ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Siddipet - Feb 05, 2021 , 02:52:58

జిల్లాకే కుకునూరుపల్లి స్కూల్‌ ఆదర్శం

జిల్లాకే కుకునూరుపల్లి స్కూల్‌ ఆదర్శం

కొండపాక, ఫిబ్రవరి 4 : మండలంలోని కుకునూరుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల జిల్లాకే ఆదర్శమని జిల్లా విద్యాశాఖ అధికారి రవికాంతారావు అన్నారు. కుకునూరుపల్లి ప్రభు త్వ ప్రాథమిక పాఠశాలలో సీసీ కెమెరాలు, డిజిటల్‌ టీవీని గురువారం ప్రారంభించారు. పాఠశాల అభివృద్ధే లక్ష్యంగా నిధులను సమకూర్చిన పీఎన్‌ఆర్‌ సేవా సంస్థ అధ్యక్షుడు పొల్కంపల్లి నరేందర్‌ను డీఈవో అభినందించారు. యువకులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పాఠశాలలకు అండగా నిలువాలని కోరారు. పాఠశాల గోడల పై వేసిన చిత్రాలు, ఆవరణలోని వేదిక, క్రీడా వస్తువులతోపాటు మొ క్కల పెంపకాన్ని పరిశీలించారు. డీఈవో వెంట ఎంఈవో శ్రీనివాస్‌రెడ్డి, హెచ్‌ఎం శ్రీనివాస్‌రెడ్డి, కో ఆప్షన్‌ సభ్యుడు కనకయ్య, ఉపాధ్యాయులు చంద్రోజు శ్రీనివాస్‌, రామచంద్రం, శంకర్‌ పాల్గొన్నారు. 

విద్యార్థులకు డ్రెస్సు, మాస్క్‌ల అందజేత 

కొండపాక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు స్కూల్‌ డ్రెస్సు, మాస్క్‌లను సర్పంచ్‌ చిట్టి మాధురి అందజేశారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులు భౌతికదూరం పాటిస్తూ త ప్పనిసరి మాస్క్‌ ధరించాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం నాగరాజు, పీడీ భాస్కర్‌రెడ్డి, సీఆర్‌పీ బాలకిషన్‌ పాల్గొన్నారు.

VIDEOS

logo