టార్గెట్ వందశాతం

- ఆస్తిపన్ను వసూళ్లపై బల్దియాల దృష్టి
- సిబ్బంది నుంచి కమిషనర్ వరకు టార్గెట్లు
- వందశాతం వసూలు కోసం ప్రత్యేక బృందాలు
- మొండి బకాయిదారులకు లీగల్ నోటీసులు
- పన్నులు చెల్లించాలంటూ నిత్యం ఎస్సెమ్మెస్‌లు
- ఆదేశించిన సీడీఎంఏ
హుస్నాబాద్ టౌన్, జనవరి 30 : అభివృద్ధి సాగాలంటే నిధులు ఉండాలి. ప్రతి ఒక్కరూ తమ ఆస్తులకు సంబంధించిన పన్నులు సక్రమంగా చెల్లిస్తే స్థానిక సంస్థలకు ఆదాయం సమకూరి, అభివృద్ధి పనులు చేసేందుకు సాధ్యమవుతుంది. గతేడాది కరోనా కారణంగా ఆస్తిపన్ను వసూళ్లపై పెద్దగా దృష్టి సారించనప్పటికీ, ఈ ఏడాది మాత్రం ఆస్తి పన్నును వందశాతం వసూలు చేయాలని మున్సిపల్ శాఖ సీడీఎంఏ ఆదేశాలు జారీచేశారు. దీంతో రేపటి నుంచి పన్ను వసూళ్లు చేపట్టాలని మున్సిపల్ అధికారులు నిర్ణయించారు.
వందశాతం వసూళ్లు టార్గెట్..
ఆస్తిపన్ను బకాయిలు వసూలు చేసేందుకు మున్సిపల్ ఆధ్వర్యంలో మైక్‌లు, బ్యానర్లతో పాటు పలురకాల విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు సంబంధించిన బకాయిదారుల వివరాలన్నీ మున్సిపల్ వెబ్సైట్లో పెట్టడంతో పాటు బకాయిదారులందరికీ డిమాండ్ నోటీసులు జారీ చేయనున్నారు. జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్ - ప్రజ్ఞాపూర్, దుబ్బాక, చేర్యాల, హుస్నాబాద్ బల్దియాలు ఉన్నాయి. హుస్నాబాద్ మున్సిపల్‌కు సంబంధించి 2020-2021 సంవత్సరానికి గానూ ఆస్తిపన్నుకు సంబంధించి రూ.1.17కోట్ల టార్గెట్ ఉండగా, వందశాతం వసూలు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయనున్నారు.
పన్ను వసూళ్లకు ప్రత్యేక బృందాలు..
హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రైవేట్, ప్రభుత్వ ఆస్తులు, తాగునీటి కనెక్షన్లు, ట్రేడ్ లైసెన్సులు, ఖాళీస్థలాలు, ప్రచార బోర్డులతో పాటు పలు రకాల పన్నులను వసూలు చేయాలని నిర్ణయించారు. దీనికోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. బిల్ కలెక్టర్లకు తోడు ఆర్ఐ, జూనియర్ అసిస్టెంట్లతో కలిసి మూడు బృందాలను నియమించి పన్ను వసూళ్లు చేయనున్నారు.
పన్నులు చెల్లించాలంటూ ఎస్సెమ్మెస్‌లు..
ఆస్తి పన్ను వసూలు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణలో భాగంగా బకాయిదారుల సెల్ఫోన్లకు ఎస్సెమ్మెస్‌లు మున్సిపల్ ద్వారా పంపించనున్నారు. సిబ్బందితో పాటు కమిషనర్లు సైతం పాల్గొనాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇందులో భాగంగా మున్సిపల్ పరిధిలోని మొండి బకాయిదారులకు సంబంధించి జాబితాను తయారు చేస్తున్నారు. ఇందులో ఎక్కువ మొత్తంలో బకాయిలు ఉన్న వారికి సంబంధించిన జాబితాను తయారు చేయడమే కాకుండా, ఆ బకాయిలను స్వయంగా కమిషనర్, మేనేజర్లు వసూలు చేసేవిధంగా కార్యాచరణ రూపొందించారు. పన్నులు చెల్లించని వారికి ప్రత్యేకంగా లీగల్ నోటీసులు జారీచేసి చట్టపరమైన చర్యలకు సైతం ఉపక్రమించాలని ఉన్నతాధికారులు ఆదేశాలను అమలు చేసేదిశగా బల్దియా సిబ్బంది సాగుతున్నారు.
వసూళ్ల మేళా..
పన్ను వసూళ్ల కోసం ప్రతి సోమ, బుధవారాల్లో బల్దియాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. వార్డు పరిధిలోని కమ్యూనిటీ హాల్స్, వార్డు కార్యాలయాల్లో పన్ను వసూళ్లకు మేళాలు ప్రత్యేకంగా నిర్వహించాలని భావిస్తున్నారు. మేళాలతో పాటు రోజువారీగా సైతం లక్షరూపాయల మేర పన్నుల వసూళ్ల లక్ష్యాన్ని సాధించే విధంగా సిబ్బంది కృషిచేయనున్నారు. రేపటి నుంచి
వసూళ్లు ప్రారంభిస్తాం..
సోమవారం నుంచి ఆస్తిపన్ను వసూళ్లు చేయాలని నిర్ణయించాం. ఇందుకు గానూ మూడు బృందాలను నియమించాం. నిత్యం లక్ష రూపాయలు వసూలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. ఈ ఏడాది వందశాతం టార్గెట్‌ను పూర్తిచేస్తాం. మొండి బకాయిదారులకు లీగల్ నోటీసులు జారీచేస్తాం.
- రాజమల్లయ్య, హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్
తాజావార్తలు
- మార్చి 4న దక్షిణాది రాష్ట్రాల సీఎంల సమావేశం
- దేశంలో కరోనా విజృంభణ.. కొత్తగా 16,752 కేసులు
- ప్రముఖ నటుడితో వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్న ఆహా
- ఇక వాట్సాప్ గ్రూపులు వాడబోమన్న సుప్రీంకోర్టు
- అటవీ అధికారులపై దాడికి యత్నం
- అభివృద్ధిలో మహబూబ్‌నగర్ జిల్లాకు ప్రత్యేక స్థానం
- డివైడర్‌పై నుంచి దూసుకెళ్లి లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి
- ఇది ట్రైలరే.. అంబానీకి జైషుల్ హింద్ వార్నింగ్
- మద్దతు కోసం.. ఐదు రాష్ట్రాల్లో రాకేశ్ తికాయిత్ పర్యటన
- మెగాస్టార్‌కు సర్జరీ..సక్సెస్ కావాలంటూ ప్రార్ధనలు