బుధవారం 24 ఫిబ్రవరి 2021
Siddipet - Feb 18, 2021 , 02:41:29

ఊరూవాడా ఉత్సాహంగా..

ఊరూవాడా ఉత్సాహంగా..

చేర్యాల/మద్దూరు/కొమురవెల్లి/ధూళిమిట్ట, ఫిబ్రవరి 17 : సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా బుధవారం చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లో  ప్రజాప్రతినిధులు, గులాబీ శ్రేణులు, అధికారులు విస్తృతంగా మొక్కలు నాటారు.  కొమురవెల్లి మల్లన్న ఆలయంలో పునరుద్ధరణ కమిటీ సభ్యుడు ఉట్కూర్‌ అమర్‌గౌడ్‌, వజ్రోజు శంకరాచారిలతో కలిసి టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రత్యేక పూజ లు నిర్వహించారు. చేర్యాల పట్టణంలో మున్సిపల్‌ కౌన్సిలర్లు 2కే రన్‌ నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. నాగపురి క్రైస్తవ మిషనరీస్‌ ఏర్పాటు చేసిన పోటీల్లో పాల్గొన్న విద్యార్ధులకు బహుమతులు అందజేశారు.పోతిరెడ్డిపల్లిలో కేకు కట్‌ చేసి ప్రజలకు అందజేశారు. కార్యక్రమాల్లో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అంకుగారి స్వరూపారాణి, వైస్‌ చైర్మన్‌ నిమ్మ రాజీవ్‌రెడ్డి, ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్‌, జడ్పీటీసీ శెట్టె మల్లేశం, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు అనంతుల మల్లేశం, యూత్‌ అధ్యక్షుడు తివారీ దినేశ్‌ ,పీఏసీఎస్‌ చైర్మన్‌ వంగా చంద్రారెడ్డి, కౌన్సిలర్లు ఆడెపు నరేందర్‌, పచ్చిమడ్ల సతీశ్‌, మంగోలు చంటి, నాయకులు పుర్మ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.తాడూరులో వివేకానంద విజ్ఞాన సొసైటీ, జీపీ ఆధ్వర్యంలో కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు.  

 హుస్నాబాద్‌ డివిజన్‌లో  

రాష్ట్ర ముఖ్యమంత్రి   చంద్రశేఖర్‌రావు పుట్టిన రోజు సందర్భంగా హుస్నాబాద్‌ పట్టణంతో పాటు డివిజన్‌లోని హుస్నాబాద్‌, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి మండలాల్లో  వేడుకలు ఘనంగా జరిగాయి. కేసీఆర్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌కు హాజరైన మంత్రి హరీశ్‌రావు భారీ కేక్‌ను కట్‌ చేసి ప్రజాప్రతినిధులు, యూత్‌కు పంపిణీ చేశారు. హుస్నాబాద్‌ పట్టణంలోని నాగారం రోడ్డు, ఆరెపల్లిలో ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ రాజిరెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఆకుల రజితవెంకట్‌, వైస్‌చైర్‌పర్సన్‌ అయిలేని అనితారెడ్డి, కమిషనర్‌ రాజమల్లయ్య, కౌన్సిలర్లు బోజు రమారవీందర్‌, కొంకటి నళినీదేవి, వాల సుప్రజనవీన్‌, బొల్లి కల్పనశ్రీనివాస్‌, గూల్ల రాజు, గోవిందు రవి, బొజ్జ హరీశ్‌, రమేశ్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు ఎండీ అన్వర్‌, మండల అధ్యక్షుడు వెంకట్రామ్‌రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. బెజ్జంకిలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి మొక్కలు నా టారు. కార్యక్రమంలో డీపీవో సురేశ్‌బాబు, ఎంపీపీ లింగాల నిర్మల  పాల్గొన్నారు. 

 దుబ్బాక నియోజకవర్గంలో  

దుబ్బాక నియోజకవర్గంలో బుధవారం సీఎం కేసీఆర్‌ 67వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.    దుబ్బాక నియోజకవర్గంలో కోటి వృక్షార్చన కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్‌తో పాటు మున్సిపల్‌, మండల  ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు పాల్గొన్నాయి.  దుబ్బాక మున్సిపల్‌ పరిధిలో చైర్‌పర్సన్‌ గన్నె వనితారెడ్డి, కమిషనర్‌ గణేశ్‌రెడ్డి నేతృత్వంలో  దుబ్బాక-లచ్చపేట రోడ్డు కిరువైపులా మొక్కలు నాటారు. మొత్తం వెయ్యి మొక్కలు నాటి, వాటికి ట్రీ గార్డులను ఏర్పాటు చేశా రు. దుబ్బాక మండలంలో 30 గ్రామ పంచాయతీల్లో 12 వందల మొక్కలు నాటారు. ఒక్కో గ్రామపంచాయతీలో 4 వందల మొక్కల చొప్పున మొత్తం పన్నేండు వేల మొక్కలు నాటారు.  నియోజకవర్గంలో  మొత్తం 65,150 మొక్కలు నాటారు.   కార్యక్రమంలో దుబ్బాక ఎంపీపీ కొత్త పుష్పలత, జడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్‌పర్సన్‌ బండి శ్రీలేఖ, పీఏసీఎస్‌ చైర్మన్‌ కైలాశ్‌,  ఎంపీడీవో భాస్కరశర్మ, సీహెచ్‌సీ వైద్యాధికారి జ్యోతి, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు రొట్టె రాజమౌళి, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.  

VIDEOS

logo