ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Siddipet - Feb 03, 2021 , 00:05:20

పైసా లేకుండా పరీక్షలు

పైసా లేకుండా పరీక్షలు

డయాగ్నోస్టిక్‌ హబ్‌ ప్రజలకు వరం

57 రకాల ఉచిత వైద్య పరీక్షలు ఉచితం

ఏ వ్యాధి నిర్ధారణ పరీక్షలైనా ఇక ఇక్కడే

వారం రోజుల్లో రూ.2 కోట్ల వ్యయంతో సిటీ స్కాన్‌

వీధి వ్యాపారులు ఆత్మగౌరవంతో బతుకాలి

ప్లాస్టిక్‌ నుంచి ప్రజలకు శాశ్వత విముక్తి కల్పిస్తాం 

త్వరలో సిద్దిపేటలో ప్లాస్టిక్‌ బీటీ రోడ్డు నిర్మిస్తాం

ఆర్థిక శాఖ మంత్రి  హరీశ్‌రావు

హైదరాబాద్‌ తర్వాత తొలి డయాగ్నోస్టిక్‌ హబ్‌ను సిద్దిపేటలో ప్రారంభించుకున్నామని, పైసా ఖర్చు లేకుండా 57రకాల వైద్య పరీక్షలు ఉచితంగా ప్రభుత్వం చేయిస్తున్నదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం సిద్దిపేట ప్రభుత్వ దవాఖానలో డయాగ్నోస్టిక్‌ హబ్‌ను వైద్య ఆరోగ్య కమిషనర్‌ వాకాటి కరుణ, జడ్పీ అధ్యక్షురాలు రోజాశర్మతో కలిసి మంత్రి ప్రారంభించారు. అలాగే, సిద్దిపేట రూరల్‌ మండలం బుస్సాపూర్‌లో రిసోర్స్‌ పార్కు, ఫికల్‌ స్లడ్జ్‌ ట్రీట్‌మెంట్‌ప్లాంటు, చెత్తను వేరు చేసే యంత్రం, ప్లాస్టిక్‌ నుంచి టైల్స్‌ తయారు చేసే యూనిట్‌, వే బ్రిడ్జిని ప్రారంభించి, మాట్లాడారు. ప్లాస్టిక్‌ నుంచి ప్రజలకు శాశ్వత విముక్తి కల్పిస్తామన్నారు. మంత్రి హరీశ్‌రావు పారిశుధ్య కార్మికుని యూనిఫాం వేసుకొని, యంత్రంలో తడి, పొడి చెత్తను స్వయంగా వేయడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది.

- నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌

సిద్దిపేట కలెక్టరేట్‌, ఫిబ్రవరి 2 : రాష్ట్రంలో హైదరాబాద్‌ తర్వాత తొలి డయాగ్నోస్టిక్‌ హబ్‌ను సిద్దిపేటలో ప్రారంభించుకున్నామని, ఇక నుంచి ప్రజలకు ఏ వ్యాధి నిర్ధారణ పరీక్షలైనా ఇక్కడే చేస్తారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల, దవాఖానలో సకల సదుపాయాలతో ఉచిత డయాగ్నోస్టిక్‌ హబ్‌ను వైద్యా ఆరోగ్య కమిషనర్‌ వాకాటి కరుణ, జడ్పీ అధ్యక్షురాలు వేలేటి రోజాశర్మతో కలిసి మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. అంతకు ముందు చిన్నారులకు పల్స్‌పోలియో చుక్కలు వేశారు. డయాగ్నోస్టిక్‌ ద్వారా అందే సేవలను వైద్య ఆరోగ్య కమిషనర్‌ మంత్రికి వివరించారు. ల్యాబ్‌ పరీక్షలకు వచ్చిన వారికి ల్యాబ్‌ రిపోర్టులను అందజేశారు. రోగుల సహాయక విశ్రాంతి గది ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. హైదరాబాద్‌ తర్వాత సిద్దిపేట జిల్లాలోనే తొలి డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసుకున్నామన్నారు. 57 రకాల ఉచిత వైద్య పరీక్షలు ఇక్కడ చేస్తారన్నారు. పేద, మధ్యతరగతి వారు వైద్య పరీక్షలకు వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని, ఆ బాధ తప్పించాలని డయాగ్నోస్టిక్‌ హబ్‌ ఏర్పాటు చేశామన్నారు. రూ.2.50 కోట్లతో హబ్‌ను ప్రారంభం చేసుకున్నామన్నారు. 15 రోజులుగా 14,100 మందికి పరీక్షలు ట్రయల్‌ రన్‌ చేశామని, రూ.30 లక్షలు విలువ చేసే పరీక్షలు ఉచితంగా అందాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక దవాఖానలపై నమ్మకం పెరిగిందన్నారు. ఆరు నెలల్లో అల్ట్రాసౌండ్‌, ఈసీజీ, ఎక్స్‌రే సేవలు అందుబాటులోకి తెస్తామని, పైసా ఖర్చు లేకుండా చేస్తామన్నారు. రూ.2 కోట్ల వ్యయంతో సిటీ స్కాన్‌ వారం రోజుల్లో అందుబాటులోకి తేనున్నామన్నారు. గంటలో 1600 పరీక్షలు చేస్తారని, రోజుకు 35 వేల పరీక్షలు చేసే సామర్థ్యం సిద్దిపేట డయాగ్నోస్టిక్‌ హబ్‌కు ఉందన్నారు. రూ.50 లక్షలతో విశ్రాంతి గదిని రోగుల సహాయకుల కోసం అందుబాటులోకి తెచ్చామన్నారు. సహాయకులకు ఉచితంగా భోజనం పెడుతున్నామన్నారు. డయాగ్నోస్టిక్‌ హబ్‌, విశ్రాంతి గదిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ముజామ్మిల్‌ఖాన్‌, మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ తమిళ ఆరసు, డయాగ్నోస్టిక్‌ హబ్‌ నోడల్‌ ఆఫీసర్‌ కాశీనాథ్‌, ఏఎంసీ చైర్మన్‌ పాల సాయిరాం, కౌన్సిలర్లు మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, దీప్తి నాగరాజు, నాయకులు పూజల వెంకటేశ్వర్‌రావు, వైద్య సిబ్బంది, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

పేదలకు వరం సీఎం సహాయనిధి

సీఎం సహాయనిధి నిరుపేదలకు వరమని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. మంగళవారం సిద్దిపేటలోని తన నివాసంలో నియోజకవర్గ పరిధిలోని 30 మంది లబ్ధిదారులకు రూ.11 లక్షల 96 వేల సీఎం సహాయనిధి చెక్కులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి సీఎం సహాయనిధి అండగా నిలుస్తున్నదన్నారు.

 రైతు ఆదాయం పెంచేలా చేయాలి

సిద్దిపేట అర్బన్‌, ఫిబ్రవరి 2 : రాష్ట్రం ఏర్పడ్డాక రైతుల జీవితంలో మార్పు వచ్చిందని, తెలంగాణ రాకముందు రైతు పరిస్థితి దారుణంగా ఉండేదని మంత్రి హరీశ్‌రావు అన్నారు.  సిద్దిపేట రూరల్‌ మండల పరిధిలోని తోర్నాల వ్యవసాయ పరిశోధనా స్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పొద్దు తిరుగుడు పంటలో మేలైన యాజమాన్య పద్ధతులపై శిక్షణ, ఎస్సీ సబ్‌ ప్లాన్‌ కింద మంజూరైన వ్యవసాయ పనిముట్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రైతుల ఆదాయం పెంచే దిశగా శాస్త్రవేత్తలు ఆలోచించాలన్నారు. అనంతరం రూ.1.75 లక్షల విలువ గల పనిముట్లను తోర్నాల, చిన్నగుండవెళ్లి రైతులకు మంత్రి పంపిణీ చేశారు.

సిద్దిపేట అర్బన్‌, ఫిబ్రవరి 2 : ప్లాస్టిక్‌ బారి నుంచి పట్టణాలు, గ్రామాలను కాపాడటంతో పాటు మానవ వ్యర్థాల వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగకుండా పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో నేడు పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని మంత్రి హరీశ్‌రావు అన్నావీధి వ్యాపారులు ఆత్మగౌరవంతో బతుకాలి

 వీధి వ్యాపారులు ఆత్మ విశ్వాసంతో, ఆత్మ గౌరవంతో బతుకాలని వీధి వ్యాపారులకు 42 షాపులను రూ.కోటి 30 లక్షలతో నిర్మించి దుకాణ కేటాయింపు పత్రాలను ఇచ్చామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం సిద్దిపేట మున్సిపాలిటీ మెప్మా ఆధ్వర్యంలో నిర్మించిన స్ట్రీట్‌ వెండర్‌ కియోస్క్‌లను మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, మున్సిపల్‌ పాలకవర్గ సభ్యులతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ తెలంగాణలో అత్యంత ఆదర్శంగా సిద్దిపేట పట్టణాన్ని శుద్ధిపేటగా మార్చేందుకు రోడ్లపై తోపుడు బండ్లు పెట్టి చిరువ్యాపారాలు చేసుకుంటున్న వారికి షాపులను నిర్మించామన్నారు. వ్యాపారులు ఆరోగ్యంగా ఉండి మంచి జీవనోపాధి పొందాలని ఆకాంక్షించారు. షాపులు పొందినలబ్ధిదారులు ఇతరులకు అమ్మకుండా, కిరాయిలకు ఇవ్వకుండా వారే వ్యాపారం చేసుకొని జీవనోపాధి పొందాలన్నారు. మరో రూ.50 లక్షలతో 30 నుంచి 40 షాపులను నిర్మించి వీధి వ్యాపారులకు అందిస్తామన్నారు. ఇప్పుడున్న వ్యాపారం నడువకపోతే వేరే వ్యాపారం పెట్టుకునేందుకు సిద్దిపేట మున్సిపల్‌ కమిషనర్‌ అనుమతించాలన్నారు. సిద్దిపేటను శుద్ధిపేటగా మార్చేందుకు ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ రమణాచారి, వైస్‌ చైర్మన్‌ అక్తర్‌పటేల్‌, కౌన్సిలర్లు మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, కంటెం లక్ష్మిరాజు, శ్రీనివాస్‌యాదవ్‌, జావిద్‌, మోయిజ్‌, జ్యోతి రాజ్‌నరేందర్‌, సాకి బాల్‌లక్ష్మి ఆనంద్‌, బాసంగారి వెంకట్‌, ప్రవీణ్‌కుమార్‌, కోఆప్షన్‌ సభ్యుడు రాజయ్యతో పాటు టీఆర్‌ఎస్‌ నాయకులు పూజల వెంకటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

 హోటల్‌ను ప్రారంభించి.. టీ తాగి 

వీధి వ్యాపారుల దుకాణాలను ప్రారంభించిన సమయంలో అందులోనే మంత్రి ఓ హోటల్‌ను ప్రారంభించి, చాయ్‌ తాగారు. వీధి వ్యాపారులతో మాట్లాడి వారి వ్యాపార స్థితిగతులు, బాగోగులను మంత్రి ఆరా తీశారు. ప్రతి దుకాణదారుడితో మాట్లాడారు. దీంతో వ్యాపారులు సంతోషం వెలిబుచ్చారు.

చెత్తతో ఆదాయం

ప్లాస్టిక్‌ నుంచి ప్రజలకు శాశ్వత విముక్తి కల్పిస్తాం 

త్వరలో సిద్దిపేటలో ప్లాస్టిక్‌ బీటీ రోడ్డు నిర్మాణం

ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు 

రు. సిద్దిపేట రూరల్‌ మండల పరిధిలోని బుస్సాపూర్‌ రిసోర్స్‌ పార్కులో రూ.2.25 కోట్లతో నిర్మించిన ఫికల్‌ స్లడ్జ్‌ ట్రీట్‌మెంట్‌ప్లాంటు, రూ.50 లక్షలతో చెత్తను వేరు చేసే యంత్రం, రూ.30 లక్షలతో ప్లాస్టిక్‌ నుంచి టైల్స్‌ తయారు చేసే యూనిట్‌, రూ.12 లక్షలతో ఏర్పాటు చేసిన వే బ్రిడ్జిని అదనపు కలెక్టర్‌ ముజామ్మిల్‌ఖాన్‌తో కలిసి మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. మంత్రి పారిశుధ్య కార్మికుడి యూనిఫాం వేసుకొని, యంత్రంలో తడి, పొడి చెత్తను స్వయంగా వేయడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. దుర్గంధం నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలని, అదే విధంగా రైతులకు ఉపయోగపడే ఎరువు తయారు చేయడానికి మానవ వ్యర్థాల 

నిర్వహణ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఇక నుంచి 

సెప్టిక్‌ ట్యాంకుల నుంచి వచ్చే వ్యర్థాన్ని రోడ్డు పక్కన వేయొద్దనీ, అలా వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చెత్తను వేరు చేసే యంత్రాన్ని ఏర్పాటు చేశామని, దీని ద్వారా తడి, పొడి చెత్తను వేరు చేయవచ్చన్నారు. అలా డంపుయార్డుకు వచ్చే ప్రతి కిలో చెత్తను వినియోగించాలనే ఉద్దేశంతో ఈ యం త్రాన్ని ఏర్పాటు చేసుకున్నామన్నారు. ప్లాస్టిక్‌ నుంచి ఇటుకలు తయారు చేసే యంత్రాన్ని ఏర్పాటు చేసుకున్నామని, దీంతో బయట ప్లాస్టిక్‌ భూమిలో కలువకుండా భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ యంత్రాన్ని ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ప్లాస్టిక్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ద్వారా రాబోయే రోజుల్లో ట్రేలను, పూలకుండీలను తయారు చేసి వాటిని మార్కెటింగ్‌ చేస్తామన్నారు. పనికి రాని వస్తువులతో ఒక పా ర్కు ఏర్పాటు చేయాలని మంచి ఉద్దేశంతో స్వచ్ఛ థెమాటిక్‌ పార్కును ఏర్పాటు చేసేందుకు శంకుస్థాపన చేశామన్నారు. భవిష్యత్తులో సిద్దిపేటలో ప్లాస్టిక్‌తో బీటీ రోడ్డును వేసేలా అధికారులతో చర్చించి ప్రయోగాత్మకంగా నిర్ణయం తీసుకున్నామన్నారు. ఎక్కువ మన్నిక ఉండే ఈ ప్లాస్టిక్‌ రోడ్లు విదేశాల్లో వేస్తున్నారని, అది మన దృష్టికి రావడంతో ఇది ఒక ప్రయోగాత్మకంగా వేద్దామనుకుంటున్నామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ కడవేర్గు రాజనర్సు, సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ రమణాచారి, వైస్‌ ఎంపీపీ శేరిపల్లి యాదగిరి, సర్పంచులు సదాశివరెడ్డి, రఘోత్తంరెడ్డి, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.


VIDEOS

logo