శనివారం 27 ఫిబ్రవరి 2021
Siddipet - Jan 27, 2021 , 00:49:30

బాలబాలికలు అన్నిరంగాల్లో రాణించాలి

బాలబాలికలు అన్నిరంగాల్లో రాణించాలి

వీడియో కాన్ఫరెన్స్‌లో గవర్నర్‌  తమిళిసై సౌందర రాజన్‌  

సిద్దిపేట టౌన్‌, జనవరి 26  : బాలబాలికలు అన్నిరంగాల్లో తమదైన ముద్రతో రాణించి అభివృద్ధి చెందాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. 72వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సిద్దిపేట బాలసదనం పిల్లలతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. బాలికలు బాగా చదివి సమాజంలో ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. క్రమశిక్షణ, ఐక్యతతో ఉన్నత స్థాయిలో ఉండాలని సూచించారు. అంతకు ముందు బాలసదనం చిన్నారులు బాలహక్కుల పై ఉపన్యాసం, ఇంటరాక్షన్‌, పిల్లల కేస్‌ స్టడీస్‌ సిద్దిపేట బాలల పరిరక్షణ కమిటీ చేస్తున్న సేవలపై పాటలతో గవర్నర్‌ను ఆకట్టుకున్నారు. చక్కగా ఉపన్యసించిన వారిపై గవర్నర్‌ ప్రశంసల జల్లు కురిపించారు. కార్యక్రమంలో మహిళా శిశుసంక్షేమ శాఖ స్పెషల్‌ సెక్రటరీ, కమిషనర్‌ దివ్య దేవరాజన్‌, జిల్లా సంరక్షణ అధికారి రాంగోపాల్‌రెడ్డి, బాలరక్ష భవన్‌ కో-ఆర్డినేటర్‌ మమత, డీసీపీవో రాము, జిల్లా బాలల పరిరక్షణ విభాగం సిద్దిపేట బాల సదనం సిబ్బంది పాల్గొన్నారు. 

VIDEOS

logo