శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Siddipet - Feb 17, 2021 , 00:01:32

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఏర్పాట్లు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఏర్పాట్లు

జిల్లాలోని నాలుగు మండలాల్లో కోడ్‌

3,409 మంది ఓటర్లు

చేర్యాలలో 2, కొమురవెల్లి, మద్దూరులో ఒక్కో పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు

చేర్యాల, ఫిబ్రవరి 16 : వరంగల్‌, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కోసం జనగామ నియోజకవర్గంలోని చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లో ఎన్నికల కోడ్‌ అమలవుతున్నది. గ్రాడ్యుయేట్స్‌ ఎన్నికల్లో పట్టభద్రులు ఓటు వేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లో 3,409 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. నాలుగు మండలాల్లో పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు చేర్యాలలో 2, మద్దూరులో 1, కొమురవెల్లిలో 1పోలింగ్‌ కేంద్రాన్ని ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. ఆయా ఎన్నికల కేంద్రాల్లో వసతులు పరిశీలించేందుకు ఇటీవల జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ ముజామ్మిల్‌ఖాన్‌ మద్దూరు, కొమురవెల్లి మండల కేంద్రాల్లో పర్యటించారు. పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించడంతో పాటు తహసీల్దార్‌, ఎంపీడీవోలకు పలు సూచనలు చేశారు. మార్చిలో జరిగే నల్గొండ, వరంగల్‌, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో చేర్యాలలో 1870 (పురుషులు 1378, మహిళలు 492), కొమురవెల్లిలో 493 (పురుషులు 361, మహిళలు 132), మద్దూరు (ధూళిమిట్ట)లో 1046 (పురుషులు 817, మహిళలు 229) తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. చేర్యాలలో పెద్దమ్మగడ్డ ఉన్నత పాఠశాలలో రెండు పోలింగ్‌ కేంద్రాలు, కొమురవెల్లి మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల, మద్దూరులోని మోడల్‌ స్కూల్‌లో పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.  

VIDEOS

logo