e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home సిద్దిపేట నిండుకుండలా హల్దీ ప్రాజెక్టు

నిండుకుండలా హల్దీ ప్రాజెక్టు

నిండుకుండలా హల్దీ ప్రాజెక్టు

నేడు అలుగుపారే అవకాశం
రెండు రోజుల్లో రెండు మీటర్లమేర చేరిన జలాలు
తరలివస్తున్న గోదారమ్మ మురిసిపోతున్న ఆయకట్టు రైతులు

వెల్దుర్తి, ఏప్రిల్‌ 14: మెదక్‌ జిల్లా మాసాయిపేట మండల పరిధిలోని హకీంపేట గ్రామశివారులో ఉన్న హల్దీ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. రెండు రోజులుగా వస్తున్న గోదావరి జలాలతో ఈ ప్రాజెక్టులో నీటిమట్టం పెరుగుతున్నది. రెండు రోజుల్లో సుమారు రెండు మీటర్ల వరకు ప్రాజెక్టులోకి నీరు చేరింది. మరో మీటరున్నర మేర నీరు చేరితే హల్దీ ప్రాజెక్టు పొంగి అలుగు పారనుంది. గురువారం రాత్రి లేదా శుక్రవారం ఉదయానికి అలుగు పారే అవకాశం ఉందని ఆయకట్టు రైతులు తెలిపారు. ప్రాజెక్టులో నీటిమట్టం పెరుగుతుండడంతో మాసాయిపేట, వెల్దుర్తి, చిన్నశంకరంపేట రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హల్దీ ప్రాజెక్టుతో పాటు సాగునీరు అందించే కుడి, ఎడమ కాలువల కింద 2900 ఎకరాల ఆయకట్టు ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీఆర్‌ఎస్‌ హయాంలోనే కాలువల పునర్నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ప్రాజెక్టు నించి కాలువల ద్వారా సాగునీరు వస్తే మూడు మండలాలు సస్యశ్యామలం అవుతాయని, సాగునీటితో పాటు వాగు పరీవాహక గ్రామాలకు తాగునీటి కష్టాలు శాశ్వతంగా తీరనున్నాయని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భూగర్భజలాలు సైతం భారీగా పెరిగే అవకాశం ఉందని, నీటి ఊటలు పెరిగి బోరుబావులు సైతం భారీగా నీటిని అందించనున్నాయని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

నేడు మత్తడి దుంకనున్న హల్దీవాగు ప్రాజెక్టు
కొండపోచమ్మ సాగర్‌ నుంచి సంగారెడ్డి కెనాల్‌ ద్వారా గోదావరి జలాలు తొమ్మిదో రోజూ బుధవారం పరుగులు తీశాయి. ఈ తొమ్మిది రోజుల్లో సిద్దిపేట జిల్లాలో తొమ్మిది చెక్‌డ్యామ్‌లు, నాలుగు చెరువులను, మెదక్‌ జిల్లాలో 12 చెక్‌డ్యామ్‌లను గంగమ్మ నింపింది. అపర భగీరథుడు, సీఎం కేసీఆర్‌ ఈనెల 6న సిద్దిపేట జిల్లా అవుసులపల్లి వద్ద సంగారెడ్డి అప్‌టెక్‌ తూం వద్ద గోదావరి జలాలను వదిలిన సంగతి తెలిసిందే. తొమ్మిదో రోజు గోదారమ్మ మంగళవాకం 1 కిలోమీటర్‌ దూరం ప్రయాణించింది. మెదక్‌ జిల్లా మాసాయిపేట మండల పరిధిలోని హకీంపేట గ్రామశివారులో ఉన్న హల్దీ ప్రాజెక్టును గోదావరి జలాలు నింపుతున్నాయి. రెండు రోజులుగా వస్తున్న గోదావరి జలాలతో ఈ ప్రాజెక్టులో నీటిమట్టం పెరుగుతున్నది. రెండు రోజుల్లో సుమారు రెండు మీటర్ల వరకు ప్రాజెక్టులోకి నీరు చేరింది. మరో మీటరున్నర మేర నీరు చేరితే హల్దీ ప్రాజెక్టు పొంగి అలుగు పారనుంది. గురువారం రాత్రి లేదా శుక్రవారం ఉదయానికి అలుగు పారే అవకాశం ఉందని ఆయకట్టు రైతులు తెలిపారు. దీని కింద 2900 ఎకరాల ఆయకట్టు ఉంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నిండుకుండలా హల్దీ ప్రాజెక్టు

ట్రెండింగ్‌

Advertisement