స్వచ్చత.. శుభ్రత..

పల్లెప్రగతితో మారిన ముస్త్యాల గ్రామం
గ్రామంలో పెరిగిన పచ్చదనం
సీసీ రోడ్డు, డ్రైనేజీల నిర్మాణం
ముఖ చిత్రం
జనాభా-3148
ఓటర్లు-2756
గృహాలు-1247
వార్డులు-12
పారిశుధ్య సిబ్బంది-9
చెత్త సేకరణకు - 1 ట్రాక్టర్, 2 ట్రై సైకిల్స్
వాటర్ ట్యాంకులు - 2 మిషన్ భగీరథ, 6 చిన్న నీటి ట్యాంకులు
పూడ్చివేసిన పాడుబడిన బావులు-3
(1 ఇన్‌కంప్లీట్)
తొలిగించిన
శిథిలావస్థకు చేరిన గృహాలు -89
చేర్యాల, ఫిబ్రవరి 8 : పల్లె ప్రగతి ముస్త్యాల గ్రామ చిత్రాన్ని మార్చేసింది. నాడు మోడుబారిన పల్లెల్లో నేడు పచ్చదనం, పరిశుభ్రతతో దర్శనమిస్తున్నది. పల్లె ప్రకృతి వనాలు, రోడ్డుకు ఇరువైపులా మొక్కలు, సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలతోపాటు వైకుంఠధామం, డంపింగ్‌యార్డులతో ప్రగతి సాధించింది. సర్పంచ్ పెడుతల ఎల్లారెడ్డి ప్రత్యేక శ్రద్ధ, కార్యదర్శి పాకాల నవ్య కృషి అధికారులు, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ నాయకుల సహకారంతో గ్రామం మండలంలోనే ఆదర్శంగా మారింది.
అభివృద్ధి పనులు..
ముస్త్యాల గ్రామంలో పల్లె ప్రగతి ద్వారా నెలనెలా ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులతో వివిధ అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నారు. రూ.15లక్షలతో సీసీ రోడ్లు, రూ.12లక్షలతో డ్రైనేజీ నిర్మాణ పనులతోపాటు పల్లె ప్రకృతి వనం, నర్సరీల్లో మొక్కల పెంపకం, డంపింగ్ యార్డు నిర్మాణం, వైకుంఠధామం నిర్మాణంతో పాటు అక్కడే వెయింటింగ్ రూములు, మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు. జనగామ, సిద్దిపేట ప్రధాన రహదారిలో ఉన్న ముస్త్యాల గ్రామం రోడ్డుకిరువైపులా ఉన్న చెట్లకు రంగులు వేశారు. జీపీతోపాటు గ్రామ పాఠశాలలో, మోడల్ స్కూల్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో, వైకుంఠధామంతోపాటు డంపింగ్ యార్డుకు వెళ్లే దారుల్లో విరివిగా మొక్కలు నాటారు. గ్రామంలో అవసరమైన చోట విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయడంతోపాటు వంగిపోయిన స్తంభాలను తొలిగించారు. గుంతలుగా మారిన దారులపై మొరం పోయించి చదును చేయించారు.
నిత్యం చెత్త సేకరణ
గ్రామంలో ట్రాక్టర్, ట్రై సైకిల్స్ ద్వారా ప్రతి వార్డులో చెత్తను పారిశుధ్య సిబ్బంది సేకరిస్తున్నారు. ఆ చెత్తను ఎప్పటికప్పుడు డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. గ్రామంలో అన్ని గృహాలకు చెత్త సేకరణ బుట్టలు అందించి, తడి, పొడి చెత్తను వేర్వేరుగా ట్రాక్టర్‌కు అందించేలా చైతన్యం తెచ్చారు. చెత్త తరలించడంతోపాటు డ్రైనేజీలు శుభ్రం చేయడం, నిత్యం మొక్కలకు నీళ్లు పోయడంతో గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరుస్తున్నది.
మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ
పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామంలో విరివిగా మొక్కలు నాటారు. సిద్దిపేట తదితర ప్రాంతాల నుంచి రాయల్ ఫామ్స్, కార్పాకస్ మొక్కలతో పాటు గులాబీ, గన్నెరు తదితర మొక్కలను గ్రామంలో విస్తారంగా నాటడడంతో పాటు వాటికి ట్రీ గార్డులు ఏర్పాటు చేశారు. చెట్లను కొట్టివేయకుండా ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు మొక్కలను కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నాటిన మొక్కలను సంరక్షించడంతో పాటు కొత్తగా మొక్కలను నాటే వారిని ప్రోత్సహిస్తున్నారు.
మారిన గ్రామ ముఖ చిత్రం
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లె ప్రగతితో ముస్త్యాల గ్రామ ముఖ చిత్రం మారిపోయింది. పల్లెప్రగతి నిధులతో గ్రామంలో విస్తృతంగా మొక్కలు నాటడంతోపాటు పల్లె ప్రకృతివనం, డంపింగ్‌యార్డు, వైకుంఠధామం నిర్మించుకున్నాం. గ్రామంలో అవసరమైన చోట డ్రైనేజీల నిర్మాణం చేపట్టడంతో పాటు సీసీ రోడ్లు పోస్తున్నాం. పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించడంతో కరోనా వ్యాధి నుంచి ప్రజలకు రక్షణ కల్పించాం. చెత్తపై ప్రజలను చైతన్యవంతుల్ని చేశాం. గ్రామంలో పచ్చదనంతో పాటు పరిశుభ్రత కన్పిస్తున్నది. అధికారులు, పాలకవర్గం, గ్రామస్తుల సహకారంతో అభివృద్ధి చేస్తున్నా.
- పెడుతల ఎల్లారెడ్డి, సర్పంచ్, ముస్త్యాల
గ్రామాభివృద్ధి జరుగుతున్నది..
ముస్త్యాల గ్రామం అభివృద్ధి సాధిస్తున్నది. సర్పంచ్ ప్రత్యేక శ్రద్ధ వహించడంతో అధికారుల మార్గదర్శకాల మేరకు గ్రామంలో అభివృద్ధి పనులు త్వరగా చేపడుతున్నాం. ప్రజలకు నిత్యం భగీరథ నీటిని అందిస్తున్నాం. చెత్త తరలింపు విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తుండడంతో మహిళలు సైతం ట్రాక్టర్ల రాగానే చెత్తను వేస్తున్నారు. వీధుల్లో చెత్తను వేయకుండా ప్రత్యేకశ్రద్ధ తీసుకుంటున్నాం. పల్లె ప్రగతి కార్యక్రమం ప్రజల జీవన విధానాల్లో మార్పు తెచ్చింది.
- పాకాల నవ్య, కార్యదర్శి, ముస్త్యాల
తాజావార్తలు
- హిట్ సీక్వెల్ అనౌన్స్ చేసిన నాని
- ప్రయాగ్‌రాజ్-బిలాస్పూర్ మధ్య రేపు విమాన సర్వీసు ప్రారంభం
- హైదరాబాద్‌లో ఐపీఎల్ నిర్వహించండి.. బీసీసీఐని కోరిన కేటీఆర్
- ఆ నినాదాలు వింటే చైనాకు ఒళ్లుమంట: ప్రధాని
- రామన్ ఎఫెక్ట్‌కు 93 ఏండ్లు.. చరిత్రలో ఈరోజు
- ఫుడ్ కార్పొరేషన్లో ఏజీఎం పోస్టులు
- ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్
- కారు ఢీకొని బాలుడు మృతి
- కరోనా వైరస్ రహిత రాష్ట్రంగా అరుణాచల్‌ప్రదేశ్
- కొవిడ్ ఎఫెక్ట్.. మాల్స్, లోకల్ ట్రైన్స్‌పై ఆంక్షలు!