e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home సిద్దిపేట పేదోళ్లకే డబుల్‌ బెడ్రూం ఇండ్లు

పేదోళ్లకే డబుల్‌ బెడ్రూం ఇండ్లు

పేదోళ్లకే డబుల్‌ బెడ్రూం ఇండ్లు
  • సొంతింటి కలను సాకారం చేస్తున్న
  • సీఎం కేసీఆర్‌ ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి
  • జగదేవ్‌పూర్‌లో 250 డబుల్‌ ఇండ్లకు భూమిపూజ

జగదేవ్‌పూర్‌, మే13 : ఇల్లు లేని పేదోళ్లకే ప్రభుత్వం ఇండ్లు నిర్మించి ఇస్తున్నదని, పేదోడి సొంతింటి కలను సీఎం కేసీఆర్‌ సాకారం చేస్తున్నారని ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని గంధమల రోడ్డు పక్కన 2.5 ఎకరాల్లో 250 డబుల్‌ ఇండ్లను ఎంపీపీ బాలేశంగౌడ్‌, సర్పంచ్‌ లక్ష్మీశ్రీనివాస్‌రెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్‌ గుండారంగారెడ్డి, ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, ఎంపీటీసీ కవితాశ్రీనివాస్‌రెడ్డి తదితరులతో కలిసి ఎఫ్‌డీసీ చైర్మన్‌ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జగదేవ్‌పూర్‌లో ఇండ్లు లేని పేద కుటుంబాలకు డబుల్‌ ఇండ్లు మంజూరు చేయాలని మంత్రి హరీశ్‌రావు ద్వారా సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లగా, ముఖ్యమంత్రి మండల కేంద్రానికి 250 డబుల్‌ ఇండ్లు మంజూరు చేశారన్నారు. వాటిని అన్ని హంగులతో అద్భుతంగా నిర్మించుకుందామన్నారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు గ్రామంలో ఇండ్ల నిర్మాణానికి అనువైన స్థలాన్ని మండల అధికారులు పరిశీలించారన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో వెంటనే ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేసినట్లు తెలిపారు. నాలుగు వరుసల్లో అందమైన రోడ్లు, మంచి డ్రైనేజీ, విద్యుత్‌ దీపాలతో కాలనీని అందంగా నిర్మించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దారు శ్రీనివాస్‌రెడ్డి డీటీ కరుణాకర్‌, పార్టీ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌, మండల యువజన ప్రధాన కార్యదర్శి కరుణాకర్‌, నాయకులు నాగరాజు, కనకయ్య,గణేశ్‌,మహేశ్‌, బాలరాజు,కొంపల్లిశ్రీను, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పేదోళ్లకే డబుల్‌ బెడ్రూం ఇండ్లు

ట్రెండింగ్‌

Advertisement