e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home సిద్దిపేట భక్తిశ్రద్ధలతో ‘రంజాన్‌'

భక్తిశ్రద్ధలతో ‘రంజాన్‌’

భక్తిశ్రద్ధలతో ‘రంజాన్‌'

సిద్దిపేట టౌన్‌, మే 14 : ముస్లింలు ఈదుల్‌ ఫితర్‌ (రంజాన్‌) పండుగను శుక్రవారం భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. కరోనా నేపథ్యంలో ఈద్గాలు, మసీదుల్లో సామూహిక ప్రార్థనలు నిర్వహించకుండా ఇండ్లలోనే కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. కరోనా మహమ్మారి త్వర గా అంతం కావాలని అల్లాను వేడుకున్నారు. బంధువుల ఇళ్లకు వెళ్లి, ఫోన్ల పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ముస్లింలు పెద్దలను స్మరించుకున్నారు.

ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా
దుబ్బాకటౌన్‌, మే 14 : దుబ్బాకలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎంపిక చేసిన ఐదుగురు ముస్లింలతో స్థానిక జమా మసీదులో ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మజీద్‌ కమిటీ అధ్యక్షుడు, మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యుడు ఎండీ ఆసీఫ్‌ మాట్లా డుతూ హిందువులు, ముస్లింలు సోదరభావంతో కలిసిమెలసి ఉండాలని అల్లాను ప్రార్థించామన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వనితాభూంరెడ్డి, కౌన్సిలర్లు ముస్లిం సోదరులకు రంజాన్‌ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఇండ్లలోనే ప్రత్యేక ప్రార్థనలు..
మిరుదొడ్డి/ కోహెడ/ వర్గల్‌/ తొగుట/ రాయపోల్‌, మే 14 : ఆయా మండల కేంద్రాలతోపాటు గ్రామాల్లో ముస్లింలు రంజాన్‌ పండుగ వేడుకలను కరోనా నిబంధనల ప్రకారం నిర్వహించుకు న్నారు. ఈ సందర్భంగా ముస్లింలు ఇండ్లలోనే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వర్గల్‌ మండలంలోని గౌరారం, వేలూర్‌, వర్గల్‌, నెంటూర్‌, మజీద్‌పల్లి, నాచారం, మాదారం, శాకారం గ్రామాల్లో రంజాన్‌ వేడుకలు నిరాడంబ రంగా జరిగాయి. లాక్‌డౌన్‌ అనుసరించి ఉదయమే ఇండ్లల్లో నే ముందస్తుగా ప్రార్థనలు నిర్వహించి, తరువాత మసీదుల్లో ఒక్కొ క్కరుగా భౌతికదూరం పాటిస్తూ ప్రార్థనలు చేశారు.

నిరాడంబరంగా రంజాన్‌ వేడుకలు
కొమురవెళ్లి/ జగదేవ్‌పూర్‌/ మర్కూక్‌, మే 14 : ఆయా మండలాల్లో రంజాన్‌ వేడుకలను ముస్లింలు కొవిడ్‌ నిబంధ నలకు అనుగుణంగా నిరాడంబరంగా నిర్వహించుకు న్నారు. మసీదు, ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. మర్కూక్‌ మండలం కర్కపట్లలో జరిగిన ప్రార్థనల్లో ఉపసర్పంచ్‌ అప్సర్‌, బాబా,అన్వర్‌,అప్జల్‌, మహమ్మద్‌ పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో రంజాన్‌ పర్వదిన వేడుకలు
మద్దూరు, మే 14 : మండల కేంద్రంతో పాటు మండలంలోని లద్నూర్‌, మర్మాముల, సలాఖపూర్‌, రేబర్తి తదితర గ్రామాల్లో ముస్లిం సోదరులు రంజాన్‌ వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా మసీదుల్లో ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్‌ మైనార్టీ నాయకుడు ఖాజా ఆరిఫ్‌. మసీద్‌ కమిటీ అధ్యక్షుడు తాజ్‌మహ్మద్‌, ఉపసర్పంచ్‌ ఆరీఫ్‌ పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
భక్తిశ్రద్ధలతో ‘రంజాన్‌'

ట్రెండింగ్‌

Advertisement