బుధవారం 03 మార్చి 2021
Siddipet - Feb 11, 2021 , 00:19:49

ఫ్యాన్సీ.. ఈజీ

ఫ్యాన్సీ.. ఈజీ

 • ఆన్‌లైన్‌లో అందుబాటులో ఫ్యాన్సీ నంబర్లు 
 • కోరుకున్న నంబర్‌ పొందే అవకాశం
 • నూతన విధానానికి శ్రీకారం చుట్టిన రవాణా శాఖ 
 • సిద్దిపేట రవాణా శాఖలో ప్రారంభమైన సేవలు 

ఖరీదైన వాహనం వాడడం సొసైటీలో స్టేటస్‌ సింబల్‌.. ఆ వాహనానికి ఫ్యాన్సీ నెంబర్‌ ఉంటే అదో క్రేజ్‌.. ఫ్యాన్సీ నంబర్ల విషయంలో వాహనదారులకు ఉపయోగపడేలా రవాణాశాఖ ఆన్‌లైన్‌ విధానాన్ని తెచ్చింది. ఫ్యాన్సీ నంబర్లు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతుండడంతో ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే, బ్రోకర్లకు చెక్‌ పెట్టి, వారు కోరుకున్న నంబర్‌ను అందిస్తున్నది. ఈ సేవలు సిద్దిపేట రవాణా శాఖ కార్యాలయంలో శుక్రవారం ప్రారంభమైంది. సిద్దిపేటలో ఆన్‌లైన్‌ ఫ్యాన్సీ నంబర్ల సేవలు అమలు కావడంతో వాహనదారుల నుంచి సంతోషం వ్యక్తమవుతున్నది.

సిద్దిపేట టౌన్‌, ఫిబ్రవరి 10 : వ్యాపారంలో బాగా సంపాదించిన జితేందర్‌ అనే వ్యక్తి రూ.16 లక్షలు వెచ్చించి ఖరీదైన కారు కొనుగోలు చేశాడు. ఇంత డబ్బులు పెట్టి కొన్న కారుకు ఫ్యాన్సీ నంబర్‌ ఉంటే బాగుంటుందని భావించి బ్రోకరును ఆశ్రయించాడు. రవాణా శాఖ కార్యాలయానికి మూడు నాలుగు సార్లు తిరిగి అడిగినన్ని డబ్బులు ఇచ్చి తనకు కావాల్సిన ఫ్యాన్సీ నంబర్‌ను దక్కించుకున్నాడు. ఇష్టపడి కొనుకున్న వాహనానికి కోరుకున్న నంబర్‌ కోసం బ్రోకరుకు అదనంగా డబ్బులు ఇచ్చుకోవాల్సి రావడంతో పాటు కార్యాలయం చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఫ్యాన్సీ నంబర్ల కోసం ఎక్కువగా మంది పోటీ పడినప్పుడు పరిస్థితి వేరుగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కోరుకున్న నంబర్‌ దక్కించుకోవడం కోసం నానా ఇబ్బందులు పడుతుంటారు. ఈ పరిస్థితుల్లో ఫ్యాన్సీ నంబర్ల విషయంలో వాహనదారులకు ఉపయోగపడే విధంగా రవాణాశాఖ ఆన్‌లైన్‌ విధానా న్ని తీసుకొచ్చింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే తాము కోరుకున్న నంబర్‌ను వాహనదారులు పొందవచ్చు.

 ఆధునిక సాంకేతిక...

రవాణా శాఖ ఆధునిక సాంకేతికత వైపు అడుగులు వేస్తున్నది. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నూతన విధానానికి శ్రీకా రం చుట్టింది. ఇప్పటికే ఆన్‌లైన్‌లో అనేక సేవలు అందిస్తూ జవాబుదారీగా ఉంటున్నది. కొత్తగా ఫ్యాన్సీ నంబర్ల కోసం ఆన్‌లైన్‌ సేవలను ప్రారంభించింది. ఈ విధానం సిద్దిపేట జిల్లాకేంద్రంలోని రవాణా శాఖ కార్యాలయంలో శుక్రవారం ప్రారంభమైంది. ఫ్యాన్సీ నంబర్లు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతుండడంతో పూర్తిగా ఆన్‌లైన్‌లో నంబర్లను కేటాయించేందుకు ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. బిడ్లను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చి దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఇకపై వాహనాల నంబర్ల కోసం వాహనదారులు కార్యాలయానికి రాకుండానే సమర్థంగా ఆన్‌లైన్‌ సేవలను పొందవచ్చు. ఆన్‌లైన్‌ విధానంతో పూర్తి స్థాయిలో వివాదాలకు పుల్‌స్టాఫ్‌ పడనున్నది. సిద్దిపేటలో ఆన్‌లైన్‌ ఫ్యాన్సీ నంబర్ల సేవలు ప్రారంభం కావడంతో వాహనదారుల నుంచి సంతోషం వ్యక్తమవుతున్నది. 

