e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home సిద్దిపేట ఆర్‌అండ్‌ఆర్‌కాలనీ సమీపంలో పరిశ్రమల స్థాపన

ఆర్‌అండ్‌ఆర్‌కాలనీ సమీపంలో పరిశ్రమల స్థాపన

ఆర్‌అండ్‌ఆర్‌కాలనీ సమీపంలో పరిశ్రమల స్థాపన
  • 600 ఎకరాల్లో అతిపెద్ద కాలనీ నిర్మాణం
  • తరలివస్తున్న ముంపు గ్రామాల ప్రజలు
  • సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి

గజ్వేల్‌ రూరల్‌, మే13: ముంపు గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా గ్రామాలను ఖాళీ చేస్తూ ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో వారికి కేటాయించిన ఇండ్లలోకి సంతోషంతో తరలివస్తున్నారని కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం బలవంతగా గ్రామాలను పోలీసుల సహకారంతో ఖాళీ చేసిన సంఘటనలు చూశాం గానీ, నేడు నిర్వాసిత గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా సంతోషంతో గ్రామాలను ఖాళీ చేయడం కనిపిస్తున్నదన్నారు. దేశ చరిత్రలోనే 600 ఎకరాల విస్తీర్ణంలో ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ నిర్మాణంను గజ్వేల్‌ సమీపంలోని మూట్రాజ్‌పల్లి వద్ద చేసుకోగా, నేడు పండుగ వాతావరణంలో గృహప్రవేశాలు జరుపుకుంటున్న దృశ్యాలను తెలంగాణలో తొలిసారి చూస్తున్నామన్నారు. సింగారం గ్రామస్తులు సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు, కలెక్టర్‌ల చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేయడం వారిలో ఉన్న సంతోషం కండ్ల ముందు కనిపిస్తున్నదన్నారు. కాలనీ సమీపంలోనే పరిశ్రమల స్థాపన జరుగుతుందని, అందులో నిర్వాసిత గ్రామాల వారికే అధిక ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. సీఎం కేసీఆర్‌ దూరదృష్టితో ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నరని దేశంలో ఎక్కడా లేని విధంగా ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇచ్చారన్నారు. ముంపు గ్రామాల ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌లు, కుల పెద్దలు, నిర్వాసితుల సహకారంతో అవరోధాలను అధిగమించగలిగామన్నారు.

వ్యవసాయ, పౌల్రీ ్టరంగాలకు అంతరాయం కలుగుకుండా చూడాలి
లాక్‌డౌన్‌ నేపథ్యంలో వ్యవసాయ, పౌల్ట్రీ అనుబంధ రంగాల కార్యకలాపాలకు, వాటిలో భాగస్వామ్యం అయ్యే సాంకేతిక నిపుణులు, కార్మికుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తల్తెతకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి సూచించారు. పనిచేసే కార్మికులకు, వాహనాలకు పాస్‌లను జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. గురువారం సిద్దిపేటలో కలెక్టర్‌ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆయా రంగాల కార్మికులు, కార్యకలాపాలకు ఇబ్బందులు కలుగకుండా చూసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్‌ రెవెన్యూ, పోలీస్‌ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

జిల్లా పరిధిలో వ్యవసాయ అనుబంధ రంగాలు ధాన్యం కొనుగోలు, సేకరణ మూవ్‌మెంట్‌, ట్రాన్ప్సోర్ట్‌లో భాగస్వామ్యయ్యే సిబ్బంది, రైతులు, కార్మికులకు జిల్లా వ్యవసాయశాఖ అధికారి శ్రవణ్‌కుమార్‌ ఇంటర్‌ డిస్ట్రిక్‌ పాస్‌లను జారీ చేయాలన్నారు. ఇప్పటివరకూ జిల్లాలో 25 మాత్రమే ధాన్యం సేకరణ చేశామన్నారు. ఇతర జిల్లాల నుంచి జిల్లాకు అమ్మకానికి వచ్చే ధాన్యాన్ని అనుమతించొద్దన్నారు. ధాన్యం సేకరణ విషయంపై యజమానులతో అదనపు కలెక్టర్‌ టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించాలన్నారు. సీపీ జోయల్‌ డెవిస్‌ మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ట్రాన్స్‌పోర్ట్‌పై రిస్ట్రిక్షన్స్‌ లేవన్నారు. లాక్‌డౌన్‌ అనంతరం అంతర్‌ జిల్లా, రాష్ట్ర రవాణా పాస్‌ల కోసం పోలీస్‌శాఖ సిద్దం చేసిన అప్లికేషన్లులో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో దీనిని స్పెషల్‌ బ్రాంచ్‌ అధికారి క్రాంతి నోడల్‌ అధికారిగా నియమించిన్నట్లుగా ఆయన పేర్కొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆర్‌అండ్‌ఆర్‌కాలనీ సమీపంలో పరిశ్రమల స్థాపన

ట్రెండింగ్‌

Advertisement