అట్టహాసంగా..

- 6వ తెలంగాణ అంతర్ జిల్లాల సీనియర్ వాలీబాల్ పోటీలు షురూ
- ప్రారంభించిన మంత్రి తన్నీరు హరీశ్‌రావు
- రాష్ట్రస్థాయి పోటీలకు సిద్దిపేట వేదిక కావడం పై హర్షం
- పాత పది జిల్లాల నుంచి స్త్రీ, పురుష క్రీడాకారులు హాజరు
సిద్దిపేట కలెక్టరేట్, ఫిబ్రవరి 18 : ‘క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ైస్థెర్యాన్ని, ఆత్మ విశ్వాసాన్ని పెంచుతాయని, సిద్దిపేటను ఆరోగ్యకర, దృఢ సిద్దిపేటగా తయారు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గురువారం సిద్దిపేటలోని ఆచార్య జయశంకర్ స్టేడియం ప్రాంగణంలో 6వ తెలంగాణ అంతర్ జిల్లాల సీనియర్ వాలీబాల్(స్త్రీ-పురుష) వాలీబాల్ పోటీలను జడ్పీచైర్‌పర్సన్ వేలేటి రోజాశర్మ, వాలీబాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గజ్జెల రమేశ్‌బాబు, ప్రధాన కార్యదర్శి వీవీ హన్మంత్‌రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. క్రీడాజ్యోతిని వెలిగించి, క్రీడాపతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణలోని పాత 10 జిల్లాల క్రీడాకారుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. మూడు రోజుల పాటు జరుగనున్న పోటీలకు తెలంగాణలోని ఉమ్మడి 10 జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. తొలి రోజు పురుషుల విభాగంలో నిజామాబాద్- మహబూబ్‌నగర్, మెదక్-రంగారెడ్డి, మహిళల విభాగంలో నల్గొండ-నిజామాబాద్ జట్ల మధ్య పోటీలను ప్రారంభించారు. భవానీ క్లాసికల్ డ్యాన్స్ బృందం, గవర్నమెంట్ గర్ల్స్ హైస్కూల్, ఇందిరానగర్ స్కూల్ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. నిజామాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి, మహిళల విభాగంలో నల్గొండ, నిజామాబాద్ జట్ల మధ్య పోటీలను ప్రారంభించారు.
గ్రామీణ క్రీడ వాలీబాల్..
వాలీబాల్ గ్రామీణ ప్రాంత క్రీడ అని, గ్రామీణ ప్రాంత యువతకు అందుబాటులో ఉండి అతి తక్కువ ఖర్చుతో ఆడే క్రీడ అని, సిద్దిపేట రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు వేదిక కావడం గర్వంగా మంత్రి హరీశ్‌రావు అన్నారు. వాలీబాల్ ఒలింపిక్ గేమ్, వాలీబాల్ క్రీడలో రాణించి ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారున్నారన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు ముఖ్యమైనవని, సిద్దిపేటలో 16 రకాల క్రీడామైదానాలు అందుబాటులో ఉన్నాయని, పిల్లలను తీసుకొని ఉదయం లేదా సాయంత్రం తీసుకొచ్చి, వారికి ఇష్టమైన క్రీడలను ఆడించాలని తల్లిదండ్రులకు సూచించారు. సిద్దిపేట రాబోయే రోజుల్లో మరిన్ని క్రీడలకు వేదికగా మారనున్నదన్నారు. త్వరలోనే సిద్దిపేటలో వాలీబాల్ అకాడమీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. వచ్చే ఏడాది జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు సిద్దిపేట ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం, కార్యదర్శి రవీందర్‌రెడ్డి, కౌన్సిలర్లు మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, చిప్ప ప్రభాకర్, శ్రీనివాస్‌యాదవ్, మోయిజ్, ఏసీపీ రామేశ్వర్, ఎస్జీఎఫ్ సెక్రటరీ గ్యాదరి భిక్షపతి, ఎస్జీఎఫ్ మాజీ సెక్రటరీ సుజాత, వాలీబాల్ అసోసియేషన్ సభ్యులు వెంకటస్వామి, ఉప్పలయ్య, రామ్, ఎకాంత్రెడ్డి, కనకారాజు, లక్ష్మణ్‌తో పాటు ఆయా క్రీడా సంఘాల ప్రతినిధులు, వివిధ జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు.