మిషన్ మోడ్‌లో ఇండ్ల నిర్మాణం

నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
మౌలిక సదుపాయాల కల్పన పనులు పూర్తి చేయాలి
కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి
ముట్రాజ్‌పల్లి ఆర్అండ్ఆర్ కాలనీ పనులపై సమీక్ష
సిద్దిపేట కలెక్టరేట్, ఫిబ్రవరి 9 : ముట్రాజ్‌పల్లి ఆర్అండ్ఆర్ కాలనీలో పెండింగ్ నిర్మాణ పనులు మిషన్‌మోడ్‌లో పూర్తి చేసి సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తేవాలని కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి అధికారులు, ఇంజినీర్లను ఆదేశించారు. ఏటిగడ్డ కిష్టాపూర్‌కు సంబంధించిన ఇండ్లను ఈ నెల 15 లోగా గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలన్నారు. వేములఘాట్‌కు సంబంధించిన ఇండ్లను ఈ నెల 25 లోపు, పల్లెపహాడ్, బ్రాహ్మణ బంజేరుపల్లి - రాంపూర్, సింగారం, లక్ష్మాపూర్ ముంపు గ్రామాల వారికి మార్చి 5 లోగా ఇండ్లను అందించడానికి సిద్ధం చేయాలన్నారు. కలెక్టరేట్లో మంగళవారం ముట్రాజ్‌పల్లి ఆర్అండ్ఆర్ కాలనీ నిర్మాణ పనుల పురోగతిపై అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణం ఉన్న మొత్తం 6 వేల గృహాలన్నీ పూర్తి చేసి గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలన్నారు. జిల్లాలోని 8 ముంపునకు గురయ్యే గ్రామాల నిర్వాసితుల కోసం ముట్రాజ్‌పల్లిలో నిర్మిస్తున్న ఆర్అండ్ఆర్ కాలనీ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలన్నారు. తొలుత ఏటిగడ్డకిష్టాపూర్కు ఇండ్ల నిర్మాణం, మౌలిక వసతుల పురోగతిపై సిద్దిపేట ఆర్డీవో అనంతరెడ్డి, మిషన్ భగీరథ ఈఈ రాజయ్య, ఆర్అండ్బీ డీఈ బాలప్రసాద్‌తో సమీక్షించారు. ఈ నెల 15 కల్లా ముట్రాజ్‌పల్లి ఆర్అండ్ఆర్ కాలనీలో ఏటిగడ్డకిష్టాపూర్ నిర్వాసితుల కోసం నిర్మించిన ఇండ్లను మౌలికసదుపాయాలతో సహా, గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ వేములఘాట్ గ్రామానికి సంబంధించి గృహ నిర్మాణ పనులపై అదనపు కలెక్టర్ పద్మాకర్, పీఆర్ ఎస్ఈ కనక రత్నం, పీఆర్ డీఈ శ్రీనివాస్‌రెడ్డితో సమీక్షించారు. ఈ నెల 25 కల్లా వేములఘాట్‌కు సంబంధించి గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలన్నారు. పల్లెపహాడ్‌కు సంబంధించి అదనపు కలెక్టర్, మిషన్ భగీరథ ఎస్, డీఈ నాగభూషణంతో సమీక్షించారు. బ్రాహ్మణ బంజేరుపల్లి -రాంపూర్‌కు సంబంధించి పనులపై అసిస్టెంట్ కలెక్టర్ దీపక్ తివారీ, ఇరిగేషన్ డీఈ పవన్ కుమార్, ఆర్అండ్బీ డీఈ రామకృష్ణ, లక్ష్మాపూర్‌కు సంబంధించి డీఆర్వో చెన్నయ్య, ఆర్అండ్బీ ఈఈ సుదర్శన్, డీఈ వెంకటేశ్వర్లు, సింగారానికి సంబంధించి హుస్నాబాద్ ఆర్డీవో జయచంద్రారెడ్డి, మిషన్ భగీరథ డీఈ విజయ్‌ప్రకాశ్, ఎర్రవల్లికి సంబంధించి గజ్వేల్ ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, పీఆర్ డీఈ ప్రభాకర్‌తో సమీక్ష నిర్వహించారు. మార్చి 5 కల్లా పల్లెపహాడ్తో పాటు బ్రాహ్మణ బంజేరుపల్లి -రాంపూర్, సింగారం, లక్ష్మాపూర్, ముంపు గ్రామాల వారికి ఇండ్లను అందించడానికి సిద్ధం చేయాలన్నారు. ప్రతి బృందానికి సంబంధించిన సర్వేయర్ క్షేత్రస్థాయిలో సర్వే పకడ్బందీగా పారదర్శకంగా చేపట్టాలని ఆదేశించారు. పనుల పురోగతిని సమీక్షించి కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేస్తామన్నారు. ముట్రాజ్‌పల్లి ఆర్అండ్ఆర్ కాలనీ ముంపు గ్రామానికి అంగన్వాడీ భవనాలను ప్రారంభించాలని, ఆ పనులను 20 రోజుల్లోగా పూర్తి చేయాలన్నారు. సమీక్షలో ఎస్ఈ కరుణాకర్‌బాబు, ఎస్‌ఈపీఆర్ కనకరత్నం, ఏజెన్సీ ప్రతినిధులు బాపినీడు, చంద్రశేఖర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, డీఈ రామచందర్ అధికారులు, సర్వేయర్లు పాల్గొన్నారు.
తాజావార్తలు
- హిట్ సీక్వెల్ అనౌన్స్ చేసిన నాని
- ప్రయాగ్‌రాజ్-బిలాస్పూర్ మధ్య రేపు విమాన సర్వీసు ప్రారంభం
- హైదరాబాద్‌లో ఐపీఎల్ నిర్వహించండి.. బీసీసీఐని కోరిన కేటీఆర్
- ఆ నినాదాలు వింటే చైనాకు ఒళ్లుమంట: ప్రధాని
- రామన్ ఎఫెక్ట్‌కు 93 ఏండ్లు.. చరిత్రలో ఈరోజు
- ఫుడ్ కార్పొరేషన్లో ఏజీఎం పోస్టులు
- ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్
- కారు ఢీకొని బాలుడు మృతి
- కరోనా వైరస్ రహిత రాష్ట్రంగా అరుణాచల్‌ప్రదేశ్
- కొవిడ్ ఎఫెక్ట్.. మాల్స్, లోకల్ ట్రైన్స్‌పై ఆంక్షలు!