 దరఖాస్తు విధానం ఇలా.. 

 • ఫ్యాన్సీ నంబర్లపై ఆసక్తిగా ఉన్న బిడ్డర్లు తెలంగాణ ట్రాన్స్‌పోర్టు శాఖ వెబ్‌సైట్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. - కుడివైపు ఆన్‌లైన్‌ సర్వీస్‌ సెట్‌ అనే ఆప్షన్‌ వస్తుంది. దానిని క్లిక్‌ చేస్తే నంబరు రిజర్వేషన్‌ లింకు కనబడుతుంది. - ఆ రోజు అందుబాటులో ఉన్న నంబర్ల లింకు ఓపెన్‌ చేయగానే కనబడతాయి. నచ్చిన నంబరు ఎంపిక చేసుకొని సంబంధిత నంబరును తెలిపి టీఆర్‌ నంబరు నమోదు చేయాల్సి ఉంటుంది. వెంటనే ఐప్లెపై క్లిక్‌ చేయాలి. పూర్తి వివరాలు నమోదు చేసి వాహనదారులు ఎంచుకున్న నంబరు ఆధారంగా డబ్బులను చెల్లించాలి.
 • ఫ్యాన్సీ నంబరు రిజర్వేషన్‌ కోసం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మ ధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వ
 •  ఫ్యాన్సీ నంబర్లపై ఆసక్తిగా ఉన్న బిడ్డర్లు తెలంగాణ ట్రాన్స్‌పోర్టు శాఖ వెబ్‌సైట్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది.
 • కుడివైపు ఆన్‌లైన్‌ సర్వీస్‌ సెట్‌ అనే ఆప్షన్‌ వస్తుంది. దానిని క్లిక్‌ చేస్తే నంబరు రిజర్వేషన్‌ లింకు కనబడుతుంది.
 • ఆ రోజు అందుబాటులో ఉన్న నంబర్ల లింకు ఓపెన్‌ చేయగానే కనబడతాయి. నచ్చిన నంబరు ఎంపిక చేసుకొని సంబంధిత నంబరును తెలిపి టీఆర్‌ నంబరు నమోదు చేయాల్సి ఉంటుంది. వెంటనే ఐప్లెపై క్లిక్‌ చేయాలి. పూర్తి వివరాలు నమోదు చేసి వాహనదారులు ఎంచుకున్న నంబరు ఆధారంగా డబ్బులను చెల్లించాలి.
 • ఫ్యాన్సీ నంబరు రిజర్వేషన్‌ కోసం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మ ధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వ
 • రకు బిడ్‌ మొత్తాన్ని చెల్లిస్తే వెంటనే మనకు నంబరు కేటాయిస్తూ ప్రింట్‌ వస్తుంది. అనంతరం రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబరుకు మెస్సేజ్‌ వస్తుంది. 

పారదర్శకత కోసమే ఆన్‌లైన్‌ సేవలు  

పారదర్శకత, జవాబుదారీతనం కోసం రవాణా శాఖ ఆన్‌లైన్‌ ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపునకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే వీఐపీ, ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో ప్రారం భించాం. ఫ్యాన్సీ నంబరు కావాల్సి నవారు రవాణా కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదు. నేరుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఉద యం 8  నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఆన్‌లైన్‌ ద్వారా రూ.20 వేల రుసుం చెల్లించి కావాల్సిన నంబరు బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. బిడ్డింగ్‌లో ఒకరు కంటే ఎక్కువగా మంది పాల్గొంటే రెండు గంటలకల్లా మరింత రుసుం చెల్లించాల్సి ఉంటుంది. నిర్ణీత సమయంలో బిడ్‌ చెల్లించకపోతే తిరిగి వాపస్‌ ఇవ్వబడదు. నంబరు కేటాయించిన 15 రోజుల్లోపు వాహనాన్ని రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే కేటాయించిన నంబరు రద్దు అవుతుంది. వాహనదారులందరూ ఈ విషయాన్ని గమనించి ఆన్‌లైన్‌లో నంబరును దరఖాస్తు చేసుకోవాలి. 


VIDEOS

logo