ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Siddipet - Jan 28, 2021 , 00:28:07

అందరి సహకారంతోనే గజ్వేల్‌ను ఆదర్శంగా మారుస్తా

అందరి సహకారంతోనే గజ్వేల్‌ను ఆదర్శంగా మారుస్తా

  • మున్సిపల్‌ చైర్మన్‌ రాజమౌళి 
  • ఏడాది పాలన పూర్తి చేసుకున్న మున్సిపల్‌ పాలకవర్గం

గజ్వేల్‌, జనవరి 27: ప్రజలు, సీఎం కేసీఆర్‌.. మాకు విలువైన బాధ్యతలు అప్పగించారు.. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. కలిసికట్టుగా ఐక్యంగా పని చేసి గజ్వేల్‌ను ఆదర్శ మున్సిపాలిటీగా నిర్మిస్తామని మున్సిపల్‌ చైర్మన్‌ రాజమౌళి అన్నారు. అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా పాలకవర్గం బుధవారం వర్గల్‌ శ్రీవిద్యాసరస్వతీ, శనైశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించింది. అనంతరం గజ్వేల్‌ అర్బన్‌ పార్క్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా చైర్మన్‌ రాజమౌళి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో పా టు స్థానిక నాయకుల సహకారంతో మున్సిపల్‌ పరిధిలో ఏడాది వ్య వధిలో రూ.50 కోట్ల వ్య యంతో అభివృద్ధి పనులను పూర్తి చేశామన్నారు. కొవిడ్‌తో ఇబ్బంది వచ్చినా.. ప్రజలకు సేవలందించడంతోపాటు అభివృద్ధి  పనులు చేపట్టినట్లు వివరించారు. పట్టణంలో యూ జీడీ పనులు 42 శాతం పూర్తయ్యాయని, పారిశుధ్యం, తడి, పొడి చెత్త సేకరణ, హరితహారం, మిషన్‌ భగీరథ పథకాల లక్ష్యాలను పూర్తి చేసినట్లు చైర్మన్‌ రాజమౌళి తెలిపారు. 

ప్లాస్టిక్‌ రహితంగా..

మున్సిపాలిటీని ప్లాస్టిక్హ్రితంగా మార్చడానికి ప్రత్యేక ప్రణాళికతో ముం దుకు సాగుతున్నట్లు రాజమౌళి తెలిపారు. త్వరలో ప్లాస్టిక్‌ రహిత పట్టణాన్ని సాధిస్తామ న్నారు. పట్టణంలో నిత్యం సేకరించే చెత్తతో కంపోస్టు ఎరువును తయారు చేస్తామన్నారు. పట్టణ ప్రజల సమస్యల తక్షణ పరిష్కారానికి ఫిబ్రవరి నుంచి ‘గడపగడపకూ  మున్సిపాలిటీ’ చేపడుతామని తెలిపారు. సిటిజన్‌ చార్టర్‌ను కార్యాయంలో ఏర్పాటు చేసి, చదువురాని వారికి కార్యాలయం సిబ్బంది దరఖాస్తు రాసి ఇవ్వడంతో ఫిర్యాదు చేయడానికి వీలు కల్పిస్తామన్నారు. ఫిబ్రవరి నుంచే పట్టణంలో ఒక్క రూపాయికే వైకుంఠ రథం సేవలను అందుబాటులో తెస్తామని వివరించారు.

ఆర్‌ఆర్‌ కాలనీ అభివృద్ధిని బాధ్యతగా స్వీకరిస్తాం..

గజ్వేల్‌ శివారులో భూ నిర్వాసితుల కోసం నిర్మించిన ఆర్‌ఆర్‌ కాలనీ అభివృద్ధిని బాధ్యతగా స్వీకరిస్తామన్నారు. సంగాపూర్‌, ము ట్రాజ్‌పల్లి శివారులో  6 వేల ఇండ్లతో ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీని నిర్మిస్తున్నారని.. కాలనీలో మౌలిక వసతుల కల్పనతోపాటు కాలనీ అభివృద్ధిని బాధ్యతగా చేస్తామన్నారు. సమావేశంలో వైస్‌ చైర్మన్‌ జకీయొద్దీన్‌, కమిషనర్‌ వెంకటగోపాల్‌, కౌన్సిలర్లు, వారి కుటుంబ స భ్యులు, కార్యాలయ సిబ్బంది ఏడాది సంబురాల్లో పాల్గొన్నారు. 

VIDEOS

logo