మంగళవారం 02 మార్చి 2021
Siddipet - Feb 01, 2021 , 00:11:56

సీఎం కేసీఆర్‌ కప్‌ విజేత రంగారెడ్డి

 సీఎం కేసీఆర్‌ కప్‌ విజేత రంగారెడ్డి

  • గజ్వేల్‌లో ముగిసిన రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ క్రీడలు
  • గెలుపొందిన రంగారెడ్డి జిల్లా జట్టు
  • రెండు,మూడో స్థానాల్లో వనపర్తి, మహబూబ్‌నగర్‌ జట్లు
  • ట్రోఫీలను అందజేసిన ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి

గజ్వేల్‌ అర్బన్‌, జనవరి 31: గజ్వేల్‌ పట్టణంలోనాలుగు రోజులుగా నిర్వహించిన సీఎం కేసీఆర్‌ కప్‌ -2021 రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ క్రీడలు  ఆదివారం ముగిసాయి. టోర్నమెంట్‌లో మొత్తం 9 ఉమ్మడి జిల్లాల నుంచి జట్లు పోటీపడగా, రంగారెడ్డి జిల్లా మొదటిస్థానంలో నిలిచింది. రెండోస్థానంలో వనపర్తి, మూడో స్థానంలో మహబూబ్‌నగర్‌ జిల్లా జట్లు నిలిచాయి. ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్‌సీ రాజమౌళి, ఏఎంసీ చైర్‌పర్సన్‌ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్‌, తెలంగాణ రాష్ట్ర ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ఫాల్గుణ ట్రోఫీలు, మెడల్స్‌, ప్రశంసా పత్రాలు వారికి అందజేశారు. టోర్నమెంట్‌ నిర్వహించిన గజ్వేల్‌ పుట్‌బాల్‌ క్లబ్‌ను, నిర్వహణకు ట్రోఫీలు, మెడల్స్‌, జెర్సీలు అందించిన కోడ్‌ షాపింగ్‌మాల్‌ నిర్వాహకులు సంజీవ్‌, ప్రదీప్‌ను, విరాళాలు ఇచ్చిన దాతలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గ కేంద్రంలో రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ క్రీడలు నిర్వహించడం  సంతోషాన్ని ఇచ్చిందన్నారు. గజ్వేల్‌ ప్రాంతాన్ని క్రీడాహబ్‌కు మార్చడానికి అవసరమైన అన్ని సౌకర్యాలను త్వరలో ఏర్పాటు చేయడానికి సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ దాసరి అమరావతి, కౌన్సిలర్లు, రెఫరీలు, పీఈటీలు, క్రీడాభిమానులు, నాయకులు పాల్గొన్నారు.

VIDEOS

logo