రాష్ట్రస్థాయిలో సత్తా చాటుతున్న క్రీడాకారులు

సిద్దిపేట కలెక్టరేట్, ఫిబ్రవరి 20 : రెండు రోజులుగా సిద్దిపేటలో జరుగుతున్న రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీ ల్లో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఇప్పటికే పలుమార్లు ఆయా విభాగాలలో రాష్ట్ర స్థాయిలో ఆడి న క్రీడాకారులు ఒడిషాలోని జరిగే జాతీయ వాలీబాల్ సీనియర్ చాంపియన్‌షిప్ పోటీల్లో తెలంగాణ రాష్ట్ర జట్టు తరపున ఆడడమే లక్ష్యంగా నైపుణ్యం ప్రదర్శిస్తున్నారు. సిద్దిపేటలో నిర్వహిస్తున్న వాలీబాల్ పోటీలు సెమీస్‌కు చేరుకున్నాయి.
పట్టుదలతో పై స్థానాలకు..
స్కూల్ల్లో ఉన్నప్పుడే వాలీబాల్ ఆడడం మొదలు పెట్టాను. కోచ్‌లు, గురువుల ప్రోత్సాహంతో ఆటలో మెళకువలు నేర్చుకున్న. జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్న. ఎస్జీఎఫ్ క్రీడల్లో అండర్-19 విభాగంలోను, అసోసియేషన్ తరఫున అండర్-16, 18, రెండుసార్లు నేషనల్ గేమ్స్ ఆడాను. జాతీయ బీచ్ వాలీబాల్ పోటీల్లో పాల్గొని సిల్వర్ మెడల్‌ను సాధించాను. జాతీయ స్థాయి జూనియర్ పోటీల్లో 4వ స్థానంలో నిలిచాను. అంతర్జాతీయ స్థాయి మ్యాచ్‌లో ఆడాలన్నదే నా లక్ష్యం.
- కె.శ్రావ్య, బీహెచ్ఈఎల్
జాతీయ జట్టులో ఆడడమే లక్ష్యం..
జాతీయ వాలీబాల్ జట్టులో చోటు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్న. గతంలో రెండు సార్లు సౌత్ ఇండి యా తరఫున యూ నివర్సిటీ స్థాయి పోటీల్లో పాల్గొన్న. 7 సార్లు జిల్లాకు జట్టుకు ప్రాతినిధ్యం వహించా. స్పోర్ట్స్ కోటాలో ఎంబీఏ చేస్తున్న. రెండు సార్లు చాంపియన్‌గా నిలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాను. జూనియర్ లెవల్, యూత్ లెవల్లో రాష్ట్ర స్థాయిలో పాల్గొన్న. చేగుంటకు చెందిన కరణం రాధాకృష్ణ ప్రోత్సాహంతో వాలీబాల్ ఆడుతున్న. సిద్దిపేటలో డిగ్రీ చదువుతున్నప్పుడు సిటిజన్ క్లబ్, వాలీబాల్ అసోసియేషన్ నన్ను బాగా ప్రోత్సహించాయి.
- ఎ.రాహుల్‌గౌడ్, వడియారం, చేగుంట మండలం
గురువుల ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి చేరుకున్న..
పాఠశాల స్థాయిలోనే నాలో ప్రతిభను గుర్తించి నన్ను వాలీబాల్ క్రీడాకారిణిగా తయారు చేసింది మా పీఈటీ బాలవీరయ్యసార్. ఆయన ప్రోత్సాహం, నేర్పిన మెలకువలతో జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్న. ఎస్జీఎఫ్ క్రీడల్లో ఐదుసార్లు రాష్ట్ర జట్టుకు ఆడాను. నాలుగు సార్లు వాలీబాల్ అసోసియేషన్ తరఫున మెదక్ జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించా. జూనియర్ విభాగంలో జాతీయ వాలీబాల్ జట్టుకు ఆడాను. నేషనల్ బీచ్ వాలీబాల్ పోటీల్లో రాష్ట్రజట్టుకు ఆడి 3వస్థానంలో నిలిచాను. ప్రస్తుతం స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న.
- సుమలత, బీహెచ్ఈఎల్
తాజావార్తలు
- గోవధ ఘటనపై మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం
- చిరంజీవి అభిమానికి బాలకృష్ణ అభిమాని సాయం
- మార్చి 8 నుంచి 16 వరకు శ్రీ కేతకీ సంగమేశ్వరస్వామి జాతర
- అక్రమ దందాలకు పాల్పడుతున్న విలేకర్ల అరెస్టు
- డిక్కీ నేతృత్వంలో డా. ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు ఘన సన్మానం
- 'విజయ్ 65' వర్కవుట్ అవ్వాలని ఆశిస్తున్నా: పూజాహెగ్డే
- దేశీయ విమానయానం ఇక చౌక.. ఎలాగంటే!
- పక్కాగా మహా శివరాత్రి జాతర ఏర్పాట్లు
- బ్రాహ్మణ పక్షపాతి సీఎం కేసీఆర్ : ఎమ్మెల్సీ కవిత
- 1.37 కోట్లు దాటిన కరోనా టీకా లబ్ధిదారులు