ప్రగతి దీపాయంపల్లి

పల్లె ప్రగతితో మారిన రూపురేఖలు
నాడు సౌకర్యాలు కరువు
నేడు రూ.35లక్షలతో అభివృద్ధి పనులు
రెండేండ్లలోనే గణనీయమైన మార్పు
ఆహ్లాదం పంచుతున్న పచ్చని చెట్లు
సీసీ రోడ్లు.. వైకుంఠధామం.. డంపింగ్ యార్డుతో కష్టాలకు చెల్లు
ఇప్పటికే కలెక్టర్ చేతుల మీదుగా ‘ఆదర్శ గ్రామం’ అవార్డు ప్రదానం
పల్లె ప్రగతితో ఊళ్లు గ్రామ స్వరాజ్యం దిశగా పయనిస్తున్నాయి. నెలనెలా ప్రభుత్వం కూడా నిధులు మంజూరు చేస్తుండడంతో గ్రామాల రూపురేఖలు మారిపోతున్నాయి. ఏండ్లుగా పట్టిన దరిద్రం పోతున్నది. నాడు అభివృద్ధికి దూరంగా ఉన్న దీపాయంపల్లి నేడు కళకళలాడుతున్నది. ఇప్పటికే ‘ఆదర్శ గ్రామం’ అవార్డు పొందిన ఈ పల్లె, సీసీ రోడ్లు.. వైకుంఠధామం.. పల్లె ప్రకృతి వనం.. డంపింగ్‌యార్డు, నర్సరీ.. ఎటు చూసినా పచ్చని చెట్లు.. పరిశుభ్ర వాతావరణంతో ఆకట్టుకుంటున్నది.
- దౌల్తాబాద్, ఫిబ్రవరి 12:
గ్రామ స్వరాజ్యం దిశగా ప్రభుత్వం
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పల్లెప్రగతి’తో దీపాయంపల్లి గ్రామ రూపురేఖలు మారిపోయాయి. పల్లెకు పట్టిన ఏండ్ల సమస్యలను పోగొట్టేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పల్లెప్రగతి’ చక్కటి ఫలితాన్నిచ్చింది. ఎటు చూసినా పరిశుభ్రత పచ్చదనంతో గ్రామం కళకళలాడుతుంది. అద్దం లాంటి సీసీ రోడ్లతో అందంగా ముస్తాబయ్యింది. పారిశుధ్య నిర్వహణ, మంచి వాతావరణం పచ్చని చెట్లు ఆకట్టుకుంటున్నాయి. గ్రామం పరిశుభ్రంగా మారడంతో గ్రామంలోని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
- దౌల్తాబాద్, ఫిబ్రవరి 12
గ్రామ పంచాయతీలో జరిగిన నిర్మాణాలు..
గ్రామంలో 12లక్షలతో గ్రామ పంచాయతీ భవన నిర్మాణం, డంపింగ్ యార్డుకు 2లక్షల 50 వేలు, స్మశాన వాటికకు 12లక్షల 65వేలు, పల్లెప్రకృతి వనం, నర్సరీ ‘పల్లెప్రగతి’లో పూర్తి చేసుకున్నాయి. ప్రతిరోజు ఉదయం గ్రామంలో పారిశుధ్య కార్మికులు గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌తో గ్రామంలోని వీధుల్లో తిరుగుతూ.. చెత్తను సేకరించి తడి, పొడి చెత్తను గ్రామంలో నిర్మించిన డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు.
10 శాతం పూర్తి కావాల్సిన పనులు..
10 శాతం సీసీరోడ్లు, డ్రైనేజీ సమస్య, విద్యార్థుల కోసం నూతన భవనం, గ్రామంలో జరుగుతున్న పనులకు సుమారు 50లక్షల నిధులు ప్రభుత్వం మంజూరు చేస్తే గ్రామం సర్వంగా సుందరంగా చేసుకుంటామని గ్రామస్తులు కోరుతున్నారు.
గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు..
గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా నేరస్తులను తొందరగా గుర్తించేందుకు గ్రామ ప్రజలు అందరూ కలిసి డబ్బులు వేసుకొని గ్రామంలోని ప్రధాన సెంటర్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారు.
గ్రామ పంచాయతీగా ఏర్పాటు..
దీపాయంపల్లి గ్రామం జనాభా 2011 లెక్కల ప్రకారం 669 మంది ఉండగా, ఇందులో మహిళా ఓటర్లు 241 మంది, పురుషులు 238 మంది ఉన్నారు. 8 వార్డులతో గ్రామం 2014లో నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడింది. అప్పటి నుంచి గ్రామ పాలకులు, ప్రజలు చిత్తశుద్ధితో పనిచేస్తూ గ్రామాన్ని అభివృద్ధిలో ముందుంచేందుకు ఐక్యమత్యంతో ముందుకు సాగుతున్నారు. గ్రామంలో 95శాతం సీసీరోడ్లు, మరుదొడ్లు పూర్తి చేసుకోవడంతో పాటు ప్రభుత్వం తీసుకొచ్చిన ‘పల్లెప్రగతి’ పనుల్లో గ్రామం అభివృద్ధిలో దూసుకుపోవడంతో ఆదర్శ గ్రామంగా కలెక్టర్ ఎంపిక చేశారు. 2020 జనవరి 26 రోజున కలెక్టర్ సర్పంచ్ లావణ్యనర్సింహారెడ్డిని సన్మానించి అవార్డు అందించారు.
గ్రామంలో అన్ని పనులు జరుగుతున్నాయి..
మా దీపాయంపల్లి గ్రామంలో అన్ని పనులు మంచిగా జరుగుతున్నాయి. మిషన్‌భగీరథ నీళ్లు కూడా వస్తున్నాయి. ఇంటింటికీ మరుగుదొడ్లను నిర్మించారు. కరెంట్ సమస్యలు తీరాయి. ఇప్పుడు చాలా బాగుంది.
- గొల్ల సునీత, దీపాయంపల్లి గ్రామం
తాజావార్తలు
- పెద్దగట్టు ప్రాశస్త్యాన్ని పెంచిన ఘనత కేసీఆర్‌దే : మంత్రి జగదీశ్ రెడ్డి
- మోదీకి కొవాగ్జిన్.. కొవిషీల్డ్ సామర్థ్యంపై ఒవైసీ అనుమానం
- ఒప్పో ఫైండ్ ఎక్స్3 సిరీస్ లాంచ్ డేట్ ఫిక్స్!
- సీతారాముల కల్యాణానికి హాజరైన మంత్రి ఎర్రబెల్లి
- విద్యార్థులతో కలిసి రాహుల్‌గాంధీ పుష్ అప్స్, డ్యాన్స్.. వీడియోలు
- నువ్వు ఆమెను పెళ్లి చేసుకుంటావా ? రేప్ కేసులో సుప్రీం ప్రశ్న
- కొవిడ్ -19 వ్యాక్సినేషన్లో మోదీజీ చొరవ : డాక్టర్ హర్షవర్ధన్
- మెసేజ్ పెట్టడానికి, కాల్ చేసేందుకు ఎవరూ లేరు
- ‘బీజేపీ నాయకులు కేంద్రాన్ని నిలదీయాలి’
- 70 ఏళ్లున్న నాకెందుకు టీకా.. ముందు యువతకు ఇవ్వండి!