శుక్రవారం 05 మార్చి 2021
Siddipet - Feb 23, 2021 , 03:16:33

కేసీఆర్‌ ట్రోఫీ స్ఫూర్తితో టీహెచ్‌ఆర్‌ రూరల్‌ క్రికెట్‌ ట్రోఫీ

కేసీఆర్‌ ట్రోఫీ స్ఫూర్తితో టీహెచ్‌ఆర్‌ రూరల్‌ క్రికెట్‌ ట్రోఫీ

సిద్దిపేట కలెక్టరేట్‌ (ఫిబ్రవరి 22) :  సీఎం కేసీఆర్‌ క్రికెట్‌ ట్రోఫీ స్ఫూర్తితో సిద్దిపేట నియోజకవర్గంలోని రూరల్‌ మండలాల్లో టీహెచ్‌ఆర్‌ క్రికెట్‌ ట్రోఫీ పేరుతో క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహిస్తున్నట్లు మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పాల సాయిరాం, ఎంపీపీ మాణిక్యరెడ్డి, సిద్దిపేట రూరల్‌ జడ్పీటీసీ శ్రీహరిగౌడ్‌, కౌన్సిలర్‌ మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు ఎల్లారెడ్డి తెలిపారు. సిద్దిపేట క్రికెట్‌ స్టేడియంలో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గంలోని సిద్దిపేట రూరల్‌, అర్బన్‌, నంగునూరు, చిన్నకోడూరు, నారాయణరావుపేట మండలాల వారీగా ట్రోఫీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. టీమ్స్‌ ఇచ్చేవారు రూరల్‌ మండలంలో జడ్పీటీసీ (9849471636), అర్బన్‌ మండలం ప్రవీణ్‌రెడ్డి (9948555553), చిన్నకోడూరు మండలం వారు ఎంపీపీ మాణిక్యరెడ్డి (9949722225), నంగునూరు మండలం వారు జాప శ్రీకాంత్‌రెడ్డి (9440494 464), నారాయణరావుపేట మండలం వారు కుంభాల ఎల్లారెడ్డి (9963839952)ని సంప్రదించాలన్నారు. క్రికెట్‌ అసోసియేషన్‌ సిద్దిపేట స్టేడియంలోని కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాల కోసం ఆర్గనైజర్‌ మచ్చ వేణుగోపాల్‌రెడ్డి (9000200102), కలకుంట్ల మల్లికార్జున్‌ (9849955478) నంబర్లలో సంప్రదించాలన్నారు. 


VIDEOS

logo