e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 12, 2021
Home జిల్లాలు ఇంటి పత్రిక.. పేదల గొంతుక

ఇంటి పత్రిక.. పేదల గొంతుక

ఇంటి పత్రిక.. పేదల గొంతుక
  • అన్నివర్గాల సొంతం ‘నమస్తే తెలంగాణ’
  • తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక
  • బంగారు తెలంగాణలో తనదైన పాత్ర
  • ‘ధర్మగంట’తో అధికారుల అవినీతి బట్టబయలు
  • విభిన్న కథనాలతో అందరి ముందుకు
  • తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక
  • నేటితో పదేండ్లు పూర్తి చేసుకోబోతున్న శుభ సందర్భం

ఇంటి పత్రికకు పదేండ్లు..
నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ
బావుట నమస్తే తెలంగాణ ..!
ఉద్యమమే ఊపిరిగా తెలంగాణ గడ్డపై
ఉదయించిన ఇంటి పత్రిక.. నమస్తే తెలంగాణ..!
తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టి,
అవమానాలు, అన్యాయాలపై
తన అక్షరాలతో కవాతు చేసిన
ఉద్యమ సేనాని.. నమస్తే తెలంగాణ..!
పోరాటంలో అసువులు బాసిన అమరుల
కుటుంబాలను అక్కున చేర్చుకున్న
ఆత్మగల్ల ప్రతిక..‘నమస్తే తెలంగాణ’..!
తెలంగాణ భాష, యాస, సంస్కృతి వైభవాలను
నలుదిశలా ఎలుగెత్తి కీర్తించిన
తెలంగాణ గుండెచప్పుడు.. నమస్తే తెలంగాణ..!
సాధించిన తెలంగాణలో ప్రజల స్వప్నాలను
సాకారం చేస్తున్న సర్కారుకు అండగా నిలిచిన
ప్రజల గొంతుక..నమస్తే తెలంగాణ..!
అవినీతి, అన్యాయాలపై ‘ధర్మగంట’ మోగించి,
ప్రజలకు బాసటగా నిలిచిన
ప్రజల వారధి..నమస్తే తెలంగాణ..!
విభిన్న శీర్షికలతో.. సరికొత్త వార్తలతో
సమస్త తెలంగాణ ప్రజల లోగిళ్లను ‘నమస్తే’ అని
కమ్మనిపలకరింపుతో నిత్యం ప్రజలకు
చేరువవుతున్న అసలు సిసలు నికార్సయిన తెలంగాణ పత్రిక..
మీ..నమస్తే తెలంగాణ..!

-ఎం. వెంకటేశ్వర్లు, మద్దూరు

తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో కీలక భూమిక పోషించింది ‘నమస్తే తెలంగాణ పత్రిక. పేదల గొంతుకగా.. ఇంటి పత్రికగా తెలంగాణ సమాజానికి సుపరిచితం. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా.. అంచెలంచెలుగా ఎదుగుతూ అన్నివర్గాల మన్నలను ‘నమస్తే తెలంగాణ’ పొందింది. నేడు పదేండ్లు పూర్తిచేసుకొని పదకొండో ఏడాదిలోకి అడుగు పెడుతున్నది. ఇన్నేండ్ల కాలంలో తెలంగాణ ప్రజల గొంతుకగా నిలిచింది. సమైక్య పాలకుల కుట్రలు, కుతంత్రాలను ఎండగట్టింది. నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాలను వెలుగుతీసింది. స్వరాష్ట్రం వచ్చే వరకు అలుపెరుగని పోరాటం చేసింది. రాష్ట్ర ఏర్పాటు నుంచి బంగారు తెలంగాణ అభివృద్ధ్దిలో భాగస్వామ్యమైంది. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తూనే…ప్రజల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నది. ‘ధర్మగంట’ ద్వారా భూసమస్యలపై పోరాటం చేసింది. అవినీతి అధికారుల భాగోతాలను బయట పెట్టి ప్రజాకోర్టులో నిలబెట్టింది. విద్యార్థులకు నిపుణ, రైతులకు ఎవుసం, మానవీయ కోణాలు, పాఠకులు మెచ్చేలా ప్రత్యేక కథనాలను అందించి అందరి ఆదరాభిమానాలు పొందింది. పదకొండో వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంలో అందిస్తున్న ప్రత్యేక కథనం.
-సిద్దిపేట,(నమస్తే తెలంగాణ ప్రతినిధి)

