వంటిమామిడి ఏఎంసీని సకల వసతులతో ఆధునీకరిస్తాం

రైతు నుంచి నేరుగా కూరగాయల కొనుగోలు చేస్తాం
4శాతానికి మించి కమీషన్ వసూలు చేస్తే చర్యలు
వంటిమామిడి ఏఎంసీని మరింత విస్తరిస్తాం
సమీక్షలో కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి
ములుగు, జనవరి 28 : సీఎం కేసీఆర్ సూచన మేరకు వంటిమామిడి మార్కెట్ యార్డును అన్ని వసతులతో ఆధునీకరిస్తామని కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి తెలిపారు. ములుగు మండల పరిధిలోని వంటిమామిడి మార్కెట్ యార్డును గురువారం ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ జహంగీర్‌తో కలిసి కలెక్టర్ సందర్శించారు. కూరగాయల విక్రయానికి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి నేరుగా రైతులతో మాట్లాడి తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా కమీషన్ ఏజెంట్లు నడుచుకోవాలని, అందుకు విరుద్ధ్దంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు మార్కెటింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... భవిష్యత్ అవసరాల కోసం వంటిమామిడి మార్కెట్‌ను అత్యాధునిక సౌక ర్యాలతో అధునీకరిస్తామన్నారు. ఏజెంట్లు రైతుల నుంచి 4 శాతం కంటే ఎక్కువ కమీషన్ తీసుకోవద్దని, ఆ దిశగా మార్కెటింగ్ అధికారులు నిత్యం పర్యవేక్షించాలని ఆదేశించారు. మార్కెట్లో భద్రత రీత్యా మరిన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటుతో పాటు ప్రాథమిక సదుపాయాల కల్పనకు అనువైన స్థలాన్ని గుర్తించాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్ అవసరాల కోసం వంటిమామిడి మార్కెట్‌ను అత్యాధునిక సౌకర్యాలతో అధునీకరిస్తామన్నారు. మార్కెట్లోని 16 షాప్‌ల్లో ప్రైవేట్ ఏజెంట్లు లేకుండా, రైతుల నుంచి నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు చేపడతామని తెలిపారు. ఈ మార్కెట్ నుంచి అన్ని ప్రభుత్వ మెస్‌లు, వసతి గృహాలకు కూరగాయలను సరఫరా చేస్తామని తెలిపారు.
రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ : ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి
రైతుల శ్రేయస్సు కోసం నిరతంరం కృషిచేసే సీఎం కేసీఆర్ నిజమైన రైతు బాంధవుడని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన వ్యవసాయ చట్టాలతో సతమతమవుతున్న రైతులకు సీఎం కేసీఆర్ తీపి కబురు అందించారన్నారు. ప్రభుత్వమే కనీస మద్దతు ధర కల్పిస్తూ రైతుల నుంచి నేరుగా కూరగాయలు కొంటామని సీఎం స్వయంగా ప్రకటించడం హర్షనీయమన్నారు. కోల్డ్ స్టోరేజీల ఏర్పాటుతో రైతులకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. సమీక్షలో సీపీ జోయల్ డెవిస్, ఏఎంసీ చైర్మన్ జహంగీర్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి జుబేర్‌పాషా, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, ఆర్డీవో విజయేందర్‌రెడ్డి, వ్యవసాయ, మార్కెటింగ్ జిల్లా అధికారులు శ్రవణ్, రియాజ్, జడ్పీటీసీ నర్సంపల్లి జయమ్మ అర్జున్‌గౌడ్, వైస్ ఎంపీపీ వీరన్నగారి దేవేందర్‌రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ భూపాల్‌రెడ్డి, కేబీఆర్ ఫౌండేషన్ చైర్మన్ కొన్యాల బాల్‌రెడ్డి, ఏఎంసీ కార్యదర్శి రేవంత్, సర్పంచ్ హంస మహేశ్, ఏఎంసీ డైరెక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- భారీగా విదేశీ సిగరెట్లు స్వాధీనం
- సైన్స్ విద్యార్థులకు ఐఐఎస్ఈఆర్ గొప్ప వేదిక : వినోద్ కుమార్
- తల్లి కాబోతున్న రిచా గంగోపాధ్యాయ
- 2జీ, 3జీ, 4జీ.. ఇవన్నీ తమిళనాడులో ఉన్నాయి: అమిత్ షా
- కొవిడ్ వారియర్స్ క్రికెట్ పోటీల విజేతగా డాక్టర్ల జట్టు
- టీమ్ఇండియా ప్రాక్టీస్ షురూ
- 125 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
- బాయ్‌ఫ్రెండ్‌తో క్లోజ్‌గా శృతిహాసన్..ట్రెండింగ్‌లో స్టిల్స్
- మహారాష్ట్రలో కొత్తగా 8,293 కరోనా కేసులు.. 62 మరణాలు
- సోలార్ పవర్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం