శంభు దేవాలయంలో్ర పతి సోమవారం అన్నదానం

కొండపాక, ఫిబ్రవరి 10 : మండలంలోని దుద్దెడ స్వయం భూ శంభు దేవాలయంలో ప్రతి సోమవారం స్వామివారికి అన్నపూజ అనంతరం అన్నదానం చేస్తామని శంభు దేవాలయ సేవాసమితి ట్రస్టు చైర్మన్ గొల్లపల్లి రామచంద్రమూర్తిశర్మ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ జులై నుంచి ప్రతి సో మవారం ఆలయంలో అన్నదానం చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే సోమవారం చేపట్టే అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాత కృష్ణమూర్తిని సత్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్ మ హాదేవ్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్, ట్రస్టు ప్రతినిధులు మంచాల శ్రీనివాస్, అనంతుల నరేందర్, దేశాయిరెడ్డి, గోనె శ్రీనివాస్, వడ్లకొండ శ్రీనివాస్, పెద్ది నర్సయ్య, మంచాల చిన్న శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కుమార్‌యాదవ్ ఉన్నారు.
విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం
శంభులింగేశ్వర ఆలయ ఆవరణలో విశ్వబ్రాహ్మణ అర్చక పురోహిత సంఘం ఆధ్వర్యంలో మద్విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం నిర్వహించారు. అర్చక పురోహిత సంఘం జిల్లా అధ్యక్షుడు బాలబ్రహ్మం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ అర్చక పురోహిత సంఘం అధ్యక్షుడు నర్సింహాచార్యులు, ఆత్మకమిటీ చైర్మన్ రంగారెడ్డి, ఎంపీపీ సుగుణ పాల్గొన్నారు.
ముస్తాబైన రామలింగేశ్వర ఆలయం
చిన్నకోడూరు, ఫిబ్రవరి 10 : మండలంలోని మెట్టుపల్లి పం చాయతీలోని సలెంద్రిలో రామలింగేశ్వర ఆలయంలో మాఘ అమావాస్య పుణ్యస్నానాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని దేవాలయ చైర్మన్ పానుగంటి నర్సింహాచారి తెలిపారు.
తాజావార్తలు
- రాజ్‌నాథ్‌సింగ్ పంజరంలో పక్షి : రైతు నేత నరేశ్ తికాయత్
- మహేశ్‌బాబుకు పెద్ద చిక్కే వచ్చింది..అదేంటో తెలుసా..?
- భార్య టీ చేయకపోవడం.. భర్తను రెచ్చగొట్టి దాడికి ప్రేరేపించడం కాదు..
- చేనేతకు చేయూతనిద్దాం : మంత్రి నిరంజన్ రెడ్డి
- జీడీపీలో అసోం వాటా పెరిగేవరకూ అలసట లేని పోరు : అమిత్ షా
- నా మీటింగ్‌కు అనుమతి ఇవ్వడం లేదు..
- స్వల్ప వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయిన భారత్
- బెస్ట్ ఐటీ మినిస్టర్‌గా కేటీఆర్
- వాట్సాప్‌లో నెలకు ఎన్ని మేసెజ్‌లు వెళ్తాయో తెలుసా?
- మన ప్రాంత సమస్యలు తెలిసిన వ్యక్తినే గెలిపించుకుందాం