సభ్యత్వ నమోదులో సత్తా చాటాలి

- ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి
- వంటిమామిడిలో కార్యకర్తల సమావేశం
- భారీగా తరలివచ్చిన టీఆర్ఎస్ శ్రేణులు
ఉద్యమంగా సభ్యత్వ నమోదు చేపట్టి, టీఆర్ఎప్ శ్రేణుల సత్తాను చాటాలని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. ములుగు మండలంలోని వంటిమామిడిలోని వీపీజే ఫంక్షన్హాల్లో గురువారం ఏఎంసీ చైర్మన్ జహంగీర్, డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. అన్ని గ్రామాల నుంచి టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి భారీ సంఖ్యలో సభ్యత్వ నమోదు చేయించాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ స భ్యత్వ నమోదుతో ప్రతి కార్యకర్తకు రూ. 2లక్షల ప్రమాద బీమా వర్తి స్తుందన్నారు. సమావేశంలో ఎంపీపీ లావణ్యాఅంజన్గౌడ్, జడ్పీటీసీ జయమ్మఅర్జున్ గౌడ్, జడ్పీ కోఆప్షన్ సభ్యు డు సలీం, వైస్ ఎంపీపీ దేవేందర్‌రెడ్డి, మండల కోఆప్షన్ సభ్యుడు ఖాజాపాషా, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి జుబేర్‌పాషా, మండల ప్రధాన కార్యదర్శి కుక్కల బాబుగౌడ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ కుక్కల నరేశ్‌గౌడ్, సర్పంచ్, ఎంపీటీల ఫోరం మండల అధ్యక్షులు గణేశ్‌గుప్తా, లింగారెడ్డి పాల్గొన్నారు.