e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home జిల్లాలు ప్రయాణికులకు అనుమతి లేదు

ప్రయాణికులకు అనుమతి లేదు

ప్రయాణికులకు అనుమతి లేదు

ఆటోలో ఇద్దరు, కారులో ముగ్గురికి మాత్రమే..
నేటి నుంచి మెదక్‌ జిల్లా వ్యాప్తంగా వాహనాల తనిఖీలు
జిల్లా రవాణాధికారి శ్రీనివాస్‌గౌడ్‌

మెదక్‌ మున్సిపాలిటీ, జూన్‌ 3 : గూడ్స్‌ వాహనాల్లో ప్రయాణికులను తీసుకెళ్తే సీజ్‌ చేస్తామని జిల్లా రవాణాధికారి శ్రీనివాస్‌గౌడ్‌ హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం మెదక్‌ జిల్లా కేంద్రంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్‌ నిబంధనలకు వ్యతిరేకంగా వాహనాలను నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆటోలో ఇద్దరు ప్రయాణికులు మా త్రమే ప్రయాణించాలని, కారులో డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు ప్రయాణికులకు మాత్రమే అనుమతి ఉందన్నారు. గూడ్స్‌ వాహనాల్లో ప్రయాణికులను తీసుకెళ్తే ఐసొలేషన్‌ కేంద్రానికి పంపుతామన్నారు. సీజ్‌ చేసిన వాహనాలను జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు కోర్టుకు పంపిస్తామన్నారు. శుక్రవారం నుంచి జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టనున్నట్లు డీటీవో వెల్లడించారు. వాహనాల తనిఖీల్లో ఎంవీఐ రిజర్డ్స్‌, హోంగార్డు సత్యం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్రయాణికులకు అనుమతి లేదు

ట్రెండింగ్‌

Advertisement