తెలంగాణ ఉద్యమంలో తనదైన ముద్ర..
తెలంగాణ రాష్ట్ర సాధనలో ‘నమస్తే తెలంగాణ’ తనదైన శైలిలో పోరాటం చేసింది. సీమాంధ్రుల కుట్రలు, కుంత్రాలను బట్టబయలు చేసిం ది. ఉద్యమ సమయంలో అందరి కన్నా ముం దుండి అలుపెరగని పోరాటం చేసింది. రాస్తారోకోలు, రోడ్లపై వంటావార్పు, రైలు రోకోలు, తెలంగాణ రాష్ట్ర సాధన దీక్షలు.. ఇలా ప్రతి అంశాన్ని బాగా కవర్‌ చేసి జిల్లా ప్రజలకు అందించింది. ఇంటి పేపర్‌గా ముద్రవేసుకుంది. ఉద్యమకారు లు, విద్యార్థులు, యువత పోరాటాలకు అండగా ఉండి, వారు చేసే కార్యక్రమాలను ఎప్పటికప్పుడు అందించి అన్నివర్గాల చేత శభాష్‌ అనిపించుకుంది. తెలంగాణ ఉద్యమాన్ని ఢిల్లీ దాకా తీసుకుపోవడంలో తనవంతు పాత్రను పోషించింది. ఉద్యమ కాలంలో అన్నివర్గాల వారు మెచ్చేలా జిల్లా నలుమూలలకు సమాచారాన్ని అందించింది. సీమాంధ్రలు తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చే కుట్రలు చేసినప్పడు ఎప్పటి కప్పుడు ఎండగట్టింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక బంగారు తెలంగాణలో ‘నమస్తే తెలంగాణ’ భాగస్వామ్యమైంది. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో ఏర్పడిన టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నది. నాడు ఉద్యమంలో కీలక భూమిక పోషించింది. బంగారు తెలంగాణ సాధనలో ముఖ్య భూమిక పోషిస్తున్నది. గ్రామాల, మండలాల పూర్వచరిత్రను నేటితరానికి తెలియజేసింది. పూరాతన ఆలయాల భూముల కబ్జాలను వెలికితీసి ఆ భూములను కాపాడింది. వక్ఫ్‌ భూములు అన్యాక్రాంత అయితే వాటిని వెలికి తీసింది. ఇలా ఎన్నో కథనాలను అందించింది.

ప్రాజెక్టులపై ప్రత్యేక కథనాలు..
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులపై ప్రత్యేక కథనాలను ప్రజలకు కండ్లకు కట్టిన విధంగా ముందుంచింది ‘నమస్తే తెలంగాణ’. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జిల్లాలో నిర్మాణమైన ప్రాజెక్టుల పనుల పురోగతి నుంచి గోదావరి జలాలు వచ్చి చెరువులు, కుంటలు నిండి బం గారు పంటలు పండే దాక వరుస కథనాలు అందించింది. సమైక్య రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణానికి ఏండ్లు పడితే, ప్రస్తుత టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం ఒకటి రెండు ఏండ్లలోనే పూర్తి చేసింది. ప్రాజెక్టు నిర్మాణంలో భూసేకరణతో పాటు రిజర్వాయర్‌ నిర్మాణం, కాల్వల తవ్వకాలు ఇలా ప్రతి పనిలో ఎవరెవరి పాత్ర ఎంత ఉంది అనే విషయాన్ని ప్రజల ముందు ఉంచింది. మండుటెండల్లో గోదావరి జలసవ్వడులు చేస్తూంటే ఆ దృశ్యాలను గోదావరి పారినన్ని రోజులు ప్రజల ముందు ఉంచింది. గోదావరి జలాలు రావడంతో ఈ ఏడాది భూమికి బరువయ్యేలా పంట పండింది. వీటిపై ప్రత్యేక కథనాలుగా అందించి అందరి మన్ననలను పొందింది.

