e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Home జిల్లాలు Janagama |హత్య కేసులో విచారణ.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్మ

Janagama |హత్య కేసులో విచారణ.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్మ

చేర్యాల : మండలంలోని ముస్త్యాల గ్రామానికి చెందిన తాటిపాముల భాస్కర్‌(25) అనే యువకుడు మద్దూరు మండలంలోని సలాక్‌పూర్‌ శివారులో చెట్టుకు ఉరేసుకుని మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా పోలీసులు తమ కుమారుడిని హత్య కేసును ఒప్పుకోవాలని కొట్టడంతో ఆత్మహత్య చేసుకున్నాడని, చేర్యాల పోలీసులపై చర్యలు తీసుకోవాలని మృతుడి తండ్రి తిరుపతి, బంధువులు చేర్యాల పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కాగా గ్రామానికి చెందిన దేవరాయ ఎల్లమ్మ అనే మహిళను ఈ నెల 8వ తేదీన రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి ఆమెపై ఉన్న బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లిన ఘటనలో పోలీసులు గ్రామానికి చెందిన పలువురు అనుమానితులను విచారిస్తున్నారు. తమ కుమారుడిని చేర్యాల పోలీసులు ఈ నెల 13వ తేదీన పిలిపించి విచారణ పేరిట కొట్టడటంతోపాటు చిత్రహింసలు పెట్టి హత్య కేసును అంగీకరించాలని వేధించడంతోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని, తమకు న్యాయం చేయాలని మృతుడి తండ్రి తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్య కేసు విచారణలో భాగంగా గ్రామానికి చెందిన 20 మంది అనుమానితులను విచారించినట్లు సీఐ శ్రీనివాస్రెడ్డి విలేకరులకు తెలిపారు.

- Advertisement -

తమకు లభించిన ఆధారాల మేరకు స్థానికులే ఆ మహిళను హత్య చేసే అవకాశం ఉండటంతో విచారణలో భాగంగా భాస్కర్‌ను సైతం పిలిపించామని, ఆ సమయంతో తమకు కైం మీటింగ్‌ ఉండడంతో వెళ్లిపోయామని, భాస్కర్‌కు జ్వరంగా ఉన్నట్లు తమ సిబ్బంది తెలిపిన వెంటనే అతడిని ఇంటికి పంపించాలని ఆదేశించినట్లు సీఐ తెలిపారు. హత్యకు గురైన మహిళతో భాస్కర్‌ పలుమార్లు ఫోన్లో మాట్లాడని, రాత్రి 2, 3 గంటల సమయంలో మాట్లాడినట్లు కాల్‌డాటా ఉందన్నారు. విచారణకు వెళితే తాను హత్య చేసినట్లు నిర్ధారణ అవుతుందోమోననే ఆందోళనకు గురై అతడు ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana