గురువారం 25 ఫిబ్రవరి 2021
Siddipet - Feb 06, 2021 , 00:13:57

ఆర్టీసీ సిబ్బందికి అభయం

ఆర్టీసీ సిబ్బందికి అభయం

ఆర్టీసీ సిబ్బందికి ఉద్యోగ భద్రత 

దస్త్రంపై సంతకం చేసిన సీఎం కేసీఆర్‌

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 8 డిపోలు, 2,898 మంది ఉద్యోగులు  

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆర్టీసీ సిబ్బంది సంబురాలు

డిపోల వద్ద సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు

సిద్దిపేట, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను ఖరారు చేసింది. ఫైల్‌పై సీఎం కేసీఆర్‌ సంతకం చేయడంతో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో అన్ని ఆర్టీసీ డిపోల వద్ద ఆర్టీసీ ఉద్యోగులు సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి శుక్రవారం క్షీరాభిషేకాలు చేశారు. తమకు ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్‌ నిలబెట్టుకున్నారని ఆర్టీసీ కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీని మరింతగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మెదక్‌, నారాయణఖేడ్‌, సంగారెడ్డి, సిద్దిపేట, జహీరాబాద్‌, గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌, దుబ్బాక, హుస్నాబాద్‌ డిపోలు ఉన్నాయి. సంగారెడ్డి ఆర్‌ఎం ఆఫీసులో పనిచేసే ఉద్యోగులతో కలుపుకొని ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మొత్తం 2,898 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో 1,005 మంది డ్రైవర్లు , 1,340 మంది కండక్టర్లు, 553 మంది ఇతర ఉద్యోగులు పనిచేస్తున్నారు. గత ప్రభుత్వాల హయాంలో వీరికి ఉద్యోగ భద్రత లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. గతంలో ఉన్న నిబంధనలతో ఆర్టీసీ ఉద్యోగులు ఇబ్బందులు పడేవారు. విధి నిర్వహణలో భాగంగా అనవపర వేధింపులకు గురై ఉద్యోగాలు పోవాల్సిన పరిస్థితులుండేవి. దీంతో ఆ కుటుంబాలు రోడ్డున పడ్డ సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని కత్తి మీద సాములా ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రభుత్వాలు మారాయి. కానీ, వారి సమస్యలను పరిష్కరించడంలో గత ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోలేదు. ఆర్టీసీ సేవలను వినియోగించుకున్నాయి. కానీ, వారిపై ఏమాత్రం శ్రద్ధ చూపలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను ఒక్కొక్కటిగా సీఎం కేసీఆర్‌ పరిష్కరించుకుంటూ వస్తున్నారు. ఇవాళ ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రతను కల్పించడంపై నిర్ణయం తీసుకోవడంతో ఆర్టీసీ సిబ్బంది, ఉద్యోగుల కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగ భద్రత కలగడంతో పాటు ఎన్నో రోజుల నుంచి వేధిస్తున్న సమస్యలకు పరిష్కారం లభించడంతో వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల సంబురాలు నిర్వహించుకుని సీఎం కేసీఆర్‌ చిత్ర పటాలకు క్షీరాభిషేకాలు చేశారు. 

సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం  

రామచంద్రాపురం, ఫిబ్రవరి 5 : ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్‌ ఉద్యోగ భద్రత కల్పించడంతో కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ఆర్సీపురం డివిజన్‌లోని భెల్‌ డిపోలో అసిస్టెంట్‌ మేనేజర్‌ రవికుమార్‌తో కలిసి కార్మికులు సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా అసిస్టెంట్‌ మేనేజర్‌ రవికుమార్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ నిర్ణయంతో ఆర్టీసీ ఉద్యోగులకు మంచి రోజులు వస్తున్నాయని తెలిపారు. ఆర్టీసీకి సీఎం కేసీఆర్‌ అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నారని చెప్పారు. ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ సీఎం తీసుకున్న నిర్ణయం కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. ఆర్టీసీ కార్మికుల విషయంలో సీఎం కేసీఆర్‌ చూపిస్తున్న చొరవకు జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో ఉద్యోగులు అశ్విని, శ్రీశైలం, బలరాం, విజయ్‌కుమార్‌, ఏజిరెడ్డి, రామారావు, ప్రభాకర్‌, రాజమ్మ, మోహన్‌రావు, మహాలక్ష్మి, డీవీరావు, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో..

