శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Siddipet - Feb 19, 2021 , 00:17:24

ఎల్‌వోసీ అందజేసిన మంత్రి

ఎల్‌వోసీ అందజేసిన మంత్రి

గజ్వేల్‌ రూరల్‌, ఫిబ్రవరి 18 : మండలంలోని అక్కారం గ్రామానికి చెందిన అయిత భాస్కర్‌ కొద్ది రోజులుగా హైదరాబాద్‌లోని నిమ్స్‌ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో భాస్కర్‌ వైద్యచికిత్స కోసం ప్రభుత్వం సీఎం సహాయ నిధి నుంచి రూ.2 లక్షలను మంజూరు చేసింది. ఈ మేరకు సీఎం ఆర్‌ఎఫ్‌ ఎల్‌వోసీని గురువారం హైదరాబాద్‌లో భాస్కర్‌ కుటుంబీకులకు మంత్రి హరీశ్‌రావు అందజేశారు. భాస్కర్‌ కుటుంబానికి అండగా నిలబడిన మంత్రికి  టీఆర్‌ఎస్‌ నాయకుడు నర్సింగరావు, ప్రజాప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. 

VIDEOS

logo