శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Siddipet - Jan 15, 2020 , 00:25:47

3వార్డులు ఏకగ్రీవం

3వార్డులు ఏకగ్రీవం

   హుస్నాబాద్‌, నమస్తే తెలంగాణ: హుస్నాబాద్‌ మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ బోణీ కొట్టింది. పట్టణంలోని 20 వార్డులకు గాను రెండు వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 13వ వార్డులో బొల్లి కల్పనశ్రీనివాస్‌, 15వ వార్డులో ఆకుల రజితవెంకట్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన మంగళవారం ఈ రెండు వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ప్రత్యర్థులుగా ఉన్న వారు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో రెండు వార్డులు ఏకగ్రీవం అయినట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో భాగంగా 13వ వార్డులో బీజేపీ పార్టీ తరపున నామినేషన్‌ వేసిన వరియోగుల లావణ్య, 15వ వార్డులో కాంగ్రెస్‌ తరపున నామినేషన్‌ వేసిన చిత్తారి మంజుల తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో ఆయా వార్డుల్లో ఎవరూ పోటీలో లేకపోవడంతో రెండు వార్డులు ఏకగ్రీవం అయ్యాయి.  


హుస్నాబాద్‌లో  సంబురాలు...

 హుస్నాబాద్‌ టౌన్‌: పట్టణంలోని రెండు వార్డులను టీఆర్‌ఎస్‌పార్టీ ఏకగ్రీవంగా గెలుచుకోవడంపై టీఆర్‌ఎస్‌ శ్రేణులు మంగళవారం సంబురాలు జరుపుకున్నారు. ఏకగ్రీవంగా గెలుపొందిన ఆకుల రజిత దంపతులను ఎమ్మె ల్యే సతీశ్‌కుమార్‌  అభినందించారు. 


దుబ్బాకలో 12వ వార్డు టీఆర్‌ఎస్‌ ఖాతాలోకి...

   దుబ్బాక టౌన్‌: దుబ్బాక మున్సిపాలిటీకి జరుగుతున్న ఎన్నికల్లో 12వ వార్డు అభ్యర్థి బట్టు యాదమ్మ (బీసీ మహిళ) ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఈ విషయాన్ని అధికారులు మంగళవారం సాయంత్రం ప్రకటించారు. బట్టు యాదమ్మకు పోటీగా ఉన్న నక్క సునంద సోమవారం తన నామినేషన్‌ను ఉపసంహరించుకోగా, నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన మంగళవారం తోట్ల ఎల్లవ్వ, ఎమ్మెల్యే రామలింగారెడ్డి సూచనల మేరకు చెక్కపల్లి శ్రీలైఖ్య తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో యాదమ్మ ఎన్నిక ఏకగ్రీవమైంది.


logo