సోమవారం 01 మార్చి 2021
Siddipet - Jan 31, 2021 , 03:04:55

పెయింటర్‌ అవతారమెత్తిన ఇన్‌చార్జి హెచ్‌ఎం

పెయింటర్‌ అవతారమెత్తిన ఇన్‌చార్జి హెచ్‌ఎం

ధూళిమిట్ట, జనవరి 30 : కరోనా నేపథ్యంలో మూతపడిన విద్యాసంస్థలు రేపటి నుంచి ప్రారంభం కానున్న క్రమంలో విద్యార్థులకు ప్రభుత్వం పలు మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ క్రమంలో విద్యార్థులకు కొవిడ్‌-19 నిబంధనల పై అవగాహన కల్పించేందుకు మండలంలోని కూటిగల్‌ ఇన్‌చార్జ్జి హెచ్‌ఎం వెళ్ది శ్రీనివాస్‌  శనివారం పెయింటర్‌ అవతారమెత్తారు. శ్రీనివాస్‌ రంగులు, బ్రష్‌లు చేతబట్టి  పాఠశాలలోని గోడలు తదితర ప్రదేశాల్లో పెయింట్స్‌తో కరోనా రాకుండా పాటించాల్సిన జాగ్రత్తలను వాల్‌ రైటింగ్స్‌ చేశారు. పాఠశాలలో అన్ని తానై వ్యవహరిస్తున్న హెచ్‌ఎంను గ్రామస్తులతో పాటు పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు.

VIDEOS

logo