గులాబీ జెండా.. ప్రజలకు అండ

- సభ్యత్వ నమోదులో రికార్డు సృష్టించాలి
- సభ్యత్వ నమోదులో మండలి చీప్‌విప్ బొడెకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
- టీఆర్ఎస్ కార్యకర్తలకు బంగారు భవిష్యత్తు
- అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో కార్యకర్తలదే కీలకపాత్ర
- ప్రతిపక్షాల విమర్శలను తిప్పకొట్టండి
గులాబీ జెండా..ప్రజలకు అండ అని, అన్నివర్గాల అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం పాటుపడుతున్నదని శాసనమండలి చీప్‌విప్ బొడెకుంటి వెంకటేశ్వర్లు, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. చేర్యాలలో శుక్రవారం నిర్వహించిన చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను వివరించి పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు చేయించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్, పెట్రో,డీజిల్ ధరలను పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నదన్నారు. కాంగ్రెస్‌లో పదవుల పంచాయితీ నెలకొందని విమర్శంచారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు పక్కాగా అమలయ్యేలా క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కృషిచేయాలని వారు పిలుపునిచ్చారు.
చేర్యాల, ఫిబ్రవరి 19 : గులాబీ జెండా.. ప్రజలకు అండ అని, అన్నివర్గాల అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం పాటుపడుతున్నదని శాసనమండలి చీప్‌విప్ బొడెకుంటి వెంకటేశ్వర్లు, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. చేర్యాల పట్టణ శివారులోని షణ్ముక గార్డెన్స్‌లో శుక్రవారం చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నియోజకవర్గ కో- ఆర్డినేటర్ గుజ్జ సంపత్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ప్రభుత్వ చీప్‌విప్ బొడెకుంటి వెంకటేశ్వర్లు టీఆర్ఎస్ సభ్యత్వ నమోదును ప్రారంభించగా, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బొడెకుంటికి పార్టీ సభ్యత్వాన్ని అందించారు. ఈ సందర్భంగా చీప్‌విప్ బొడెకుంటి మాట్లాడారు. సీఎం కేసీఆర్ తన ప్రాణాలను పణంగా పెట్టి తెచ్చిన తెలంగాణ రాష్ర్టాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి టీఆర్ఎస్ కార్యకర్తపై ఉందన్నారు. సీఎం కేసీఆర్ కల్పించిన బీమా సౌకర్యంతో 3వేల మంది కార్యకర్తల కుటుంబాలకు 2లక్షల చొప్పున బీమా పరిహారాన్ని పార్టీ అందించిందన్నారు. చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లో రికార్డు స్థ్ధాయిలో సభ్యత్వ నమోదు చేయించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్, పెట్రో, డీజిల్ ధరలను పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
పథకాల అమలులో కార్యకర్తలదే కీలకపాత్ర : ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
టీఆర్ఎస్ సర్కారు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో పార్టీ కార్యకర్తలదే కీలకపాత్ర అని, కార్యకర్తలే పార్టీకి సైనికులని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి స్పష్టం చేశారు. సభ్యత్వ నమోదు సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు పక్కాగా అమలయ్యేలా క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ నిపుణుడిగా మారి తెలంగాణ సాగు, తాగునీటి గోస తీర్చారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పని చేసిన పొన్నాల లక్ష్మయ్య కమీషన్లు తీసుకొని జనగామ, చేర్యాల ప్రాంతానికి అన్యాయం చేశారని, ఆంధ్రా ప్రాంతానికి నిధులు, నీటిని మళ్లించారని ముత్తిరెడ్డి విమర్శించారు. సభ్యత్వ నమోదులో చురుకుగా పని చేసిన వారికి ప్రాధ్యానమిస్తామని, చేర్యాల టౌన్లో 4వేలు, చేర్యాల మండలంలో 5500, కొమురవెల్లిలో 4వేలు, మద్దూరు, ధూళిమిట్ట మండలాలకు 8500 సభ్యత్వాల నమోదు చేయించాలని ఆదేశించారు. టీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండానే అన్ని ప్రజలకు అండగా ఉంటుందని, మినరల్ వాటర్ కొనుగోలు చేయడం మాని మిషన్ భగీరథ నీటిని తాగాలని ఎమ్మెల్యే కోరగా, పార్టీ కార్యకర్తలు తమ మెడలో ఉన్న కండువాలు ఊపి అభివాదం తెలిపారు. సమావేశంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు అనంతుల మల్లేశం, మంద యాదగిరి, గీస భిక్షపతి, టౌన్ అధ్యక్షుడు ముస్త్యాల నాగేశ్వర్రావు, ఎంపీపీలు వుల్లంపల్లి కరుణాకర్, తలారీ కీర్తన కిషన్, జడ్పీటీసీ సిలువేరు సిద్దప్ప, మున్సిపల్ చైర్పర్సన్ అంకుగారి స్వరూపరాణి, వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు తిరుపతిరెడ్డి, వంగ చంద్రారెడ్డి, రాష్ట్ర నాయకులు ఖాజా ఆరిఫ్, ముస్త్యాల బాల్‌నర్సయ్య, రైతుబంధు సమితి అధ్యక్షులు మేక సంతోష్, తాడెం రంజితాకృష్ణమూర్తి, సద్ది కృష్ణారెడ్డి, సర్పం చ్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు పెడుతల ఎల్లారెడ్డి, వంగా భాస్కర్‌రెడ్డి, చొప్పరి వరలక్ష్మి, బచ్చల సాయిమల్లు, టీఆర్ఎస్ నాయకులు సుంకరి మల్లేశం, పుర్మ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జోరుగా టీఆర్ఎస్ సభ్యత్వాలు
మున్సిపాలిటీతో పాటు గ్రామగ్రామానా టీఆర్ఎస్ సభ్యత్వ నమోదును నాయకులు, కార్యకర్తలంతా ఉత్సాహంగా నిర్వహిస్తున్నారని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. గజ్వేల్‌లో గంగిశెట్టి చంద్రన రవి ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొని సభ్యత్వ నమోదు రసీదులను అందజేశారు. దుంబాల అరుణ భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మున్సిపల్ సభ్యత్వ నమోదు ఇన్చార్జి డాక్టర్ యాదవరెడ్డి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని సభ్యత్వాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్త్తోందన్నారు. ప్రభ్వుం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్శితులై పెద్ద ఎత్తున యువత, ప్రజలు టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నారన్నారు. కార్యక్రమాల్లో వైస్ చైర్మన్ జకియొద్దీన్, నాయకులు శ్రీనివాస్, రవీందర్, కుమార్, నాయిని శ్రీనివాస్, వెంకటేశ్ గౌడ్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- పెట్రో భారం తగ్గించాలంటే ఇలా చేయాల్సిందే: ఆర్బీఐ
- విదేశీ నిపుణులకు అమెరికా వీసాపై బ్యాన్ విత్‌డ్రా
- అలాంటి పేరు తెచ్చుకుంటే చాలు!
- నెగెటివ్ షేడ్స్‌లో కనిపిస్తా
- నా కష్టాలు గుర్తొచ్చాయి
- ప్రతి ట్వీట్‌కూ హ్యాకింగ్ లేబుల్ వార్నింగ్.. ఎందుకంటే..!
- జవ్వని సొగసుకు..జడ నగలు!
- ములుగు పిజ్జా.. మహా రుచి!
- గ్రీన్ పకోడి
- మహిళకు ‘పింక్' రక్ష!