సోమవారం 21 సెప్టెంబర్ 2020
Siddipet - Jan 15, 2020 , 00:26:19

72 వార్డులు 327 మంది.. తేలిన బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య

72 వార్డులు 327 మంది..  తేలిన బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య
  • ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం
  • నేటి నుంచి హోరెత్తనున్న ప్రచారం
  • బీ ఫారాలు సమర్పించిన అభ్యర్థులు
  • అభ్యర్థుల జాబితా ప్రకటించిన ఎన్నికల అధికారులు
  • భారీ సంఖ్యలో నామినేషన్లు ఉపసంహరించుకున్న అభ్యర్థులు
  • అత్యధికంగా దుబ్బాకలో 109, అత్యల్పంగా చేర్యాలలో 67 మంది పోటీ
  • నాలుగు పురపాలికల్లో 327 మంది పోటీ

 దుబ్బాక టౌన్‌: దుబ్బాక మున్సిపల్‌ ఎన్నికల బరిలో 109 మంది ఉన్నట్లు కమిషనర్‌ గోల్కొండ నర్సయ్య ప్రకటించారు. నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజైన మంగళవారం 34 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకోగా 109 మంది పోటీలో ఉన్నట్లు ఆయన తెలిపారు. అందులో 12వ వార్డు అభ్యర్థి బట్టు యాదమ్మ ఒక్కరే బరిలో మిగలడంతో ఆమెను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడం జరిగిందన్నారు. మొత్తం 145 అభ్యర్థుల్లో సోమవారం రోజున ఒక్క అభ్యర్థి తన నామినేషన్‌ను ఉపసంహరించుకోగా చివరి రోజైన మంగళవారం ఉపసంహరించుకున్న 34 మంది  కలిపి మొత్తం 35 మంది అభ్యర్థులు తమ నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారని తెలిపారు. దీంతో ఈ నెల 22న జరిగే ఎన్నికల బరిలో 19 వార్డులకుగాను 109 మంది అభ్యర్థులు పోటీపడన్నుట్లు కమిషనర్‌ నర్సయ్య తెలిపారు. ఆయా వార్డుల్లో స్వతంత్రులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులకు గుర్తులను కేటాయించామన్నారు.


 20 వార్డులకు మొత్తం 78 మంది..

 గజ్వేల్‌, నమస్తే తెలంగాణ:గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ ఎన్నికల అభ్యర్థుల తుది జాబితా విడుదలైంది. 20 వార్డులకు మొత్తం 78 మంది నిలిచారు. ఇందులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు 20 మంది, కాంగ్రెస్‌ 19 మంది. బీజేపీ నుండి 9 మంది. స్వంత్రతులు 30 మంది పోటీలో నిలిచారు. టీడీపీ అభ్యర్థులు ఎవరు లేకపోగా కాంగ్రెస్‌ నుంచి ఒక వార్డు, బీజేపీ నుంచి 11వార్డులకు అభ్యర్థులు పోటీలో లేరు. కాగా కాంగ్రెస్‌, బీజేపీ స్వతంత్ర అభ్యర్థులుగా 58 మంది పోటీలో నిలిచారు. 1వ వార్డు నుంచి  బి. ప్రవీన్‌ కుమార్‌ కాంగ్రెస్‌, పొన్నాల కుమార్‌ స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. 2వ వార్డు నుంచి కప్ప లక్ష్మి బీజేపీ, గౌరారం జయలక్ష్మీ కాంగ్రెస్‌, కప్ప మమత, కప్ప రజిత స్వతంత్ర అభ్యర్థులుగా, 3వ వార్డు నుంచి పొద్దుటూరి అనిత కాంగ్రెస్‌, వినోద, కె.నీలవాణి, ఎం. వరలక్ష్మి స్వతంత్ర అభ్యర్థులుగా, 4వ వార్డు నుంచి ఇ. జ్యోతి కాంగ్రెస్‌, కొలుపుల భవాణి బీజేపీ, పి. అర్చన. జి. లక్ష్మి. ఎన్‌. అన్నపూర్ణ స్వతంత్ర అభ్యర్థులుగా, 5వ వార్డు నుంచి గుంటుకు లక్ష్మి కాంగ్రెస్‌, ఎం. సుగునమ్మ బీజేపీ, అజేద బేగం, గౌస్‌బీ స్వతంత్ర అభ్యర్థులుగా, 6వ వార్డు నుంచి జె.లక్ష్మన్‌ కాంగ్రెస్‌, గులాం అహ్మద్‌ అజీద్‌, నక్క శశికళ స్వతంత్ర అభ్యర్థులుగా, 7వ వార్డు నుంచి కె. రవి కాంగ్రెస్‌, 8వ వార్డు నుంచి నాయిని యాదగిరి కాంగ్రెస్‌, మహ్మద్‌  లతీఫ్‌ ఖాన్‌ స్వతంత్ర అభ్యర్థులుగా,  9వ వార్డు నుంచి నాయిని భార్గవి కాంగ్రెస్‌, ఎం. విద్యారాణి స్వతంత్ర, 10 వ వార్డు నుంచి ఎ. మహేందర్‌ కాంగ్రెస్‌, తూం శ్రీధర్‌ బీజేపీ, ఎ. రామచంద్రచారి, గంగిశెట్టిరాజు, చెప్యాల శ్రీనివాస్‌, బి. శ్రీనివాస్‌, యండి రహిం స్వతంత్ర అభ్యర్థులుగా, 11వ  వార్డు నుంచి ఇప్ప ఉమారాణి కాంగ్రెస్‌, గాడిపల్లి పద్మ, జి. చందన స్వతంత్ర, 12వ వార్డు నుంచి ఉప్పల మధుసూదన్‌ బీజేపి, ఇప్ప ప్రభాకర్‌  కాంగ్రెస్‌,13 వ వార్డు నుంచి ఎం. ఉమాదేవి బీజేపీ, షేక్‌ షాయిదా బేగం కాంగ్రెస్‌, తాహేరా బేగం స్వతంత్ర,14 వ వార్డు నుంచి ఎండి షామియుద్దీన్‌ కాంగ్రెస్‌, కె. మురళి స్వతంత్ర, 15వ వార్డు నుంచి బి. సుధాకర్‌ కాంగ్రెస్‌, ఎ. పద్మ, సిహెచ్‌ కమలాకర్‌రెడ్డి, జంగం రమేశ్‌గౌడ్‌ స్వతంత్ర, 16వ వార్డు నుంచి కె. శారద, బొగ్గుల స్వప్న స్వతంత్ర, 17వ వార్డు నుంచి డి. యశోద బీజేపీ, ఫరీదా రుక్సానా కాంగ్రెస్‌, దుంబాల లక్ష్మి స్వతంత్ర, 18వ వార్డు నుంచి పి. శ్రీనివాస్‌ బీజేపీ, మదన్‌మోహన్‌ రెడ్డి, కాంగ్రెస్‌, 19వ వార్డు నుంచి డి. లావణ్య కాంగ్రెస్‌, 20వ వార్డు నుంచి టి.రవిరాజు  బీజేపీ,  సర్ధార్‌ఖాన్‌ కాంగ్రెస్‌ నుంచి అభ్యర్థులుగా నిలిచారు. 


