e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home News పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట : మెదక్‌ ఎంపీ ప్రభాకర్‌రెడ్డి

పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట : మెదక్‌ ఎంపీ ప్రభాకర్‌రెడ్డి

జగదేవ్‌పూర్‌ : పల్లెలను పట్టణాలకు దీటుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేస్తున్నారని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మండల కేంద్రంలో జడ్పీ చైర్‌పర్సన్‌ రోజారాధాకృష్ణశర్మ,
ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ దేవేందర్‌రెడ్డిలతో కలిసి గ్రామంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.

రూ.22లక్షలతో నిర్మించిన రైతువేదిక భవనం, రూ. కోటితో నిర్మించిన ఫంక్షన్‌హాలు, రూ.24లక్షలతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనం, రూ.35 లక్షలతో చేపట్టిన బస్టాండ్‌, రూ. 50 లక్షలతో నిర్మించిన కూరగాయల మార్కెట్‌ను వారు ప్రారంభించారు. అనంతరం మార్కెట్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మెదక్‌ ఎంపీ మాట్లాడుతూ పల్లెల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నదన్నారు. అన్నదాతల ఐకమత్యానికి రైతువేదిక భవనాలను నిర్మించారన్నారు. రాబోయే కాలంలో ప్రతి పేదవాడు ఆర్థిక పురోగతి సాధించేలా సీఎం కేసీఆర్‌ అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం గ్రామంలో యువజన సంఘాలఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయకుడిని ఎంపీ దర్శించుకోగా ఆయనను పలువురు యువకులు శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, గజ్వేల్‌ ఏఎంసీ చైర్మన్‌ అన్నపూర్ణశ్రీనివాస్, ఎంపీపీ బాలేశంగౌడ్‌, జడ్పీటీసీ సుధాకర్‌రెడ్డి ,సర్పంచ్‌ లక్ష్మీశ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ కవిత, మండల కో-ఆప్షన్‌ సభ్యులు ఎక్బాల్‌, ఆత్మకమిటీ చైర్మన్‌ రంగారెడ్డి, నరేశ్‌, కిరణ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, శ్రీనివాస్‌రెడ్డి, గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మండల నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement