సీటీస్కాన్ నో టెన్షన్

సిద్దిపేట జిల్లా దవాఖానలో 2.15కోట్లతో సీటీ స్కాన్ కేంద్రం
త్వరలోనే అందుబాటులోకి రానున్న సేవలు
సిద్దిపేట కలెక్టరేట్, ఫిబ్రవరి 12 :
అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చి, పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ దవాఖానలను సర్కారు బలోపేతం చేస్తున్నది. మంత్రి హరీశ్‌రావు చొరవతో సిద్దిపేట జిల్లా జనరల్ దవాఖానలో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. స్థానిక ఏరియా దవాఖానలో 2.15కోట్లతో సీటీ స్కాన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయగా, త్వరలోనే సేవలు అందుబాటులోకి రానున్నాయి.
రోడ్డు, ఇతర ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులకు వైద్యం అందించేందుకు మొదట చేసే పరీక్షల్లో సీటీ స్కాన్ తప్పనిసరిగా మారింది. సీటీ స్కాన్ చేసుకునే వారికి ప్రైవేటు దవాఖానల్లో సుమారుగా 4వేల నుంచి 6 వేలు పరీక్షలను బట్టి తీసుకుంటున్నారు. దీంతో పేద ప్రజలు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. సిద్దిపేట జనరల్ దవాఖానలో సీటీస్కాన్ అందుబాటులోకి వస్తే పేద ప్రజలకు ఇక్కట్లు తప్పుతాయి. సుమారుగా జిల్లా దవాఖానలో నెలకు 600 నుంచి 700 మందికి స్కానింగ్ చేస్తున్నారు. ఇంతకు ముందు స్కానింగ్ సెంటర్ లేక ప్రజలకు ఇబ్బందులు పడేవారు. ఈ సీటీ స్కాన్ కేంద్రం ఏర్పాటుతో ఇబ్బందులు తొలగనున్నాయి. సీటీ స్కాన్ సెంటర్ ఏర్పాటుతో రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు గాయాలకు గురైన వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని గుర్తించడంతో పాటు ఎక్కడెక్కడ గాయాలయ్యాయి? అని తెలుసుకోవచ్చు. కరోనా సమయంలోనూ ఆర్టీపీసీఆర్ పరీక్షల్లోనూ రోగ నిర్ధారణ కానీ కేసుల్లోనూ సీటీ స్కాన్ ఛాతిని స్కానింగ్ చేయడం ద్వారా పలు పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. సిద్దిపేట జనరల్ దవాఖానలోనూ నిత్యం సిద్దిపేటతో పాటు ఇతర జిల్లాల వారు కూడా వైద్యం చేయించుకోవడానికి వస్తుంటారు. దీంతో నిత్యం ఓపీ కేసులతో సిద్దిపేట దవాఖానలో రద్దీగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లోనూ వీరికి స్కానింగ్ చేయడానికి ప్రైవేటు దవాఖానకు రెఫర్ చేయాల్సి వస్తుంది. ప్రభుత్వ దవాఖానలో సీటీ స్కాన్ ఏర్పాటుతో ఈ ఇబ్బంది తప్పనున్నది.
పాత ఏరియా దవాఖానలో..
జిల్లా దవాఖానలో ఉన్న పాత ఏరియా దవాఖానలోని అత్యవసర విభాగం పక్కన సీటీ స్కాన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ సెంటర్లో మెదడు, కడుపు, కాళ్లు చేతులతో పాటు ఇతర అవయవాలను స్కానింగ్ చేసే సౌకర్యం ఏర్పాటు చేశారు. త్వరలోనే స్కానింగ్ సెంటర్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
తాజావార్తలు
- పుంజుకున్న కార్లు+ట్రాక్టర్ల సేల్స్.. బట్ త్రీ వీలర్స్ 50 శాతం డౌన్!
- ‘జాతి రత్నాలు’ బిజినెస్ అదుర్స్.. అంచనాలు పెంచేస్తున్న సినిమా
- పీఎంఏవై-యూ కింద కోటి 11 లక్షల ఇళ్లు మంజూరు
- ఆశాజనకంగా ఆటో సేల్స్ : ఫిబ్రవరిలో 10.59 శాతం పెరిగిన కార్ల విక్రయాలు
- పుదుచ్చేరి ఎన్నికలు.. ఎన్డీఏ కూటమిలో ఎవరెవరికి ఎన్ని సీట్లంటే.!
- సచిన్ వాజేను అరెస్టు చేయండి.. అసెంబ్లీలో ఫడ్నవీస్ డిమాండ్
- ఎమ్మెల్యే అభ్యర్థిగా అసోం సీఎం నామినేషన్ దాఖలు
- ఆదా చేయండి.. సీదా వెళ్లండి
- రూ.5.85 లక్షల కోట్ల రుణాల రద్దు!
- టీఎస్ ఈసెట్-2021 పరీక్ష షెడ్యూల్ విడుదల