సంక్షేమ సారథికి హరితార్చన

- ఉమ్మడి మెదక్ జిల్లాలో ఘనంగా సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు
- ఊరూవాడ, పల్లెపట్టణంలో పండుగ వాతావరణం
- పెద్దఎత్తున మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు
- రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు
- సిద్దిపేట జిల్లాలో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు
- సంగారెడ్డిలో మొక్కలు నాటిన హోంమంత్రి మహమూద్ అలీ
- ఆయా నియోజకవర్గాల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ల చైర్మన్లు
సిద్దిపేట, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ సంగారెడ్డి/మెదక్ : సిద్దిపేట ముద్దుబిడ్డ, సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా బుధవారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో ‘కోటి వృక్షార్చన’ కార్యక్రమంలో సబ్బండ వర్ణాలు పాల్గొని మొక్కలు నాటి సీఎం కేసీఆర్‌కు హరిత కానుక అందించారు. ఉమ్మడి జిల్లాలో 12 లక్షలకు పైగా మొక్కలు నాటారు. ప్రతి నియోజకవర్గం నుంచి సుమారు లక్ష మొక్కలు నాటారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో పోటాపోటీగా మొక్కల నాటే కార్యక్రమంలో అందరూ భాగస్వాములయ్యారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. రక్తదాన శిబిరాలు, అన్నదానాలు, కేక్‌లు కట్ చేశారు. సీఎం కేసీఆర్ స్వగ్రా మం చింతమడకలో మహారుద్ర యాగం నిర్వహించారు. జిల్లాలోని ప్రధాన పట్టణాలు, ముఖ్య గ్రామాల్లో సీఎం కేసీఆర్ క్రికెట్ కప్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.
సిద్దిపేట జిల్లాలో...
సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, ఎంపీపీ అమరావతితో కలిసి 68 కేజీల భారీ కేక్‌ను కట్ చేశారు. కోటి వృక్షార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 68 మంది రక్తదానం చేశారు. సిద్దిపేట మున్సిపాలిటీలో, రంగనాయక సాగర్ వద్ద మంత్రి హరీశ్‌రావు మొక్కలు నాటారు. ఆసరా పింఛన్‌దారులతో కలిసి కేక్ కట్ చేశారు. రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. సిద్దిపేట జయశంకర్ స్టేడియంలో 10 రోజుల నుంచి నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్ క్రికెట్ కప్ ఫైనల్ మ్యాచ్‌ను మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌తో కలిసి మంత్రి హరీశ్‌రావు తిలకించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌తో కలిసి క్రికెట్ కప్ విజేతలకు బహుమతులను మంత్రి అందజేశారు. జనగామ నియోజకవర్గం చేర్యాల మండలంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మొక్కలు నాటారు. మానకొండూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ఎమ్మెల్యే రసమయి బాల్కిషన్ పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లాలో...
సంగారెడ్డి జిల్లాకేంద్రంతో పాటు అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ప్రధాన దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంబేద్కర్ స్టేడియంలో జరుగుతున్న సీఎం గోల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ చివరి రోజు ఫైనల్ మ్యాచ్ విజేతలకు ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలు రూ.లక్ష నగదు, బహుమతులు అందజేశారు. సదాశివపేటలోని శ్మాశనవాటికల్లో ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలు 4 వేల మొక్కలు నాటారు. హోం మంత్రి మహమూద్ అలీ, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్ కోటి వృక్షార్చన కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్‌రెడ్డి, చంటి క్రాంతికిరణ్, మాణిక్‌రావు, భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొని మొక్కలు నాటారు. కలెక్టర్ హనుమంతరావు జిల్లా యంత్రాంగంలో కోటి వృక్షార్చనలో పాల్గొని మొక్కలు నాటారు.
మెదక్ జిల్లాలో...
మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి మొక్కలు నాటారు. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ హేమలతాశేఖర్‌గౌడ్, జడ్పీటీసీ, ఎంపీపీలు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున వేడుకల్లో పాల్గొన్నారు. మెదక్ కలెక్టర్ హరీశ్ హవేళీ ఘనపూర్‌లో ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి మొక్కలు నాటారు. మెదక్‌లో క్రికెట్ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు.
తాజావార్తలు
- తెలుగు ఇండస్ట్రీలో విషాదం.. యువ నిర్మాత కన్నుమూత
- మన వ్యాక్సిన్ సురక్షితమైంది: హీరో సందీప్‌కిషన్
- అన్నదానం ఎంతో గొప్పది: శేఖర్ కమ్ముల
- అతివేగం.. మద్యం మత్తు
- ఓటీపీలు తెలుసుకొని ఖాతా ఖాళీ
- ఒకరి పాన్‌కార్డుపై మరొకరికి రుణం
- భక్తజన జాతర
- అవుషాపూర్ మహిళల విజయాన్ని రాష్ట్ర వ్యాప్తం చేయాలి
- ఆర్యవైశ్యులకు ఎనలేని ప్రాధాన్యం
- ఏ ఇంటి చెత్త ..ఆ ఇంట్లోనే ఎరువు..