చుక్కల మందుకు చక్కటి స్పందన

- జిల్లాలో 97.41 శాతం మందికి పోలియో చుక్కలు
- నేడు, రేపు ఇంటింటా వెళ్లి వేయనున్న సిబ్బంది
- జిల్లాలో పల్స్ పోలియో విజయవంతం
- చుక్కల మందు వేసిన జడ్పీ చైర్పర్సన్ రోజారాధాకృష్ణశర్మ
- పర్యవేక్షించిన రాష్ట్ర బృందం
జిల్లావ్యాప్తంగా పల్స్‌పోలియో విజయవంతమైంది. 97.41 శాతం మందికి పోలియో చుక్కలు వేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మనోహర్ తెలిపారు. జిల్లాలో 84,719 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాల్సి ఉండగా, 82,522 మందికి వేసినట్లు తెలిపారు. మిగిలిన చిన్నారులకు నేడు, రేపు ఇంటింటా తిరిగి ఆరోగ్య కార్యకర్తలు, ఆశవర్కర్లు, అంగన్వాడీ టీచర్లు పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. 685 కేంద్రాల ద్వారా 2,740 మంది వ్యాక్సినేటర్లు చుక్కల మందు వేశారు. 19 ట్రాన్సిట్ పాయింట్లు ఏర్పాటు చేశారు. మొబైల్ టీమ్స్ 34 పనిచేశాయి.
హుస్నాబాద్/ చిన్నకోడూరు/ సిద్దిపేట కలెక్టరేట్/ తొగుట/ చిన్నకోడూరు, జనవరి 31 : నిండు జీవితాన్ని కాపాడేందుకు రెండు చుక్కల పోలియో మందు వేయిస్తే సరిపోతుందని ఎమ్మెల్యే సతీశ్‌కుమార్, సీపీ జోయల్ డెవిస్ అన్నారు. ఆదివారం ఉదయం హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన కౌంటర్లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పోలియోను పూర్తిగా నిర్మూలించేందుకు నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మొదటి రోజు ప్రత్యేక కౌంటర్ల వద్ద చుక్కలు వేసిన అనంతరం మరో రెండు రోజులు ఇంటింటికీ తిరిగి వైద్య సిబ్బంది పోలియో చుక్కలు వేస్తారన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ రజితావెంకట్, మార్కెట్ చైర్మన్ కాసర్ల అశోక్‌బాబు, డాక్టర్ సౌమ్య, ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
నిండు జీవితానికి రెండు చుక్కలు: జడ్పీ చైర్పర్సన్
చిన్నారుల నిండు జీవితానికి పోలియో చుక్కలు ఎంతో మేలు చేస్తాయని జడ్పీ చైర్పర్సన్ రోజారాధాకృష్ణ అన్నారు. చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జడ్పీ చైర్పర్సన్ రోజారాధాకృష్ణ, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డితో కలిసి చిన్నారులకు పోలియో చుక్కలు వేయించారు. ఆమె వెంట సర్పంచ్ చంద్రకళ రవి, ఎంపీటీసీ దుర్గారెడ్డి, ఉప సర్పంచ్ వెంకట్‌రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ చంద్రమౌళి, అల్లీపూర్ సొసైటీ వైస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు లింగం తదితరులు ఉన్నారు. సిద్దిపేటలోని నాసర్‌పుర అర్బన్ హెల్త్ సెంటర్లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని జడ్పీ చైర్పర్సన్ రోజారాధాకృష్ణశర్మ, మున్సిపల్ చైర్మన్ రాజనర్సుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 0-5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి మనోహర్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి విజయరాణి, డిప్యూటీ డీఎంహెచ్‌వో మల్లీశ్వరి, నాసర్‌పుర మెడికల్ అధికారి వినోద్‌బాబ్జీ, మాస్ మీడియా అధికారి నర్సింహా, ఆశ నోడల్ అధికారి ఏసుమేరి, కౌన్సిలర్ బోనాల మంజుల నర్సింహులు, జ్యోతి రాజ్నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
వలస ప్రాంతాలపై దృష్టి సారించాలి : జిల్లా వైద్యాధికారి డాక్టర్ మనోహర్
పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్యాధికారి మనోహర్ వైద్య సిబ్బందికి, అంగన్వాడీ సిబ్బందికి, ఆశవర్కర్లకు పిలుపు నిచ్చారు. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా తొగుట పీహెచ్సీలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 97శాతం వరకు పోలియో చుక్కలు వేశామన్నారు. మిగిలిన వారికి సైతం సోమవారం ఇంటింటికీ, వలస ప్రాంతాలకు వెళ్లి పోలియో చుక్కలు వేస్తామన్నారు. తొగుట మండలంలో మల్లన్నసాగర్ కట్ట పనుల వద్ద పెద్ద ఎత్తున వలస కార్మికులున్నారని, వారి పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని పీహెచ్సీ వైద్యుడు వెంకటేశ్‌ను ఆదేశించారు. తొగుటలో ఎంపీపీ గాంధారి లత నరేందర్‌రెడ్డి, సర్పంచ్ కొండల్‌రెడ్డితో కలిసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
పోలియో కేంద్రాన్ని సందర్శించిన రాష్ట్ర ప్రతినిధులు
చిన్నకోడూరు మండలంలోని పలు పోలియో కేంద్రాలను పోలియో రాష్ట్ర ప్రతినిధులు బృందం సునిల్రాజు, పీటర్సన్ ఆదివారం సందర్శించారు. చిన్నారుల పోలియో చుక్కలు వేసే తీరుపై ఆరా తీశారు. పోలియో చుక్కల వేయించడం పై ప్రజల నుంచి స్పందన ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. పోలియో చుక్కల కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వైద్యులు చేస్తున్న కృషిని అభినందించారు. వారి వెంట డీఐవో విజయరాణి, వైద్యురాలు సరిత తదితరులు ఉన్నారు.
తాజావార్తలు
- హైవేపై ట్రక్కు భీభత్సం.. ఐదుగురు మృతి
- ఆ సీఎంకు రక్షణగా అందరూ మహిళలే..
- పువ్వాడ ఇంటికి అతిథిగా వెళ్ళిన చిరు, చరణ్
- మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్
- అరబిందో ఫార్మాలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం
- అల్లరి నరేష్ చిత్రం ఓటీటీలో విడుదల
- పార్లమెంట్లో కొవిడ్ వ్యాక్సినేషన్
- రాష్ర్టంలో 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు
- సమంత స్టన్నింగ్ డ్యాన్స్ వీడియో వైరల్
- అజ్ఞాతవాసి ఎఫెక్ట్.. తాజా సినిమా కోసం కసిగా పని చేస్తున్న త్రివిక్రమ్