సంగారెడ్డి టౌన్‌, ఫిబ్రవరి 5 : ఆర్టీసీలో ఉద్యోగ భద్రత కల్పిస్తూ సీఎం కేసీఆర్‌ మార్గదర్శకాలను ఖరారు చేసి ఫైల్‌పై సంతకం చేయడంతో ఆర్టీసీ ఉద్యోగులు సంబురాలు జరుపుకొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని కొత్త బస్టాండ్‌, సంగారెడ్డి డిపోలో డీఎం నాగభూషణం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా డీఎం నాగభూషణం మాట్లాడుతూ.. ఉద్యోగులకు విధి నిర్వహణలో అనవసర వేధింపులకు గురవుతున్నామని, ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని సీఎం కేసీఆర్‌కు పలు సందర్భాల్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. స్పందించిన ముఖ్యమంత్రి ఉద్యోగ భద్రత కల్పిస్తూ పెద్ద మనసుతో ఆదుకున్నారని కొనియాడారు. సంస్థ అభివృద్ధి కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు పాల్గొన్నారు. 

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఆర్టీసీ సిబ్బంది వివరాలు 

క్ర. డిపోపేరు డ్రైవర్లు కండక్టర్లు ఇతరులు మొత్తం

సిబ్బంది

1. మెదక్‌ 129 215 81 425

2.    నారాయణ్‌ఖేడ్‌ 100 135 57 292

3.    సంగారెడ్డి 176 247 101 524

4.    సిద్దిపేట 160              215 76                451

5.  జహీరాబాద్‌ 155  205 69                429

6. గజ్వేల్‌ 

-ప్రజ్ఞాపూర్‌      129              153 52 334

7. దుబ్బాక 71                69 27 167

8. హుస్నాబాద్‌ 83                96 52                  231

9. ఎన్‌ఓయు 

(ఆర్‌ఎం ఆఫీసు) 02 05 38                  45

 

 మొత్తం                        1005 1340 553            2898

మెదక్‌ ఆర్టీసీ డిపోలో..

మెదక్‌టౌన్‌, ఫిబ్రవరి 5: ప్రభుత్వం ఆర్టీసీ సంస్థను  సంరక్షించి, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి వారికి అండగా ఉంటున్నారని మెదక్‌ డిపో మేనేజర్‌ జాకీర్‌ హుస్సేన్‌ అన్నారు. ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రతకు సంబంధించిన విధివిధానాలపై గతంలో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు సం తకం చేసిన నేపథ్యంలో శుక్రవారం మెదక్‌ బస్సు డిపో ప్రాం గణంలో డిపో మేనేజర్‌, ఆర్టీసీ కార్మికులతో కలిసి  సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ డిపో మేనేజర్‌ ప్రవీణ్‌, అర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.

రుణపడి ఉంటాం..

     ఆర్టీసీ కార్మికుల పట్ల సీఎం కేసీఆర్‌ సార్‌కు ఎనలేని ప్రేమ. మాపై కురిపించిన వరాలజల్లును నేడు నిజం చేస్తున్నారు.  విధుల సమయంలో వేధింపులు లేకుండా మాకు అండగా ఉండడం మాకు ఎనలేని ధైర్యాన్ని కలిగించింది. గతంలో జీతాలు లేక ఇబ్బందులు పడుతున్న రోజుల్లో సీఎం సార్‌ ఆదుకున్నారు.  ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం సార్‌కు మేమంతా రుణపడి ఉంటాం. 

  -పీ. కనకయ్య, డ్రైవరు, దుబ్బాక 

కొత్త ఉత్సాహాన్ని నింపింది..

    ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడం మాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆర్టీసీ సంస్థను కాపాడుకునేందుకు మేమంతా శాయశక్తులా కృషి చేస్తాం. కేసీఆర్‌ సార్‌ ఆశించిన విధంగా కష్టపడి పనిచేస్తాం. గతంలో మాకిచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చారు. ఆర్టీసీని లాభాల బాటలో నడిపించాలన్న సీఎం మాటలకు మాచేతలతో నిజమని నిరూపిస్తాం.  సీఎం కేసీఆర్‌ సార్‌కు, మా మంత్రి అజయ్‌ సార్‌కు కృతజ్ఞతలు. 

  -ప్రభాకర్‌, కండక్టరు, దుబ్బాక

భద్రత కల్పించడం ఆనందంగా ఉంది.. 

రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఇన్నాళ్లు ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితి ఉండేది. కానీ, సీఎం కేసీఆర్‌ ఆర్టీసీ కార్మికులకు పూర్తి భరోసా ఇస్తూ ఉద్యోగ భద్రత కల్పిస్తామని ప్రకటించడం.. ఆర్టీసీలోని కుటుంబాలందరికీ మేలు చేసినట్లయింది.  ఆర్టీసీ ఉద్యోగులందరికీ భరోసా కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉద్యోగులందరూ రుణపడి ఉంటారు. 

 -ఎం రాములు, డ్రైవర్‌ (హుస్నాబాద్‌ డిపో)

 సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు 

సీఎం కేసీఆర్‌ ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి వారిలో ఉన్న అభద్రతాభావాన్ని పోగొట్టారు. సీఎంకు ధన్యవాదాలు. మేము చేస్తున్న ఉద్యోగానికి ఇన్ని రోజులు ఎలాంటి భద్రత ఉండేదికాదు.  భద్రతలేని ఉద్యోగం చేస్తూ మానసికంగా కుంగిపోయేవాళ్లం. కానీ, సర్కారు మాకు సపోర్టుగా నిలిచి ధైర్యం చెప్పడం ఎంతో ఉత్సాహానిచ్చింది. ప్రభుత్వానికి ఉద్యోగులందరి తరపున కృతజ్ఞతలు. 

-జ్యోతి, కండక్టర్‌ (హుస్నాబాద్‌ డిపో ) 

సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉన్నాం

 పెద్ద మనసుతో సీఎం కేసీఆర్‌ ఉద్యోగ భద్రత కల్పించారు. ముఖ్యమంత్రికి ఆర్టీసీ ఉద్యోగులు రుణపడి ఉన్నాం. ఉద్యోగులను వేధిస్తున్నారని, ఉద్యోగాలు కోల్పోతున్నామని, వేధింపులకు గురిచేస్తున్నారని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయగా, అందరికీ ఉద్యోగ భద్రత కల్పించారు. ఆర్టీసీ ఉంటుందో పోతుందో తెలియని పరిస్థితుల్లో సంస్థను ఆర్థికంగా ఆదుకున్న ముఖ్యమంత్రి ఉద్యోగాలకు భరోసా కల్పించారు. నిబద్ధతతో పనిచేసి ఆర్టీసీని లాభాల్లోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తాం.

- అనిల్‌కుమార్‌, కండక్టర్‌ సంగారెడ్డి డిపో

ఆనందంగా ఉంది

సీఎం కేసీఆర్‌ తండ్రిలాగా ఆర్టీసీ ఉద్యోగులకు అండగా నిలిచినందుకు ఆయనకు కృతజ్ఞతలు. ఆర్టీసీ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నదని, సంస్థ బలోపేతానికి ముఖ్యమంత్రి అన్నివిధాలుగా సహాయ సహకారాలు అందించడం సంతోషకరం. ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ ఉత్తర్వులు వెలువరించడం ఆనందంగా ఉంది. అందరూ సంస్థ ఆదాయాన్ని పెంచి కష్టాల నుంచి గట్టెక్కించాలి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు ధన్యవాదాలు. 

- అమరేందర్‌, కండక్టర్‌, సంగారెడ్డి డిపో

VIDEOS

logo