ప్రత్యక్ష దైవానికి ప్రణామం

సిద్దిపేట కలెక్టరేట్, ఫిబ్రవరి 19 : పిల్లలకు ఆస్తులు, అంతస్తులు ఇవ్వడం కాదు.. మంచి ఆరోగ్యం అందించినప్పుడే వారు అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధిస్తారని జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ అన్నారు. సిద్దిపేట జిల్లా యోగా అసోసియేషన్, వ్యాస మహర్షి యోగా సొసైటీ ఆధ్వర్యంలో సిద్దిపేట కోమటి చెరువు పై శుక్రవారం రథసప్తమి సందర్భంగా సామూహిక సూర్యనమస్కారాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా జడ్పీ చైర్పర్సన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మంచి ఆరోగ్యం కోసం యోగా చేయాలన్నారు. సిద్దిపేట జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ప్రవేశపెట్టిన యోగావిద్యను మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. అంతకుముందు అంతర్జాతీయ యోగాదినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఆన్లైన్ పోటీల విజేతలకు జడ్పీచైర్‌పర్సన్ ప్రశంసాపత్రాలను అందజేశారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం మాట్లాడారు. మంత్రి హరీశ్‌రావు ఆరోగ్య, దృఢమైన సిద్దిపేటను నిర్మించేందుకు సంకల్పించారన్నారు. వివిధ రకాల రోగాల నుంచి బయటపడేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో సుడా డైరెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, ప్రెస్ అకాడమీ సభ్యుడు అంజయ్య, కౌన్సిలర్ ప్రభాకర్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు పరమేశ్వర్, జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్, సెక్రటరీ నిమ్మ శ్రీనివాస్‌రెడ్డి, శిక్షకులు తోట సతీశ్, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి విక్రమ్‌రెడ్డి, టీఎన్జీవో జిల్లా గౌరవ అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- సంగీతంపై మక్కువతో..గళార్చన..
- తమిళనాడులో బీజేపీకి 20 సీట్లు
- రూపాయి ఖర్చు లేకుండా.. లక్ష మొక్కల సంరక్షణ
- సందేహాలు తీర్చేందుకే యూఎస్ఏ సెంటర్
- ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రారంభం
- 06-03-2021 శనివారం.. మీ రాశి ఫలాలు
- నిరుద్యోగుల కోసం మొబైల్ కెరీర్ కౌన్సెలింగ్ ల్యాబ్
- రాష్ట్రంలో మూడురోజులు పొడి వాతావరణం.. పెరగనున్న ఎండలు
- నాణ్యమైన పరిశోధనలు జరగాలి: ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి
- బండ చెరువు నాలా పనులను జీహెచ్ఎంసీకి అప్పగించాలి