బుధవారం 03 మార్చి 2021
Siddipet - Feb 07, 2021 , 00:05:06

గజ్వేల్‌కు క్రీడాశోభ

గజ్వేల్‌కు క్రీడాశోభ

విద్యార్థులు  అన్నింటా ముందుస్థానంలో నిలవాలి

వచ్చే ఏడాది క్రీడా హబ్‌లోనే క్రీడా పోటీలు

ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి

గజ్వేల్‌లో రాష్ట్రస్థాయి నెట్‌బాల్‌ అండర్‌-16 బాలబాలికల పోటీలు ప్రారంభం

10 జిల్లాల నుంచి తరలివచ్చిన క్రీడాకారులు

గజ్వేల్‌ అర్బన్‌, ఫిబ్రవరి 6 : రాష్ట్రస్థాయి క్రీడలన్నీ గజ్వేల్‌ పట్టణంలో వరుసగా నిర్వహించడంతో గజ్వేల్‌ క్రీడాశోభను సంతరించుకున్నదని ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. గజ్వేల్‌ పట్టణంలో శనివారం అండర్‌-16 బాలబాలికల రాష్ట్రస్థాయి నెట్‌బాల్‌ పోటీలను తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖాజా విరాహత్‌ అలీతో కలిసి  ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గజ్వేల్‌లో క్రీడాహబ్‌కు అన్ని అనుమతులు పూర్తవుతున్నాయని, వచ్చే ఏడాది క్రీడాహబ్‌లోనే క్రీడా పోటీలను నిర్వహించుకుంటామన్నారు. క్రీడాహబ్‌లో ప్రతి క్రీడాపోటీకి ప్రత్యేక మైదానాన్ని ఏర్పాటు చేయడంతో పాటు 500ల మంది క్రీడాకారులకు వసతిని కల్పించే విధంగా నిర్మించనున్నట్లు తెలిపారు. గజ్వేల్‌ పట్టణంలో ఫుట్‌బాల్‌, వాలీబాల్‌, నెట్‌బాల్‌ వరుస రాష్ట్రస్థాయి క్రీడాపోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్రస్థాయి నెట్‌బాల్‌ పోటీల్లో మొత్తం 10 ఉమ్మడి జిల్లాల నుంచి 240 క్రీడాకారులు పోటీపడనున్నారన్నారు. నెట్‌బాల్‌ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి మహ్మద్‌ ఖాజాఖాన్‌ మాట్లాడుతూ నిర్వహణ కోసం 100 మంది కోచ్‌లు, మేనేజర్లు పనిచేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ జకీయొద్దీన్‌, ఎంపీపీ అమరావతి, వైస్‌ ఎంపీపీ కృష్ణగౌడ్‌, జడ్పీటీసీ మల్లేశం, కౌన్సిలర్లు గోపాల్‌రెడ్డి, రజిత, రహీం, నాయకులు దుర్గాప్రసాద్‌, మెదక్‌ జిల్లా నెట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డానియల్‌, ఉపాధ్యక్షురాలు విజయరేఖ, ప్రధాన కార్యదర్శి రంజిత్‌ తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo