e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home మెదక్ వార్‌ వన్‌సైడే

వార్‌ వన్‌సైడే

వార్‌ వన్‌సైడే
  • సిద్దిపేట బల్దియాపై మరోమారు ఎగురనున్న గులాబీ జెండా
  • 43వార్డుల్లో టీఆర్‌ఎస్‌ క్లీన్‌స్వీప్‌ అవకాశాలే..!
  • కాంగ్రెస్‌, బీజేపీ నామమాత్రమే..

సిద్దిపేట, ఏప్రిల్‌ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిద్దిపేట మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటర్లు డిసైడ్‌ అయిపోయారు. సిద్దిపేట పురపోరు వన్‌సైడ్‌ కానున్నది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలవనున్నారు. బల్దియాపై గులాబీ జెండా మరోమారు రెపరెపలాడనున్నది. పోలింగ్‌ సమయానికి మరికొన్ని గంటలే మిగిలింది. ఇప్పుడు అంతా ఇదే చర్చ.. ఎక్కడ చూసినా సిద్దిపేట అభివృద్ధిపైనే చర్చ. మంత్రి హరీశ్‌రావు కష్టపడి రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా సిద్దిపేట పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన నేతకు అన్ని వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించుకొని అండగా ఉండాలని నినదిస్తున్నారు. ఐదు రోజులుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన నేతలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో 43 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రచారంలో మంచి జోష్‌లో కనిపించారు. ఒక వైపు మండు టెండలు, మరోవైపు రోజురోజుకూ విజృంభిస్తున్న కరోనా నేపథ్యంతో ఐదు రోజుల పాటు ముమ్మరంగా అన్ని పార్టీలు తమ ఎన్నికల ప్రచారం నిర్వహించాయి.

నాలుగు రోజుల పాటు మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట పట్టణంలో ఎండను సైతం లెక్క చేయకుండా అన్ని వార్డుల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు మంత్రి హరీశ్‌రావు చేసిన పనులను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఇదే క్రమంలో ఇంటి ముందు అభివృద్ధి.. కంటి ముందు అభ్యర్థి అన్న నినాదం ప్రచారంలో ముందుకు కదిలారు. సిద్దిపేట పట్టణంలో చేసిన అభివృద్ధి పనుల్లో కొన్నింటిని చెప్పుకుంటే నిరుపేదలకు గూడు లేనివారికి నర్సపురం వద్ద సుమారుగా 2200 ఇండ్లు కట్టించి ఇచ్చారు. వారంతా ఇవాళ ఆత్మగౌరవంతో బతుకుతున్నారు. పరవళ్లు తొక్కె పచ్చదనం సిద్దిపేట పట్టణానికి ఒక పచ్చలహారం. సిద్దిపేట పట్టణానికి నలు దిక్కులా అభివృద్ధి పనులు జరిగాయి. సరికొత్త అందాలతో కోమటి చెరువు సింగారించుకుంది. మెడికల్‌ కళాశాల, అధునాతన వైద్యం, విద్య, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ, స్టేడియం, సీసీ రహదారులు, సుడా, కూడళ్లు, చెరువులు ఇలా ఎన్నో జరిగాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అభివృద్ధికి నిర్వచనం సిద్దిపేట. భవిష్యత్‌ తరాల కోసం బాటలు వేసుకున్న

ఎర్రటి ఎండ, కరోనాలో ఎందుకు తిరుగుతున్నవ్‌?

‘ఏం బిడ్డా.. ఎర్రటి ఎండ, కరోనా టైంల ఎం దుకు తిరుగుతున్నవ్‌.. మీకు గాక ఇంకెవరికి ఓట్లే స్తాం.. నువ్వు చేసిన పనులు మాకు కండ్ల ముందట కనిపిస్తున్నాయి. ఆపదైనా, సంపదైనా, నువ్వే కదా.. నిన్ను మేం దూరం చేసుకుంటామా.. ఇక్కడ వేరేటోళ్లు గెలిస్తే మా బాధలు ఎవలు చూసుకుంటరు..? తప్పకుండా కారు గుర్తుకే ఓటేస్తం’.. అంటూ పలు వార్డులోని ప్రజలు మంత్రి హరీశ్‌రావుకు తన ఎన్నికల ప్రచారంలో ఓటర్లు తేల్చి చెప్పారు. సిద్దిపేట పురపోరులో ఆయా వార్డుల నుంచి అందుతున్న సంకేతాలతో టీఆర్‌ఎస్‌ పార్టీ క్లీన్‌స్వీప్‌ ఖాయం కానున్నది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వార్‌ వన్‌సైడే

ట్రెండింగ్‌

Advertisement