కార్యదక్షకుడికి హరితకానుక

సీఎం కేసీఆర్ బర్త్‌డేకు
ఊరూరా మొక్కలు నాటే కార్యక్రమం
ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 నుంచి 12 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం
గ్రామాల్లో ముమ్మరంగా గుంతలు తీసే పనులు
10 రోజులుగా కేసీఆర్ క్రికెట్ కప్ పోటీలు
బర్త్‌డే రోజు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు
రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు
బుధవాం సీఎం కేసీఆర్ జన్మదినం పురస్కరించుకొని ‘కోటి వృక్షార్చన’
కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఉమ్మడి మెదక్
జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో మొక్కలు నాటేందుకు గుంతలతీత పనులు
ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరో వైపు పది రోజులుగా పట్టణాలు, ముఖ్య గ్రామాల్లో
సీఎం కేసీఆర్ క్రికెట్, వాలీబాల్ టోర్నీలను టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. సిద్దిపేట జిల్లా
కేంద్రంలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో జయశంకర్ మినీస్టేడియంలో క్రికెట్ కప్
టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు.
- సిద్దిపేట, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :
ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా గ్రామాల్లో పట్టణాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతీ నియోజకవర్గంలో లక్ష మొక్కలు నాటే లక్ష్యంగా పెట్టుకున్నారు. సిద్దిపేట జిల్లాలో 499 గ్రామ పంచాయతీలు, 5 మున్సిపాలిటీలు, మెదక్ జిల్లాలో 469 పంచాయతీలు, 4 మున్సిపాలిటీలు, సంగారెడ్డి జిల్లాలో 647 పంచాయతీలు, 8 మున్సిపాలిటీలున్నాయి. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో 10 లక్షల నుంచి 12 లక్షల మొక్కలు నాటనున్నారు. ప్రతీ పంచాయతీ పరిధిలో 500 మొక్కల నుంచి వెయ్యి మొక్కలు నాటే లక్ష్యంగా పెట్టుకున్నారు. మున్సిపాలిటీల్లో రెండు వేల వరకు మొక్కలు నాటేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. విద్యాసంస్థలు, పల్లెప్రకృతి వనాలు, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో, రోడ్లకు కిరువైపులా మొక్కలు నాటుతారు. నాటిన ప్రతీ మొక్కను సంరక్షించేలా ట్రీ గార్డులు ఏర్పాటు చేయనున్నారు. ఆయా గ్రామాల నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. అక్కడ సరిపడా మొక్కలు లేకపోతే ఇతర నర్సరీల నుంచి మొక్కలు తెచ్చి నాటనున్నారు. ముఖ్యంగా పండ్ల, పూల మొక్కలు నాటనున్నారు. ఆయా గ్రామాలు, మున్సిపాలిటీల్లోని మహిళా సంఘాలు, యువత, రైతులు ఇలా అన్ని వర్గాల వారు ఈ కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, రోగులకు పండ్ల పంపిణీ, రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు ఇలా వివిధ కార్యక్రమాలు నిర్వహించడానికి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సిద్ధం చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పది శాసనసభ నియోజకవర్గాలతో పాటు హుస్నాబాద్, జనగామ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు వారివారి ప్రాంతాల్లో కార్యక్రమాలను విజయవంతం చేయడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. 17న కేసీఆర్ బర్త్‌డే రోజు సిద్దిపేటలో కేసీఆర్ పేరిట ‘స్ఫూర్తి వనం’ ఏర్పాటు చేయబోతున్నారు. ఆ రోజు స్ఫూర్తివనం ఏర్పాటు చేసుకొని, ఎవరి బర్త్‌డే ఉన్నా ఈ వనంలో మొక్క నాటే కార్యక్రమానికి ఆ రోజు నుంచి శ్రీకారం చుట్టనున్నారు.
క్రికెట్, వాలీబాల్ టోర్నమెంట్లు..
సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో కేసీఆర్ క్రికెట్ కప్ టోర్నమెంట్‌ను వారం రోజు నుంచి నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్‌కు 60 టీమ్‌లు వచ్చాయి. మొత్తం రెండు గ్రూపులుగా విభజించి నాకౌట్ పద్ధతిలో టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నారు. విజేతగా నిలిచిన టీమ్‌కు లక్ష నగదుతో పాటు ట్రోఫీ అందజేస్తారు. రన్నరప్‌కు 50 వేలు, మ్యాన్ ఆఫ్ ది సీరిస్‌గా నిలిచిన క్రీడాకారుడికి 25 వేలు ఇస్తారు. సుమారుగా 800 మంది క్రీడాకారులు ఇందులో పాల్గొంటున్నారు. సిక్స్ కొట్టిన ఆటగానికి వెయ్యి ప్రత్యేక పారితోషకాన్ని అందించనున్నారు. బుధవారం ఫైనల్ మ్యాచ్ జరుగనున్నది. అదే రోజు గెలిచిన టీమ్‌కు కప్‌ను అందించనున్నారు. సిద్దిపేటతో పాటు గజ్వేల్, హుస్నాబాద్ నియోజకవర్గాలతో పాటు మెదక్, సంగారెడ్డి జిల్లాలో క్రికెట్ కప్ పోటీలను నిర్వహిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వాలీబాల్ క్రీడలను నిర్వహిస్తున్నారు. ఇటు క్రీడలు.. అటు మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చాలా గ్రామాల్లో యువత క్రికెట్ పోటీలను నిర్వహించారు.
తాజావార్తలు
- పాత వెహికల్స్ స్థానే కొత్త కార్లపై 5% రాయితీ: నితిన్ గడ్కరీ
- ముత్తూట్ మృతిపై డౌట్స్.. విషప్రయోగమా/కుట్ర కోణమా?!
- శ్రీశైలం.. మయూర వాహనంపై స్వామి అమ్మవార్లు
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బీటెక్ విద్యార్థులు దుర్మరణం
- స్విస్ ఓపెన్ 2021: మారిన్ చేతిలో సింధు ఓటమి
- తెలుగు ఇండస్ట్రీలో సుకుమార్ శిష్యుల హవా
- భైంసాలో ఇరువర్గాల ఘర్షణ.. పలువురికి గాయాలు
- గుత్తాకు అస్వస్థత.. మంత్రి, ఎమ్మెల్యేల పరామర్శ
- 2021లో రెండు సినిమాలతో వస్తున్న హీరోలు వీళ్లే
- మహారాష్ట్రలో కొత్తగా 11,141 కరోనా కేసులు.. 38 మరణాలు