ఉద్యమంలా టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు

బెజ్జంకి, ఫిబ్రవరి 22 : లక్ష్యాన్ని మించి టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు నమోదు చేయాలని ఎంపీపీ లింగాల నిర్మల సూచించారు. గుండారం గ్రామంలో సోమవారం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కనగండ్ల కవిత, సర్పంచ్ లావణ్య, ఎంపీటీసీ ఎలుక లత, నాయకులు రామలింగారెడ్డి, రాములు, నర్సయ్య, గురువారెడ్డి పాల్గొన్నారు.
ఉత్సాహంగా టీఆర్ఎస్ సభ్యత్వం
హుస్నాబాద్‌టౌన్, ఫిబ్రవరి 22 : 6వ వార్డులో సోమవారం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎండీ. అన్వర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. టీఆర్ఎస్తోనే సంక్షేమం కొనసాగుతుందనే భావనతో ప్రజలు టీఆర్ఎస్లో ఉత్సాహంగా చేరుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు బొద్దుల కనకలక్ష్మి, చిట్టి గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
టీఆర్ఎస్తోనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధ్ది
దుబ్బాక టౌన్, ఫిబ్రవరి 22 : టీఆర్ఎస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి సభ్యత్వ నమోదు దుబ్బాక మున్సిపాలిటీలో జోరుగా సాగుతున్నది. టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనితాభూంరెడ్డి అన్నారు. సోమవారం మున్సిపాలిటీలో 12వ వార్డులో కౌన్సిలర్ బట్టు యాదమ్మ ఎల్లంతో కలిసి చైర్పర్సన్ సభ్యత్వ నమోదును ప్రారంభించారు. 13వ వార్డులో వార్డు కౌన్సిలర్లు ఆస సులోచన, కోఆప్షన్ సభ్యుడు ఆస స్వామి ఆధ్వర్యంలో సభ్యత్వం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు బండి రాజు, బోనాల యాదగిరి, చెక్కపల్లి నరేశ్, అఖిల్, స్వామి, రంజిత్, మల్లేశం, రంజాన్, పద్మయ్య, సురేశ్, రాంచంద్రం తదితరులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు
కొమురవెల్లి, ఫిబ్రవరి 22 : మర్రిముచ్చాలలో టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు చదరుపల్లి నర్సింగరావు ఆధ్వర్యంలో సోమవారం టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు చేపట్టారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ వంగ చంద్రారెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తలారి కిషన్, బొడిగం కృష్ణారెడ్డి, ఉపసర్పంచ్ పరశురాములు, నర్సింహారెడ్డి, వంశీ పాల్గొన్నారు.
లక్ష్యాన్ని అధిగమిస్తాం
కోహెడ, ఫిబ్రవరి 22 : పార్టీ సభ్యత్వ నమోదులో లక్ష్యాన్ని అధిగమిస్తానని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆవుల మహేందర్ అన్నారు. చెంచెల్‌చెర్వుపల్లి గ్రామంలో సభ్యత్వ నమోదు నిర్వహించి మాట్లాడారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు అన్నబోయిన భిక్షపతి, మాజీ ఎంపీటీసీ బాలరాజు, బాల్‌రాజ్, మల్లేశం పాల్గొన్నారు.
మద్దూరు మండలంలో..
మద్దూరు, ఫిబ్రవరి22 : మండల కేంద్రంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా సాగుతున్నది. సోమవారం మద్దూరులో సర్పంచ్ కంఠారెడ్డి జనార్ధ్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదును చేపట్టారు. ఈ సందర్భంగా రైతుబంధు సమితి మండ ల కోఆర్డినేటర్ మేక సంతోశ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభు త్వం దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో కేసీఆర్ సేవాదళం మండల అధ్యక్షుడు దామెర మల్లేశం, పీఏసీఎస్ డైరక్టర్ బాలయ్య, మాజీ ఎంపీటీసీ నర్సింహులు, నాయకులు బోయిని మనోహర్, రాజు పాల్గొన్నారు.
కష్టపడ్డ కార్యకర్తలకు ప్రాధాన్యత
చేర్యాల, ఫిబ్రవరి 22 : టీఆర్ఎస్ పార్టీలో కష్టపడ్డ వారికి ప్రాధాన్యత ఉంటుందని కౌన్సిలర్ మంగోలు చంటి, మాజీ ఎంపీపీ మేడిశెట్టి శ్రీధర్ అన్నారు. సభ్యత్వ నమోదును పూర్తి చేసి పుస్తకాలను మండల కమిటీకి అప్పగించారు. కార్యక్రమంలో భాగంగా సోమవారం కౌన్సిలర్, మాజీ ఎంపీపీ అన్ని వర్గాల ప్రజలకు టీఆర్ఎస్ సభ్యత్వం అందజేశారు. మండలంలోని ముస్త్యాల గ్రామంలో సర్పంచ్ పెడతల ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ రవితేజ, నాయకులు నాగేశ్వర్, రాములు, వెంకటేశ్వర్లు, అంబదాస్, ప్రసాద్, కనకయ్య, నర్సయ్య, రమేశ్, బాల్‌నర్సయ్య పాల్గొన్నారు.
తాజావార్తలు
- అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత
- ఏంటి పవన్‌కు నాల్గో భార్యగా వెళ్తావా..నెటిజన్స్ సెటైర్లు..!
- ధోనీ సమావేశంలో తోపులాట, పోలీసుల లాఠీచార్జీ
- పాప చక్కగా పాలు తాగేందుకు.. ఓ తండ్రి కొత్త టెక్నిక్
- ఎన్‌పీఎస్‌లో పాక్షిక విత్‌డ్రాయల్స్ కోసం ఏం చేయాలంటే..?!
- జనగామ జిల్లాలో బాలిక అదృశ్యం
- టీఆర్ఎస్, బీజేపీ పాలనలోని వ్యత్యాసాలను వివరించండి
- రానా 'అరణ్య' ట్రైలర్ వచ్చేసింది
- అవినీతి ఆరోపణలు.. గుడిపల్లి ఎస్ఐపై సస్పెన్షన్ వేటు
- రాజేంద్రప్రసాద్ డబ్బింగ్ వీడియో వైరల్