శనివారం 06 మార్చి 2021
Siddipet - Feb 11, 2021 , 00:19:30

సీఎం కేసీఆర్‌ లక్ష్యాన్ని నెరవేర్చాలి

సీఎం కేసీఆర్‌ లక్ష్యాన్ని నెరవేర్చాలి

  • 17న సంబురాలు వద్దు..విరివిగా మొక్కలు నాటాలి  
  • ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

చేర్యాల, ఫిబ్రవరి 10 : సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా పార్టీ శ్రేణులు సంబురాలు చేపట్టకుండా నేటినుంచి సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు (17వ తేదీ) వ రకు మొక్కలు నాటడడంతోపాటు గతంలో నాటిన మొక్కల సంరక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం ఎమ్మెల్యే ‘నమస్తే తెలంగాణ’తో ఫోన్‌లో మాట్లాడుతూ  మున్సిపల్‌ చైర్మన్లు, కౌన్సిలర్లు, మండల,  రైతు బంధు సమితి కోఆర్డినేటర్లు, ఎంపీపీ, జడ్పీటీసీలు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు, పీఏసీఎస్‌ చైర్మన్లు, ప్రజాప్రతిని ధులు హరిత తెలంగాణ కోసం పాటుపడాలన్నారు. ఎంపీ సంతోష్‌కుమార్‌ చేపట్టిన కోటి వృక్షార్చనలో భా గంగా కార్యకర్తలు విరివిగా మొక్కలు నాటాలన్నారు. 

కార్యకర్తలకు టీఆర్‌ఎస్‌ కొండంత అండ.. 

కార్యకర్తల సంక్షేమమే టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ముఖ్య లక్ష్యాల్లో ఒకటని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలువడంలో టీఆర్‌ఎస్‌  ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. ధూళిమిట్ట మం డల కేంద్రానికి చెందిన క్రియాశీల కార్యకర్త తాడూరి కరుణాకర్‌ ఇటీవల వ్యవసాయ బావి వద్ద పనిచేస్తూ ప్రమాదవశాత్త్తూ విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఈ మేరకు టీఆర్‌ఎస్‌ సభ్యత్వంలో వచ్చిన ప్రమాద బీమా రూ.2లక్షల చెక్కును మృతుడి భార్య దివ్యకు అందజేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మద్దూరు మండల ఉమ్మడి అధ్యక్షుడు మంద యాదగిరి, ధూళిమిట్ట సర్పంచ్‌ దీపికావేణుగోపాల్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ పోతరాజు మధు, పీఏసీఎస్‌ చైర్మన్‌ తిరుపతిరెడ్డి, నేతలు బడుగు సాయిలు, రావుల అజయ్‌, మేడ నాగభూషణం, చీటూరు రాజు, రచ్చ లక్ష్మయ్య, బావండ్లపల్లి కృష్ణ పాల్గొన్నారు. 

VIDEOS

logo