అన్ని హంగులతో కొండపోచమ్మ ఆలయ పునర్నిర్మాణం

రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి
జగదేవ్‌పూర్,ఫిబ్రవరి3: రాష్ట్రంలో ప్రసిద్ధి గాంచిన కొండపోచమ్మ దేవాలయాన్ని అన్ని హంగులతో పునర్నించనున్నట్లు రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని తీగుల్ నర్సాపూర్ కొండపోచమ్మ దేవాలయాన్ని ఆలయ చైర్మన్ ఉపేందర్‌రెడ్డి, సర్పంచ్ రజిత రమేశ్, స్తపతి వలినియాగం, ఎస్ఈ మల్లికార్జున్‌రెడ్డి, డీఈ ఓంప్రకాశ్, అర్కిటెక్ట్ రాజ్‌కుమార్‌తో కలిసి ఆయన సందర్శించారు. ఆలయ పునర్నిర్మాణ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఆలయానికి నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారని, ఎంతో ప్రాశస్త్యం కలిగిన దేవాలయం వద్ద భక్తులకు సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. కొండపోచమ్మ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మర్కూక్ పరిధిలోని రిజర్వాయర్‌కు కొండపోచమ్మ సాగర్‌గా సీఎం నామకరణం చేసినట్లు చెప్పారు. రిజర్వాయర్‌కు కొండపోచమ్మ సాగర్‌గా నామకరణం జరిగినప్పటి నుంచి అమ్మవారి ఆలయం మరింత గుర్తింపు పొందిందన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రి హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆలయాన్ని సందర్శించి ఆధికారులకు తగు సూచనలు ఇవ్వడంతో పాటు ముందుగా రూ.10 కోట్లతో ఆలయ పునరుద్ధరణ పనులు చేపట్టాలని ఆదేశించినట్లు తెలిపారు. అమ్మవారి ఆలయం ఎంత ఎత్తులో నిర్మిస్తే బాగుంటుందో, రోడ్ల నిర్మాణం ఏవిధంగా డెవలప్ చేయాలి, భక్తుల బసకోసం కాటేజీల నిర్మాణం.. పార్కింగ్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని, నాలుగైదు యాక్షన్ ప్లాన్లు తయారు చేసి ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు తెలిపారు. ఆలయం ముందున్న చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. ఆగమ శాస్త్రం, భక్తుల విశ్వాసం, సంప్రాదాయాలను దృష్టిలో ఉంచుకొని స్తపతి, వాస్తు నిపుణుల సూచనలతో దేవాలయ పునర్నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. అంతకు ముందు ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారి వెంట ఎంపీటీసీ కావ్యదర్గయ్య, ఈవో మోహన్‌రెడ్డి, ఆలయ అధికారులు వెంకట్‌రెడ్డి, రెవెన్యూ సిబ్బంది, అర్చకులు ఉన్నారు.
తాజావార్తలు
- చిరంజీవి అభిమానికి బాలకృష్ణ అభిమాని సాయం
- మార్చి 8 నుంచి 16 వరకు శ్రీ కేతకీ సంగమేశ్వరస్వామి జాతర
- అక్రమ దందాలకు పాల్పడుతున్న విలేకర్ల అరెస్టు
- డిక్కీ నేతృత్వంలో డా. ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు ఘన సన్మానం
- 'విజయ్ 65' వర్కవుట్ అవ్వాలని ఆశిస్తున్నా: పూజాహెగ్డే
- దేశీయ విమానయానం ఇక చౌక.. ఎలాగంటే!
- పక్కాగా మహా శివరాత్రి జాతర ఏర్పాట్లు
- బ్రాహ్మణ పక్షపాతి సీఎం కేసీఆర్ : ఎమ్మెల్సీ కవిత
- 1.37 కోట్లు దాటిన కరోనా టీకా లబ్ధిదారులు
- మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా శ్రీ కేతకీ సంగమేశ్వరస్వామి ఆలయాభివృద్ధి