళ్లు వేగంగా నిర్వహిస్తున్నామని జడ్పీటీసీ తిమ్మకపల్లి యాదగిరి పేర్కొన్నారు. లారీల కొరత నేపథ్యంలో జడ్పీటీసీ యాదగిరి ప్రజ్ఞాపూర్‌ నుంచి లారీని స్వయంగా నడుపుకుంటూ తిమ్మక్కపల్లి ఐకేపీ కేంద్రానికి తీసుకువచ్చారు. కొన్ని రోజుల నుంచి లారీలు రాకపోవడంతో కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో యాదగిరి లారీని తీసుకురావడంతో ధాన్యాన్ని లోడింగ్‌ చేశా రు. కాగా, మండలంలోని పలు గ్రామాల్లో డీఆర్‌డీవో గోపాలరావు ఐకేపీ కేంద్రాలను పరిశీలించారు. రైతులను రైస్‌ మిల్లర్లు ఇబ్బందులు పెట్టొద్దన్నారు.


చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తాం..
కోహెడ, మే 17 : యాసంగిలో రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని పీఏసీఎస్‌ చైర్మన్‌ దేవేందర్‌రావు అన్నారు. సోమవారం విజయనగర్‌ కాలనీలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి, మాట్లాడారు. రైతు లు నేరుగా ప్రభు త్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్ముకోవాలని సూ చించారు. ఇప్పటి వరకు కోహెడ పీఎసీఎస్‌ ఆధ్వర్యంలో 70,580 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. 75 శాతం మంది రైతులకు డబ్బులు ఖాతాలో జమ చేశామని వివరించారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లో కరోనా నిబంధనలు పాటించి జాగ్రత్తగా ఉండాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మెట్టు రాజేందర్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ లింగం, పీఏసీఎస్‌ సీఈవో మల్లికార్జున్‌ పాల్గొన్నారు.

ధాన్యం తడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి..
వర్షం కురిసే అవకాశం ఉన్నందునా రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీడీవో రఘువేందర్‌రెడ్డి సూచించారు. మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన తనిఖీ చేసి రైతులకు పలు సూచనలు చేశారు.

చివరి గింజనూ కొంటాం..
రైతులు పండిచిన చివరి గింజ వరకూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తుందని పీడీ గోపాల్‌రావు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులు అధైర్య పడొద్దని, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. అకాల వర్షానికి ధాన్యం తడువకుండా రైతులు టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఆయన వెంట ఎంపీడీవో మశ్చేందర్‌, ఐకేపీ ఏపీఎం కిషన్‌, మాజీ సర్పంచ్‌ ఆది వేణుగోపాల్‌ ఉన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రైతుల సమస్యలు పరిష్కరిస్తాం

ట్రెండింగ్‌

Advertisement