చేర్యాల, అక్టోబర్ 17 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో ఆదివారం భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.10 వేల మంది భక్తులు ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు మొక్కులు చెల్లించుకున్నట్లు ఆలయవర్గాలు తెలిపాయి. భక్తులు శనివారం సాయంత్రం నుంచే కొమురవెల్లికి చేరుకున్న ఆదివారం స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడి బియ్యం, కేశఖండన, గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టడం వంటి మొక్కులు తీర్చుకున్నారు.