సోమవారం 08 మార్చి 2021
Siddipet - Feb 22, 2021 , 02:33:58

అధికారుల నిర్లక్ష్యంతో ఆకునూరులో ఎండుతున్న పంటలు

అధికారుల నిర్లక్ష్యంతో ఆకునూరులో ఎండుతున్న పంటలు

చేర్యాల, ఫిబ్రవరి 21 :  రైతులకు 24 గంటలు ఉచితంగా నాణ్యమైన కరెంటు సరఫరా చేయాలని ప్రభుత్వం అదేశాలు జారీ చేసినప్పటికీ వాటిని క్షేత్రస్ధాయిలో అమలు చేయాల్సిన అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదు.  ఆకునూరు వాగు అవతలి రైతుల పంట పొలాలు ఎండిపోతుండడంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఒకే ట్రాన్స్‌ఫార్మర్‌ పై 30 మంది రైతుల బోరుబావుల మోటర్లు నడుస్తుండడంతో ట్రాన్స్‌ఫార్మర్‌ కెపాసిటీ తక్కువగా ఉండడంతో అది కాస్తా ఇటీవల కాలిపోయింది. 15 రోజుల వ్యవధిలో ట్రాన్స్‌ఫార్మర్‌ మూడుసార్లు కాలిపోవడంతో రైతుల పంట పొలాలు నీరు లేక పగుళ్లు ఏర్పడ్డాయి.   రైతులు డీడీలు తీసినప్పటికీ   ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేయకపోవడంతో   రైతులకు శాపంగా మారింది.   ట్రాన్స్‌ఫార్మర్‌ పై లోడ్‌ అదనంగా ఉండడంతో  కొన్ని మోటార్లను ధూళిమిట్ట మండలంలోని అర్జునపట్ల ఫీడర్‌కు, మరికొన్నింటిని చేర్యాల మండలంలోని ఆకునూరు ఫీడర్‌కు మోటర్లు  విభజించారు.    ఉన్నతాధికారులు   మోటర్ల సంఖ్యకు సరిపడా కెపాసిటీ గల  ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేసి పంటలకు కాపాడాలని రైతులు కోరుతున్నారు. 

VIDEOS

logo