రెండు వార్డులు ఏకగ్రీవం...  మిగతా 18వార్డుల్లో మొత్తం 73మంది

   హుస్నాబాద్‌, నమస్తే తెలంగాణ: హుస్నాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వానికి తెరపడగా ఇక ప్రచార పర్వం షురువైంది. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. నామినేషన్‌ వేసి ఉపసంహరించుకునే అభ్యర్థులు ఉదయం నుంచే నేరుగా నామినేషన్‌ కేంద్రానికి వచ్చిన స్వచ్ఛందంగా తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఆర్డీవో జయచంద్రారెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియగానే అధికారులు అభ్యర్థుల తుదిజాబితాను సిద్ధం చేశారు. గుర్తులు సైతం కేటాయించి మున్సిపల్‌ కార్యాలయంలో ప్రదర్శించారు. ఇప్పటికే రెండు వార్డులు ఏకగ్రీవం కాగా మిగతా 18వార్డుల్లో మొత్తం 73మంది అభ్యర్థులు పోటీలో ఉంటున్నారు. ఇందులో టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి 18మంది, కాంగ్రెస్‌ నుంచి 16మంది, బీజేపీ నుంచి 17మంది, సీపీఐ నుంచి 3 మంది, టీడీపీ నుంచి ఇద్దరు, ఇండిపెండెంట్లుగా 17మంది అభ్యర్థులు ఎన్నికల పోటీలో ఉన్నారు.  

  బల్దియా బరిలో 67 మంది..

    చేర్యాల, నమస్తే తెలంగాణ: మున్సిపాలిటీ ఎన్నికలలో పోటీ చేసేందుకు 67 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు.108 మంది అభ్యర్థులు 133 నామినేషన్లు దాఖలు చేసి నామినేషన్ల ఉపసంహరణ ముగింపు రోజున 41 మంది అభ్యర్థులు వారి నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఇక బరిలో టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి 12, బీజేపీ నుంచి 12, కాంగ్రెస్‌ నుంచి 12, సీపీఐ నుంచి 2, సీపీఎం నుంచి 7, 22 మంది ఇండిపెండెంట్లు బరిలో నిలిచిచారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఒగ్గు వెంకటమ్మ, చెవిటి లింగం, కొమ్ము నర్సింగరావు, ఉడుముల బాల్‌రెడ్డి, వెలుగల దుర్గయ్య, వెలుగల లావణ్య, వీరబత్తిని కల్యాణి, ఉడుముల ఇన్నమ్మ, సందుల సురేశ్‌, తుమ్మలపల్లి లీల, ముస్త్యాల తారయాదగిరి, ఎండి.ఖాజ బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి అందె బాలమణి, సకినాల వినోద్‌కుమార్‌, కాటం శ్రీకాంత్‌, కొట్టె చంద్రమౌళి, పల్లపు బాబు, చిట్ల లక్ష్మి, వంగ జయప్రద అలియాస్‌ జయలక్ష్మి, సకినాల రాణీ, బునాద్రి తిరుపతి, వలబోజు భాగ్యమ్మ, కమలాపురం, అనిమల్ల గీత, బూరుగు జ్యోతి, సీపీఐ నుంచి  రామగల్ల నాగరాజు, అంబటి అంజయ్య, సీపీఎం నుంచి ఆముదాల మంజుల, ఒగ్గు రాజు, మేర్గోజు మహేశ్‌, రాళ్లబండి మమత, మల్లయ్య, దాసరి కళావతి, ముస్త్యాల లావణ్యలతో పాటు 22 మంది ఇండిపెండెంట్లు పోటీలో ఉన్నారు.


logo