కేసీఆర్ క్రికెట్ టోర్నీ విజేత కుందనవానిపల్లి

- విన్నర్‌కు రూ.1.20లక్షలు, రన్నర్‌కు రూ.60 వేల నగదు అందజేసిన మంత్రి హరీశ్‌రావు
- బ్యాటింగ్ చేసి జోష్ నింపిన మంత్రి
హుస్నాబాద్, ఫిబ్రవరి 17: సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్, టీఆర్ఎస్వీ, యూత్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన కేసీఆర్ క్రికెట్ టోర్న మెంట్ విజేతగా అక్కన్నపేట మండలం కుందనవానిపల్లి జట్టు నిలిచింది. రన్నరప్‌గా కోహెడ జట్టు నిలిచింది. బుధవారం పట్టణంలోని డిపో గ్రౌండ్లో కుందనవాని పల్లి, కోహెడ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగింది.
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్, సీఎంవో కార్యదర్శి దేశపతి శ్రీనివాస్, వరంగల్ అర్బన్ జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ సుధీర్‌కుమార్, సిద్దిపేట జడ్పీ వైస్‌చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి ఫైన ల్ మ్యాచ్‌ను ఆసక్తిగా తిలకించారు. మొదట బ్యాటింగ్ చేసిన కోహెడ జట్టు 20 ఓవర్లలో 127/6 పరుగులు చేయగా, అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కుందనవానిపల్లి జట్టు 19.4 ఓవర్లలో 128 పరుగులు చేసి విజయం సాధించింది. మ్యాచ్‌ను తిలకించేందుకు సుమారు 5వేల మంది ప్రేక్షకులు తరలివచ్చారు. విన్నర్‌గా నిలిచిన కుందనవానిపల్లి జట్టుకు రూ.1.20 లక్షలు, రన్నర్‌గా నిలిచిన కోహెడ జట్టుకు రూ.60వేల నగదు బహుమతి, టోర్నమెంట్ కప్‌లను మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ అందజేశారు. మ్యాన్ఆఫ్ ద మ్యాచ్‌గా దినేశ్‌రెడ్డి, మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా ప్రవీణ్‌చారి నగదు బహుమతులు అందుకున్నారు. మంత్రి హరీశ్‌రావు బ్యాటింగ్, ఎమ్మెల్యే సతీశ్‌కుమార్, యువ నాయకుడు ఇంద్రనీల్‌బాబు బౌలింగ్ చేసి యూత్‌లో జోష్‌ను నింపారు. అరగంట పాటు మంత్రి బ్యాటింగ్ చేసి ఫోర్లు, సిక్స్‌లు కొట్టగా యూత్ కేరింతలు కొట్టారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత, వైస్‌చైర్‌పర్సన్ అనితారెడ్డి, ఎంపీపీలు లకావత్ మానస, మాలోతు లక్ష్మి, కొక్కుల కీర్తి, కొత్త వినీత, జడ్పీటీసీలు భూక్య మంగ, శ్యామల, గీకురు రవీందర్, మార్కెట్ చైర్మన్ కాసర్ల అశోక్‌బాబు, టీఆర్ఎస్ నాయకులు వంగ వెంకట్రాంరెడ్డి, మ్యాక నారాయణ, ఆవుల మహేందర్, ఎండీ అన్వర్, సూరంపల్లి పరశురామ్, చిరంజీవి, రమేశ్‌నాయక్, అరుణ్, తోడేటి రమేశ్, సతీశ్, గద్దల రమేశ్, అఫ్రోజ్, అనిల్, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ముగిసిన కేసీఆర్ కప్
సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా చేర్యాల పట్టణంలో ఈ నెల 12వ తేదీన ప్రారంభించిన కేసీఆర్ కప్ క్రీడోత్సవాలు బుధవారం ముగిసినట్లు మున్సిపల్ వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్‌రెడ్డి, కౌన్సిలర్లు పచ్చిమడ్ల సతీశ్, ఆడెపు నరేందర్, మంగోలు చంటి తెలిపారు.మండల స్ధాయిలో నిర్వహించిన క్రికెట్ పోటీల్లో చేర్యాలకు చెందిన సచిన్ క్లబ్ విజయం సాధించింది. వాలీబాల్‌లో చుంచనకోట జట్టు విజయం సాధించింది.పోటీల్లో విజయం సాధించిన జట్లకు నిర్వాహుకులు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అంకుగారి స్వరూపరాణి, రైతు బంధు సమితి జిల్లా సభ్యు డు అంకుగారి శ్రీధర్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ముస్త్యాల బాల్‌నర్సయ్య, నాయకులు పుర్మ వెంకట్‌రెడ్డి, వైస్ ఎంపీపీ తాండ్ర నవీన్‌రెడ్డి పాల్గొన్నారు.
ప్రసాదాల పంపిణీ
సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా కొమురవెల్లి మల్లన్న ఆలయంలో చేర్యాల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు.కార్యక్రమంలో అధ్యక్షుడు జిల్లా రాజేశం, కార్యదర్శి పులిగిల్ల సుధాకర్, మాజీ అధ్యక్షుడు బాశెట్టి బుచ్చిరాములు, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
తాజావార్తలు
- లొల్లి పెట్టొద్దన్నందుకు తల్లీకొడుకుకు కత్తిపోట్లు
- ఇలా చేస్తే రైతులు దిగి వస్తారన్న బాబా రాందేవ్
- అంబాసిడర్ కంపెనీ ఫర్ సేల్!
- రైలు ట్రాలీని తోసుకుంటూ ఉ.కొరియాను వీడిన రష్యా దౌత్యాధికారులు
- కలెక్షన్స్‌కు 'చెక్'..నిరాశలో నితిన్
- నవరత్నాలను కాపీకొట్టిన టీడీపీ..విజయసాయిరెడ్డి సెటైర్లు
- తొండంతో ఏనుగు దాడి.. జూ కీపర్ మృతి
- పది సినిమాలను రిజెక్ట్ చేసిన సమంత.. !
- నెటిజన్లకు మంత్రి కేటీఆర్ ప్రశ్న
- ప్రధాని పనికిరానివాడా.. కాదా అన్నది ప్రశ్న కాదు: రాహుల్‌గాంధీ