చెరువులపై ప్రత్యేక కథనాలు..
సమైక్య రాష్ట్రంలో అప్పటి సీమాంధ్ర పాలకుల తీరుతో తెలంగాణలో చెరువులు ఆనవాళ్లు కోల్పో యి. ఏ చెరువు ఎంత శిఖం ఉందో తెలియని పరిస్థితి.. ఏ చెరువు చరిత్ర ఏంటో ఎవరికీ తెలియని పరిస్థితిలో ‘నమస్తే తెలంగాణ’ చెరువులపై వరుస కథనాలను అందించింది. చెరువుల చరిత్రను తెలియజేసింది. ప్రభుత్వం ‘మిషన్‌ కాకతీయ’ పథకం ద్వారా చెరువుల పూడికతీత చేపట్టింది. ‘మిషన్‌ కాకతీయ’ పథకం ప్రాధాన్యతను తెలియజేస్తూనే చెరువుల పరిరక్షణకు నడుం కట్టింది. మిషన్‌ కాకతీయ పథకం ద్వారా ఏటా 25శాతం చొప్పున నాలుగేండ్లలో చెరువులను ప్రభుత్వం పునరుద్ధ్దరించడంతో చెరువులు నిండు కుండలా కనిపిస్తున్నాయి. గతంలో చెరువులు పూడిక మట్టితో నిండిపోయి పిచ్చి చెట్లతో ఉండేవి. చెరువు మట్టితో కలిగే లాభాలతో పాటు చెరువు నిండితే ఊరందరకి ఉపాధి ఉంటుంది. వీటిపై వరుస కథనాలను అందించింది. కాకతీయుల కాలం నాటి చెరువులకు పూర్వవైభవం రావడంతో కులవృత్తులకు ఉపాధి లభిస్తున్నది.

‘ధర్మగంట’ ద్వారా …
‘ధర్మగంట’ ద్వారా అవినీతి అధికారుల భాగోతాలను ‘నమస్తే తెలంగాణ’ బట్టబయలు చేసింది. సిద్దిపేట జిల్లాలోని బెజ్జంకి మండల కేంద్ర శివారులోని సర్వే నంబరు 759 భూ వ్యవహారంలో అవినీతికి పాల్పడి లంచాలు వాపస్‌ ఇచ్చిన అప్పటి బెజ్జంకి, కోహెడ తహసీల్దార్లపై ప్రత్యేక కథనాలు ప్రచురించింది. ఓ తహసీల్దార్‌ ఏకంగా తాను లంచంగా తీసుకున్న డబ్బులను తిరిగి ఇస్తాను. ఎవరికీ చెప్పకంటూ బాధిత రైతుకు ఫోన్‌ చేసి స్వయంగా చెప్పిన విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. ‘నీకు ఇవ్వాల్సిన రూ.60 వేలు, ఇంకో రైతుకు ఇవ్వాల్సిన రూ.లక్ష తిరిగి మీ ఇంటికి పంపిస్తాను. దండం పెట్టి చెబుతు న్నా.. ఎవరికీ చెప్పకంటూ బతిమిలాడుకున్న ఉ దంతాలు’, సిద్దిపేటలో “కుదిరితే బేరం.. లేదం టే కూల్చుడే” ఇలా రెవెన్యూ అధికారుల అవినీతిని బయటకు తీసి అప్పట్లో సంచనాలను సృ ష్టించింది. అవసరమైతే కమాన్‌ను రాసిస్తా.. అం టూ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలపై వరుస కథనా లు చేసింది. వివిధ శాఖల్లో జరిగిన జరుగుతున్న అవినీతిని ఎప్పటికప్పుడు ఏదో రూపంగా బయటకు తీస్తూనే ఉంది. రైతులకు జరిగిన అన్యాయంపై జిల్లాలోని పలువురు రైతులు ధర్మగంట (నమస్తే తెలంగాణ)ను ఆశ్రయించారు. ఇలా పలు భూ సమస్యలతో బాధపడుతున్న రైతులు, మున్సిపల్‌ పరిధిలో అక్రమ లేఅవుట్లలో నిర్మాణాలు తదితర సమస్యలను ధర్మగంటకు విన్నవించుకున్నారు. ధర్మగంట ద్వారా ఎన్నో కథనాలను ప్రభు త్వం దృష్టికి తీసుకపోయి పరిష్కారం చూపింది ‘నమస్తే తెలంగాణ’.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఇంటి పత్రిక.. పేదల గొంతుక

ట్రెండింగ్‌

Advertisement