గురువారం 04 మార్చి 2021
Siddipet - Feb 23, 2021 , 03:16:33

ప్రతి కార్యకర్తకూ టీఆర్‌ఎస్‌లో గుర్తింపు

ప్రతి కార్యకర్తకూ టీఆర్‌ఎస్‌లో గుర్తింపు

కొండపాక  ఫిబ్రవరి 22 : టీఆర్‌ఎస్‌ పటిష్టానికి కృషి చేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మ న్‌ లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. బందారంలో సోమవారం టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిం చి మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో ఎం పీపీ ర్యాగళ్ల సుగుణ, తెలంగాణ జాగృతి గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు అనంతుల ప్రశాంత్‌, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్‌ ర్యాగళ్ల దుర్గయ్య, జిల్లా సభ్యుడు దోమల ఎల్లం, మండల పార్టీ అధ్యక్షుడు నూనె కుమార్‌, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ అమరేందర్‌, మాజీ ఎంపీపీ రాధాకిషన్‌రెడ్డి  పాల్గొన్నారు. 

 దేశంలోనే బలమైన పార్టీగా టీఆర్‌ఎస్‌

గజ్వేల్‌ అర్బన్‌, ఫిబ్రవరి 22: దేశంలోనే అన్ని పార్టీల కన్నా శక్తివంతంగా టీఆర్‌ఎస్‌ పార్టీ తయారవుతుందని మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్‌సీ రాజమౌళి, సభ్యత్వ నమోదు ఇన్‌చార్జి డాక్టర్‌ యాదవరెడ్డి  అన్నారు.  20వ వార్డులో టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు గోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్‌సీ రాజమౌళి, ము న్సిపల్‌ సభ్యత్వ నమోదు ఇన్‌చార్జి డాక్టర్‌ యాదవరెడ్డి  పాల్గొని కొత్త  సభ్యత్వాలను అందజేశారు.   గజ్వేల్‌ నియోజకవర్గంలోనే లక్ష సభ్యత్వాలను చేయడానికి నాయకులు, కార్యకర్తలు నిర్విరామంగా కృషి చేస్తున్నారన్నారు.   ఈనెల 28లోగా గజ్వేల్‌ ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీలో టార్గెట్‌ కంటే  ఎక్కువ సంఖ్యలో సభ్యత్వ నమోదును పూర్తి చేయనున్నట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు.  మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ జకియొద్దీన్‌, వార్డు అధ్యక్షుడు జావిద్‌, మజీద్‌ కమిటీ అధ్యక్షుడు యూసుఫ్‌, నాయకులు ప్రభాకర్‌, శ్రీను, రవి, అధికసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

రిమ్మనగూడలో...

గజ్వేల్‌ రూరల్‌, ఫిబ్రవరి 22: గ్రామాల్లో ఈసారి లక్ష్యానికి మించి సభ్యత్వాలు నమోదవుతున్నాయని, అనుకున్న సమయానికి మందుగానే తమకు అప్పగించిన బాధ్యతను నిర్వహిస్తామని మండల పార్టీ అధ్యక్షుడు బెండె మధు అన్నారు.   రిమ్మనగూడలో సభ్యత్వ నమోదు కార్యక్రమం అనంతరం ఆయన మాట్లాడారు.  మండల ప్రధాన కార్యదర్శి పాల రమేశ్‌గౌడ్‌, గ్రామ కమిటీ అధ్యక్షుడు బాచిన మురళీమోహన్‌, భీమప్ప, సత్త య్య, సురేశ్‌, వెంకట్‌గౌడ్‌,  శ్రీనివాస్‌రెడ్డి, నిజాం  పాల్గొన్నారు.

 టార్గెట్‌కు మించి సభ్యత్వాలు 

సిద్దిపేట కమాన్‌  ఫిబ్రవరి 22  : టీఆర్‌ఎస్‌ కార్యకర్తలందరూ టార్గెట్‌కు మించి సభ్యత్వాలు చేయించాలని టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్‌రెడ్డి అన్నారు.   14వ వార్డులో టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని  ప్రారంభించారు.  కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు అరవింద్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, రాగుల చంద్రం, కొండం రాజు పాల్గొన్నారు.  

VIDEOS

logo