టీఆర్ఎస్కు ప్రజలే హైకమాండ్

- ప్రజలు ఏది కోరుకుంటే అదే మన సీఎం కేసీఆర్ చేస్తున్నారు..
- టీఆర్ఎస్ కార్యకర్తలంతా గట్టిగా ప్రయత్నిస్తే ప్రత్యర్థి పార్టీల డిపాజిట్లు గల్లంతే
- మన పథకాలు దేశానికి రోల్ మోడల్
- త్వరలోనే చేర్యాలకు సీఎం కేసీఆర్
- చేర్యాలలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి తన్నీరు హరీశ్‌రావు
సిద్దిపేట, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : టీఆర్ఎస్కు తెలంగాణ ప్రజలే హైకమాండ్ అని, ప్రజల ఆలోచనలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని, టీఆర్ఎస్ కార్యకర్తలందరూ గట్టిగా ఒక పట్టు పడితే ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతే అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. నల్లగొండ- ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల స్థానం ఎమ్మెల్సీ ఎన్నికల టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి మద్దతుగా జనగామ నియోజకవర్గంలోని నాలుగు మండలాల సన్నాహక సమావేశం సోమవారం చేర్యాల పట్టణంలోని షణ్ముక గార్డెన్లో నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొని మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా సేవాభావం కలిగి, మంచి పనితీరులో ఉన్న పల్లా రాజేశ్వర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుందామని క్యాడర్‌కు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 43 లక్షల మందికి ఆసరా పింఛన్లు అందిస్తున్నామని, ఇందులో కేంద్ర వాటా కేవలం 1.80 శాతం మాత్రమే అన్నారు. దేశంలోనే ఇంత మందికి పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. 60 లక్షల మంది రైతులకు రైతు బంధు ఇస్తున్నట్లు తెలిపారు. పార్టీలకతీతంగా పథకాలు అమలు చేస్తున్నామన్నారు. స్థలాలు ఉన్న వారికి ఉగాది నుంచి డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టుకోవడానిని డబ్బులు ఇస్తామని మంత్రి తెలిపారు.
బీజేపీ నాయకుల విమర్శలు గట్టిగా తిప్పికొట్టండి
సీఎం కేసీఆర్, టీఆర్ఎస్పైన బీజేపీ నాయకులు చేసే విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలని కార్యకర్తలకు మంత్రి హరీశ్‌రావు పిలపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్ మోడల్ అని, ఈ మాట మనం చెబుతున్నది కాదని, కేంద్ర మంత్రులు చెబుతున్న మాటలన్నారు. ఢిల్లీలో ఉన్న కేంద్ర మంత్రులు మన ప్రభుత్వ తీరును మెచ్చుకుంటే ..ఇక్కడ గల్లీలో ఉన్న బీజేపీ వాళ్లు విమర్శలు చేయడం సిగ్గుచేటని మంత్రి అన్నారు. ఒకవేళ మన పథకాలు మంచిగా లేకపోతే కేంద్ర మంత్రులు ఎందుకు మెచ్చుకుంటారని, దేశవ్యాప్తంగా వీటిని ఎందుకు అమలు చేస్తారని, ఈ విషయాన్ని మీరంతా అర్ధం చేసుకోవాలని కార్యకర్తలను కోరారు. మొన్నటి కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వం నిధులన్నీ ఎన్నికలు జరిగే రాష్ర్టాలకు కేటాయించారని, తెలంగాణ మొండి చెయ్యి చూపి అన్నాయం చేశారని, బీజేపీకి ఎందుకు ఓటు వేయాలో ఇవాళ మేధావి లోకం ఒక్కసారి ఆలోచించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. మన పథకాలు ఇతర రాష్ర్టాలకు ఆదర్శమన్నారు. బీజేపీ పాలించే కర్ణాటకలో తెలంగాణ మాదిరిగా ఏ ఒక్క పథకం అమలులో లేదన్నారు.
త్వరలోనే చేర్యాలకు సీఎం కేసీఆర్
చేర్యాల ప్రాంతాన్ని రాబోయే రోజుల్లో స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాను కలిసి ఇంకా అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సీఎం కేసీఆర్‌ను త్వరలోనే ఈ ప్రాంతానికి ఆహ్వానిద్దామని, గతంలోనే ఈ ప్రాంతానికి బెటాలియన్‌ను సీఎం కేసీఆర్ మంజూరు చేశారని, దీనిద్వారా ఈ ప్రాంతంలో 1200 మందికి ఉద్యోగాలు వచ్చే బెటాలియన్ పనులు త్వరలోనే ప్రారంభించుకుందామని మంత్రి భరోసా ఇచ్చారు. రైల్వే లైన్ అందుబాటులోకి వస్తున్నది, గోదావరి జలాలు వస్తున్నాయి.. ఇంటిగ్రేటెడ్ కార్యాలయ పనులు చురుగ్గా జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. చేర్యాలకు త్వరలోనే స్టేడియం మంజూరు చేయిస్తానన్నారు. చేర్యాల ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఉద్యమకారుడు.. తెలంగాణ ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిన్నారు. జైలు కెళ్లారు.. విద్యార్థి నాయకుడుగా పని చేశారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న వ్యక్తి ..ఇలాంటి మంచి వ్యక్తిని గెలుపించుకుందామని కార్యకర్తలకు మంత్రి పిలుపునిచ్చారు. వచ్చే నెల 14న జరిగే ఎన్నికల్లో మన ఓటుతో పాటు మన ఇంట్లో ఉన్న వాళ్లందరి ఓట్లు వేయించాలని క్యాడర్‌కు మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. చేర్యాల ప్రాంతం నుంచి రాజేశ్వర్‌రెడ్డికి అత్యధిక మెజార్టీ తీసుకు రావాలని కార్యకర్తలకు మంత్రి పిలుపునిచ్చారు.
తాజావార్తలు
- మొక్కల సంరక్షణ అందరి బాధ్యత
- సమస్యల పరిష్కారానికి కృషిచేస్తా
- ఖనిజ నిధులతో అభివృద్ధి
- ముగిసిన జిల్లా స్థాయి రెజ్లింగ్ చాంపియన్‌షిప్
- బంగారం కొనుగోలుకు ఎస్బీఐ రుణ పరపతి ఇలా..
- వాస్తవాలు గ్రహించండి
- బండి సంజయ్‌కు మతిభ్రమించింది
- మీనం మెరిసెను..!
- స్వచ్ఛత దిశగా పినపాక
- వీధి వ్యాపారులకు రుణాలు మంజూరు చేయాలి