బడులకు వేళాయె

- దాదాపు 11 నెలలుగా మూతపడ్డ విద్యాసంస్థలు
- పునఃప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
- కొవిడ్ నిబంధనలు అమలు
- భౌతిక దూరం, మాస్కు, తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి
- జిల్లాలో తెరుచుకోనున్న 506 విద్యాసంస్థలు
సిద్దిపేట అర్బన్, జనవరి 30 : కొవిడ్ - లాక్డౌన్ కారణంగా గతేడాది మార్చి నుంచి మూతపడ్డ పాఠశాలలు రేపు తెరుచుకోనున్నాయి. చాలాకాలం తర్వాత పాఠశాలలు పునఃప్రారంభం కానుండడంతో విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా అధికారులు ఇప్పటికే అన్ని చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా అన్ని విద్యాసంస్థల్లో పారిశుధ్య పనులు చేపట్టారు. 15 రోజుల నుంచే మంత్రి హరీశ్‌రావు విద్యాశాఖ అధికారులను సమాయత్తం చేస్తూ పాఠశాలల పునఃప్రారంభానికి తగిన చర్యలు తీసుకున్నారు. అన్ని పాఠశాలల్లో శానిటైజేషన్, నీటివసతి, మరుగుదొడ్లు, మధ్యాహ్న భోజనానికి కావాల్సిన సరుకులు అందించడం లాంటి సౌకర్యాలు కల్పించారు. పాఠశాలలు తెరిచినా తల్లిదండ్రులు తాము ఇచ్చిన రాతపూర్వక అంగీకారంతోనే విద్యార్థులు హాజరు కావాలని తెలుపగా, దాదాపు మెజార్టీ తల్లిదండ్రులు తమ అంగీకారాన్ని తెలిపారు. ఒకవేళ రావడానికి ఇబ్బందిపడే వారు ఆన్లైన్ ద్వారా క్లాసులు వినవచ్చని సూచించారు.
పూర్తయిన ఏర్పాట్లు..
పాఠశాలలు భౌతికంగా తెరుస్తున్న ఈ సందర్భంలో ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ తప్పకుండా కొవిడ్ నిబంధనలు పాటించే విధంగా చూడాలని ప్రభుత్వం ఇప్పటికే సూచించింది. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాచిస్తూ, మాస్కు ధరించి రావాలని అధికారులు చెబుతున్నారు. ఒక తరగతికి కేవలం 20 మంది విద్యార్థులకు మాత్రమే కూర్చునేలా సీటింగ్ అరెంజ్మెంట్ ఏర్పాట్లు చేశారు. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల ఆధ్వర్యంలో పరిశుభ్రత, శానిటైజేషన్ పనులు దాదాపు జిల్లాలోని అన్ని పాఠశాలల్లో పూర్తిచేశారు. విద్యార్థుల టెంపరేచర్ చెక్ చేయడానికి అవసరమయ్యే థర్మల్ స్క్రీనింగ్ మిషన్లను పాఠశాలలకు పంపిణీ చేశారు. అనారోగ్యంతో ఉన్న విద్యార్థులు ముందుగా సమాచారం ఇస్తే వారికి తగిన జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. అందుకు అనుగుణంగా ప్రతి పాఠశాలలో ఐసోలేషన్ గదులు ఏర్పాటు చేశారు. ప్రతి పాఠశాలలో విద్యార్థులు పాటించాల్సిన నియమాల బోర్డులను ఏర్పాటు చేశారు. విద్యార్థుల మధ్యాహ్న భోజనం కోసం అవసరమైన బియ్యం ఇప్పటికే పాఠశాలలకు చేరుకున్నాయి. విద్యార్థుల సౌకర్యం కోసం ఆర్టీసీ బస్సులు నడిచేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.
జిల్లాలో తెరుచుకోనున్న 506 విద్యాసంస్థలు..
సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా మొత్తం 506 విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. అందులో 387 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. 216 మండల, జిల్లా పరిషత్ పాఠశాలలు, 92 ప్రైవేట్ పాఠశాలలు, 22కేజీబీవీలు, 18సొసైటీ పాఠశాలలు, 14ఆదర్శ పాఠశాలలు, 10రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు, 6మైనార్టీ వెల్ఫేర్, 5మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకుల పాఠశాలలు, రెండు ఆశ్రమ పాఠశాలలు, ఒక నవోదయ పాఠశాల ఉన్నాయి. మొత్తం 387 పాఠశాలల్లో 30,262 మంది విద్యార్థులు ఉన్నారు. జిల్లాలో 20ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 39ప్రైవేట్ జూనియర్ కళాశాలలు, మొత్తం 59జూనియర్ కళాశాలలు తెరుచుకోనున్నాయి. జిల్లాలో 8ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 25ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు, ప్రభుత్వ పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలలు7, ప్రైవేట్ పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలలు3, ప్రైవేట్ డీఈడీ, బీఈడీ, బీపీఈడీ కళాశాలలు9, బీటెక్, బీ ఫార్మసీ కళాశాలలు 4, ఒక ప్రభుత్వ పీజీ కళాశాల, 3ప్రైవేట్ పీజీ కళాశాలలు ఉండగా, మొత్తం 333 ప్రభుత్వ, 173 ప్రైవేట్ విద్యాసంస్థల్లో రేపు తరగతులు ప్రారంభం కానున్నాయి. ప్రతి విద్యాసంస్థలో కొవిడ్ నిబంధనల మేరకు తరగతులు నడిచేలా అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
తాజావార్తలు
- ఏకంగా పోలీస్ ఇంట్లో చోరీకి పాల్పడిన దొంగలు
- పాక్ క్రికెటర్ అక్మల్‌కు లైన్ క్లియర్..
- మంత్రులతో సీఎం కేసీఆర్ భేటీ
- శీతాకాలం పోతే పెట్రో ధరలు దిగివస్తాయి: పెట్రోలియం మంత్రి
- గవర్నర్ దత్తాత్రేయను తోసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
- గుజరాత్‌కు కాషాయ పార్టీ చేసిందేమీ లేదు : సూరత్ రోడ్‌షోలో కేజ్రీవాల్
- నల్లటి పెదవులు అందంగా మారాలా? ఇవి ట్రై చేయండి
- కుమార్తె ప్రియుడితో పారిపోయిన తల్లి
- టికెట్ డబ్బులు రిఫండ్ ఇవ్వండి..
- రోడ్ షోలో స్కూటీ నడిపిన స్మృతి ఇరానీ.. వీడియో